Saturday, 29 May 2021

లెఫ్టినెంట్ గా బాధ్యతలు చేపటిన పుల్వమా అమర జవాను భార్య "నికిత"

పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ విభూతి శంకర్‌ భార్య నిఖితకౌర్… లెఫ్టినెంట్ గా బాధ్యతలు చేపట్టారు. తన భర్త ట్రైనింగ్ తీసుకున్న చెన్నైలోని అకాడమీలోనే సీటు సాధించి శిక్షణ పొందారు.


విభూతి శంకర్ చనిపోయే నాటికి నిఖితకు పెళ్లయి 9 నెలలే అవుతుంది. 27 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయారు. తనపై జాలి పడొద్దని చెప్పి… ఉద్యోగాన్ని వదిలేసి సైన్యంలో చేరేందుకు శిక్షణ తీసుకున్నారు.

తన భర్త వదిలి వెళ్లిన మార్గాన్ని కొనసాగిస్తున్నానన్న నిఖిత.. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు

The wife of Indian Army officer, Major Vibhuti Shankar Dhoundiyal, who was killed fighting terrorists in Pulwama in February 2019, joined the Indian Army on Saturday

Nitika Kaul passed out from the Officer’s Training Academy in Chennai, Tamil Nadu on Saturday and is now commissioned as a Lieutenant in the Indian Army

Her husband, Major Vibhuti Dhoundiyal was part of an operation in Pinglang area of south Kashmir’s Pulwama on the trail of those behind the Pulwama attack that killed 40 CRPF soldiers.

While the forces were successful in neutralising JeM commander Kamran, one of the key plotters of the Pulwama attack on the CRPF convoy, Major Dhoundiyal along with three others were killed in the attack. For his valour, he was decorated with the Shaurya Chakra. #indianarmy #chinarcorps #youngbites @indianarmy.adgpi @chinarcorpsia follow @youngbitesofficial


శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు ప్రారంభం


శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శ‌నివారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చందనంలతో అభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్ చెంగ‌ల్రాయులు, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

శ్రీ‌వారికి 6 టన్నుల ప్ర‌కృతి వ్య‌వ‌సాయం బియ్యం అందజేత


మే 29, తిరుమల 2021: గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో దేశీయ వ‌రి వంగ‌డాల‌తో పండించిన 6 టన్నుల బియ్యం, 50 కిలోల పసుపు శనివారం తిరుమ‌ల శ్రీ‌వారికి విరాళంగా అందాయి. టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శేఖర్ రెడ్డి, కృష్ణా జిల్లా పిన‌గూడురులంకకు చెందిన రైతు శ్రీ విజ‌య‌రామ్ కలిసి ఈ విరాళాన్ని అందించారు.
దాతల తరఫున వారి ప్రతినిధి ఈ మేర‌కు విరాళాన్ని శ్రీ‌వారి ఆల‌యం వద్ద ఆల‌య డెప్యూటీ ఈఓ శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌కు అంద‌జేశారు. ఇందులో 25 కిలోల పసుపును తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అందించాలని దాతలు కోరారు.


Friday, 28 May 2021

ఓటుకు నోటు కేసు చంద్రబాబు డైరెక్షన్లోనే -. శైలజా చరణ్ రెడ్డి


ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినదని వైకాపా రాష్ట్ర మహిళా నాయకురాలు శైలజ రెడ్డి అన్నారు. గురువారం ఆమే విలేకరులతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో ఈడీ చార్జీషీట్‌ దాఖలు చేశారని, చార్జిషీట్‌లో ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డితో పాటు వేం కృష్ణ కీర్తన్‌రెడ్డి, స్టీఫెన్‌సన్‌, చంద్రబాబు పాత్ర కూడా కీలకంగా ఉన్నదని, బ్రీఫ్‌డ్‌ మీ తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా  వెలుగులోకి ఓటుకు కోట్లు కేసు ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు చేశారనేది, ఈ కేసులో ప్రధాన ఆరోపణ ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగం స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబే అంటూ ఇప్పటికే  ధ్రువీకరించిన ఫోరెన్సిక్‌ నివేదిక ఉత్కంఠ ఓటుకు నోటు కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఛార్జ్‌షీట్‌ దాఖలు 2015 మే 31న నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కి అతని ఇంట్లోనే రూ. 50 లక్షలు ఆఫర్‌ చేస్తూ రేవంత్‌ రెడ్డి వీడియో కెమెరాకు చిక్కడంతో ఈ కేసు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత జరిపిన విచారణలో 'మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ' వ్యవహరం వెలుగు చూసింది.దాదాపు ఆరేళ్ల పాటు వివిధ కోణాల్లో సమాచారం సేకరించి పక్కా ఆధారాలతో ఈడీ చార్జీషీట్‌ దాఖలు చేసినట్టు సమాచారం. దీంతో ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందనే దానిపై రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.

Wednesday, 26 May 2021

ఆయన మనసే ఓ స్కానర్... నాడీ చూస్తే రోగం చప్పేస్తారంతే....

ఆయనొక నడిచే ఆయుర్వేద విజ్ఞాన సర్వస్వం. అపర ధన్వంతరి. నాడీ పరీక్షలో ఆయనను మించిన వారు లేరేమో. బసంత్ థియేటర్ వెనుక సందులో ఆయుర్వేద వైద్యులు రంగాచారి గారి ఆసుపత్రికి  మబ్బుల మూడుగంటల నుంచే పేషెంట్లు వచ్చి వరుసలో కూర్చుంటరు. ఉదయం స్నానం చెయ్యకముందయితేనే నాడి  సరిగ్గ తెలుస్తుందట. నీ జబ్బేమిటి నీ అవస్థేమిటి అని ఆయన రోగిని అస్సలు అడగడు. చెప్పబోతే కూడా వద్దని వారిస్తారు. క్షణ కాలం  నాడీ పట్టుకుంటె చాలు స్కాన్ తీసినట్టు మన దైహిక పరిస్థితి అంతా ఆయనే అలవోకగా చెప్పేస్తారు. నాకు నాడీ పరీక్ష చేసి మీకు దేహం లో ఒక చోట కణితి ఉంది అన్నారు. నిజమే .. నాకు ఎప్పటినుంచో ఛాతీలో ఒకచోట కొంచెం దుర్మాంసం పెరిగి ఉంది . డాక్టర్లు పరీక్ష చేసి దాంతో పెద్ద ప్రమాదం లేదంటే వదిలేసాను. నా వెంట వచ్చిన మరో మిత్రుడికి ప్రొస్టేట్ గ్లాండ్ వాచింది అని చెప్పారు. అతనికి అప్పటికా విషయం తెలియదు. తర్వాత హాస్పిటల్ లో పరీక్ష చేస్తే అది నిజమని తేలింది. నేను అయనిచ్చిన మందులు  సరిగ్గా వాడకుండా మళ్ళ పోతే మీరు మందులు వాడలేదని కోప్పడ్డడు. రుచిగా ఉన్నాయి కనక అసవలు తాగారు . చేదుగా ఉన్న చూర్ణాలు సరిగ్గ వాడలేదు అన్నడు.  నాడీ పరీక్షతో ఈయన కు ఈ సంగతి కూడా తెలుస్తుందా అని ఆశ్చర్య పోయాను . చాలా మంది మిత్రుల్ని ఆయన దగ్గరికి తీసుకు వెళ్ళాను. క్రమశిక్షణగా మందులు వాడిన వాళ్ళందరికీ మంచి గుణం కనిపించింది.                                               ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్ కృష్ణకాంత్ కు రంగాచారి గారి వైద్యమంటే చాలా గురి. అయన ఇక్కడ గవర్నర్ గా ఉన్ననాళ్ళూ రంగాచారి గారి దగ్గర వైద్యం చేయించుకునే వారు. రంగాచారి గారి తాతగారు నిజాం రాజ పరివారానికి వైద్యం చేసి చాలా కీర్తిప్రతిష్టలు గడించిన వారు.  వైద్య విజ్ఞానం వారికి పరంపరగా వచ్చింది. మహా భిషగ్వరుడు రంగాచారి గారు రెండురోజుల క్రితం అనాయాస మరణం పొందారు. పారంపరికమైన వైద్య విజ్ఞానం ,  88 ఏండ్ల అపార అనుభవం కలిగిన రంగాచార్యులు గారు ఎన్నడూ ప్రచారాన్ని కోరుకోలేదు. ఆయన గురించిన సమాచారం కూడా ఎక్కడా అందుబాటులో లేదు. రంగాచారి గారి అనుభవాల సంపుటి గనుక రికార్డు అయ్యుంటే ఆయుర్వేద విద్యార్థులకు కరదీపిక గా మారుండేది.  దేశీయ వైద్య విజ్ఞానఖని రంగాచారి గారికి  నా వినమ్ర నివాళి💐🙏

#NB : మిత్రులు Deshapathi Srinivas గారి Post యధాతతంగా...
ఈ "బసంత్ టాకీస్" అనేది హైదరాబాద్, కాచిగూడ "X" క్రాస్ రోడ్స్ లో, వైశ్య హాస్టల్ వెనుక వైపు సందులో వుంటుంది, అయితే ఇప్పుడక్కడ "బసంత్ టాకీస్" అనే దానిని కూల్చేసి "బసంత్ అపార్ట్మెంట్స్" కట్టారు.

సుందరకాండ అఖండ పఠనమ్ @ 412 రోజులు..


ప్రపంచ మానవాళి ఆరోగ్యంగా వుండాలని.. కరోనా విపత్తు తొలగిపోవాలని కోరుతూ టిటిడి నిర్వహించిన  అఖండ సుందరికాండ పారాయణంలో బుధవారం ఉదయం  58 సర్గాల నుండి 167 శ్లోకాల పఠనంతో నాద నీరంజనం వేదిక ప్రతిధ్వనించింది.
ఈ సందర్భంగా హంపికి చెందిన శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ తిరుమలలో జరిగే సుందరకాండ పఠనంలో పాల్గొనడం తనకు ఆశీర్వాదం అని అన్నారు
ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్ అవధాని మాట్లాడుతూ, మానవాళి శ్రేయస్సు కోసం తిరుమల వద్ద టిటిడి నిర్వహించిన పరాయణ మహోత్సవం మే 26 న 350 రోజుల సుందరకాండ పఠనంతో సహా మొత్తం 412 రోజులు పూర్తి చేసిందని అన్నారు.
అఖండ పఠనం 14 వ ఎడిషన్‌లో 167 శ్లోకాలను వేద పండితులు శ్రీ పివిఎల్‌ఎన్ మారుతి, శ్రీ కెఎస్ఎస్ అవధాని పర్యవేక్షణలో శ్రీ ఎం పవన్ కుమార్ శర్మ జపించారు.
ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ఎస్‌విబిసిలో ప్రత్యక్ష ప్రసారం చూడటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తమ ఇళ్ల నుంచి పఠనం మహోత్సవంలో పాల్గొన్నారు.
టిటిడి అదనపు ఇఓ శ్రీ ఎవి ధర్మరెడ్డి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య మురళీధర్ శర్మ, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపక సభ్యులు, వేద పండితులు మరియు అధికారులు పాల్గొన్నారు.

ALIPIRI FOOTPATH CLOSED FROM JUNE 1 To JULY 31


With a view to fast track the repair and top-slab works of the footpath from Alipiri to Tirumala, the TTD has announced its closure from June 1 to July 31.
TTD stated that the devotees desiring to reach Tirumala on foot could utilise the Srivari Mettu path. 

Devotees are requested to note that TTD would provide free buses up to Srivari Mettu from Alipiri.