Thursday, 2 July 2026

*విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*

*విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*
-------------------------------------------------------------------
*మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి*
-------------------------------------------------------------------
*కొణిజెర్ల మండలం పల్లిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్దులతో కలిసి మద్యాహ్న బోజనం చేసిన జిల్లా కలెక్టర్*
-------------------------------------------------------------------
ఖమ్మం, కొణిజర్ల, జూలై -02: ప్రభుత్వ విద్యా సంస్ధలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని, ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపెడతారనీ జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.గురువారం వైరా నియోజకవర్గ పర్యటనలో భాగంగా కొణిజెర్ల మండలం పల్లిపాడు గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రత, తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీటి వసతి, వంటగది నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ దివాకర టిఎస్ మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలకు వడ్డిస్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు.భోజనం రుచిగా ఉందా, మెనూ ప్రకారం గుడ్డు, వెజిటబుల్ బిర్యానీ, పప్పు, సాంబారు అందిస్తున్నారా, ఆహారం పరిశుభ్రంగా తయారవుతోందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో కీలకమని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం వినియోగించాలని, ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేసి తాజా కూరగాయలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, హాజరు శాతం పెంచేందుకు తల్లిదండ్రులతో నిరంతరం సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజనం, మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ విద్యపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కొణిజెర్ల తహసీల్దార్ అరుణ, వైరా మున్సిపల్ కమీషనర్ రామచందర్ రావు, ఎంఈవో చావా శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

*దశలవారీగా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు : రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*

"క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో  టెండర్లు"
"తుది దశలో స్ధలాల సేక‌ర‌ణ‌"
"దశలవారీగా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు"
"19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా వెయ్యి ఇళ్ల వ‌రకునిర్మాణం"
"మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి"

క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ మరో రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన పట్టాలను గురువారం నాడు మంత్రి సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్ధానిక‌ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రతి పేద కుటుంబానికి ఇల్లు” అనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. క్యూర్ ప‌రిధిలోని  19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో చోట కనీసం 500 నుంచి 1000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం రెండో, మూడో విడతల్లో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 5500 వరకు ఇళ్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ ఎకరాకు రూ.100 నుంచి రూ.200 కోట్ల వరకు ఉన్నా కూడా ఆ భూముల విలువను పక్కనబెట్టి పేదలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి వారి పేరిట పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు.ధూల్‌పేట ప్రాంతంలో గత ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 125 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అందిస్తున్నామని, మిగిలిన పేదలకు కూడా ఇళ్లు మంజూరు చేసేలా పరిసర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించేందుకు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
     పేదలను నగరాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలోకి తరలించి ఇళ్లు కట్టే విధానం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదని, వారి జీవనాధారాలకు దగ్గరగా, అదే నియోజకవర్గ పరిధిలోనే ఇళ్లు అందించడం ప్రభుత్వ కట్టుబాటు అని మంత్రి స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే కేవలం రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తుందని, అది సాధ్యం కాకపోతే తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని విసిరిన సవాల్‌కు ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతల నుంచి స్పందన రాలేదని గుర్తుచేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో ప్రయోజనం లేదనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ మాత్రం అదే నిధులను పేదల గూడు కోసం వినియోగిస్తోందన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా గుడిసెల్లేని తెలంగాణ లక్ష్యాన్ని సాధిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Wednesday, 1 July 2026

నిజామాబాద్ లో నకిలీ అక్రీడేషన్ కలకలం

కొత్త అక్రిడేషన్ కార్డుల పేరుతో కిలాడీ ప్లాన్.. 
కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ కార్డు తయారీ..!*
నిజామాబాద్ జిల్లాలో నఖీలీ అక్రెడిటేషన్ కార్డు కలకలం రేపింది.
ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి మరీ చెలామని చేసారు. దీంతో ఓ నకిలీ కార్డు తయారు చేసి ఓ నఖీలీ రిపోర్టర్ చలామని అవుతున్నారు. ఇటీవల కొన్ని రోజులు క్రితం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కొత్త అక్రెడిటేషన్ కార్డులను జారీ చేసింది.
*కొత్త కార్డులు జారీ..*
గతంలో జర్నిస్టులు అక్రెడిటేషన్ కలిగిన వారు సైతం వారి వివరాలను మరో సారి సరి చేసుకిని కొత్త కార్డులకు అప్లై చేసుకోనుటకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ప్రభుత్వం కొన్ని కఠిన మైన నిబంధనలతో కూడిన పక్కా ప్రణాళికతో జర్నలిస్టు లకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో ఓ చానల్ పేరుతో ఓ వ్యక్తి ఏకంగా జిల్లా కలెక్టర్ సంతాన్ని ఫోర్జరీ చేసి మరీ మండల స్థాయి కార్డును తయారుచేసిన ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది

36 గంటలు శ్రమ...5ఆపరేషన్లు.. ఒక పేషెంట్లకు ఊపిరిలుదిన ఉస్మానియా వైద్య బృందం

*డాక్టర్స్ డే నాడు ఉస్మానియా వైద్య బృందం అద్భుతం చేసి చూపారు....  36 గంటలపాటు శ్రమించి పేషంట్‌కు ఒకేసారి అయిదు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. 
సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్‌కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన రికార్డును సాధించారని పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం ఈ విజయాన్ని సాధించి వైద్య వృత్తికి మరింత ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా వైద్యులు, ఇతర సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.*