Thursday, 6 August 2026

*నూతన ఆలోచనలు - సృజనాత్మకత లక్ష్యంగా యస్.బి.ఐ.టి. విద్యార్థులు*

 ఖమ్మం (సత్యన్యూస్)విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణాత్మక ఆలోచనలు, స్టార్టప్ వ్యవస్థ, ఇంక్యుబేషన్, హ్యాకథాన్‌లు, ఐడియాథాన్‌లపై అవగాహన కల్పించే లక్ష్యంతో తమ కళాశాల విద్యార్థులు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆవిష్కరణ కేంద్రాలైన ఉయ్-హబ్, టి-హబ్, టి-వర్స్క్ లను పారిశ్రామిక విద్యా పర్యటనలో భాగంగా సందర్శించారని కళాశాల ఛైైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయా సంస్థల నిపుణులు విద్యార్థులకు స్టార్టప్‌ల స్థాపన, ఇంక్యుబేషన్ ప్రక్రియ, వినూత్న ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా మలచే విధానం, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.

  హ్యాకథాన్‌లు, ఐడియాథాన్‌లు విద్యార్థుల సమస్య పరిష్కార సామర్థ్యాన్ని, జట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు.  టి-వర్స్క్ లో అత్యాధునిక ప్రోటోటైపింగ్ సదుపాయాలు, డిజైన్ మరియు తయారీ సాంకేతికతలను విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు.కళాశాల వైస్-ఛైర్మన్ కె. శ్రీచైతన్య మాట్లాడుతూ ఉయ్-హబ్‌లో మహిళా పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహక కార్యక్రమాల గురించి తెలుసుకోగా, టి-హబ్‌లో స్టార్టప్‌ల అభివృద్ధి, మెంటరింగ్, పెట్టుబడి అవకాశాలు, ప్రపంచ స్థాయి ఇంక్యుబేషన్ విధానాలపై విద్యార్ధులు సమగ్ర అవగాహన పొందారని తెలిపారు.    ఈ పారిశ్రామిక విద్యా పర్యటన ద్వారా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు, వ్యవస్థాపకత (ఎంట్రప్రెన్యూవర్షిప్), పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం పట్ల మరింత ఆసక్తిని పెంపొందించుకున్నారని, భవిష్యత్తులో హ్యాకథాన్‌లు, ఐడియాథాన్‌లు, స్టార్టప్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్  డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, ఇన్నోవేషన్ సెల్ ఇన్‌ఛార్జ్ పి. అశ్విని, టి.పి.ఒ.  డా॥ యన్. సవిత తదితరులు పాల్గొన్నారు.
__________________________________________
"స్వర్ణభారతి విద్యార్థులకు అరుదైన అవకాశం"
*ప్రధానితో ముఖాముఖీలో యస్.బి.ఐ.టి. విద్యార్ధులు*
 
సత్యన్యూస్ : స్వర్ణ భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (యస్.బి.ఐ.టి.) ఖమ్మం విద్యార్థులు మరోసారి విశిష్టమైన గుర్తింపు పొందారు. వికసిత్ భారత్-2047 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మై భారత్ కార్యక్రమం ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖాముఖి సంభాషించే అరుదైన అవకాశానికి ఖమ్మం జిల్లా తరఫున యస్.బి.ఐ.టి.కి చెందిన 10 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ అరుదైన అవకాశం విద్యార్థులకు దేశ నిర్మాణంలో యువత పాత్ర, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతలు మరియు భారతదేశ అభివృద్ధి దిశగా తమ ఆలోచనలను పంచుకునే గొప్ప వేదికగా నిలిచింది. ఖమ్మం జిల్లా తరఫున ఎంపిక కావడం యస్.బి.ఐ.టి.కి ఎంతో గర్వకారణమని కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి  విద్యార్థులను అభినందిస్తూ, విద్యార్థులు విద్యలోనే కాకుండా సహపాఠ్య, సామాజిక సేవ, నాయకత్వం మరియు జాతీయ స్థాయి కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని కళాశాల ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తోందన్నారు. ఇటువంటి అవకాశాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతను గుర్తించేలా చేస్తాయని ఆయన పేర్కొన్నారు.యస్.బి.ఐ.టి. సంస్థ నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమలతో అనుసంధానం, విలువల ఆధారిత విద్య మరియు సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, దేశానికి సేవ చేసే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తోందని కళాశాల వైస్ చైర్మన్ కె. శ్రీచైతన్య తెలిపారు.ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్‌కుమార్  అభినందించి తమ విద్యార్ధులకు ఈ సదవకాశాన్నిచ్చిన ఖమ్మం కలెక్టర్ దివాకర, జిల్లా యువ అధికారి యమ్. వెంకట్ రాంబాబు కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.  
ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్స్ గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
The Globes News 🌎 Com
Powered by: 
MANIKUMAR KOMMAMURU 
Senior journalist 
📲: 9032075966.

Thursday, 2 July 2026

*విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*

*విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*
-------------------------------------------------------------------
*మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి*
-------------------------------------------------------------------
*కొణిజెర్ల మండలం పల్లిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్దులతో కలిసి మద్యాహ్న బోజనం చేసిన జిల్లా కలెక్టర్*
-------------------------------------------------------------------
ఖమ్మం, కొణిజర్ల, జూలై -02: ప్రభుత్వ విద్యా సంస్ధలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని, ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపెడతారనీ జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.గురువారం వైరా నియోజకవర్గ పర్యటనలో భాగంగా కొణిజెర్ల మండలం పల్లిపాడు గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రత, తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీటి వసతి, వంటగది నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ దివాకర టిఎస్ మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలకు వడ్డిస్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు.భోజనం రుచిగా ఉందా, మెనూ ప్రకారం గుడ్డు, వెజిటబుల్ బిర్యానీ, పప్పు, సాంబారు అందిస్తున్నారా, ఆహారం పరిశుభ్రంగా తయారవుతోందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో కీలకమని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం వినియోగించాలని, ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేసి తాజా కూరగాయలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, హాజరు శాతం పెంచేందుకు తల్లిదండ్రులతో నిరంతరం సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజనం, మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ విద్యపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కొణిజెర్ల తహసీల్దార్ అరుణ, వైరా మున్సిపల్ కమీషనర్ రామచందర్ రావు, ఎంఈవో చావా శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

*దశలవారీగా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు : రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*

"క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో  టెండర్లు"
"తుది దశలో స్ధలాల సేక‌ర‌ణ‌"
"దశలవారీగా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు"
"19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా వెయ్యి ఇళ్ల వ‌రకునిర్మాణం"
"మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి"

క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ మరో రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన పట్టాలను గురువారం నాడు మంత్రి సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్ధానిక‌ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రతి పేద కుటుంబానికి ఇల్లు” అనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. క్యూర్ ప‌రిధిలోని  19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో చోట కనీసం 500 నుంచి 1000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం రెండో, మూడో విడతల్లో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 5500 వరకు ఇళ్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ ఎకరాకు రూ.100 నుంచి రూ.200 కోట్ల వరకు ఉన్నా కూడా ఆ భూముల విలువను పక్కనబెట్టి పేదలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి వారి పేరిట పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు.ధూల్‌పేట ప్రాంతంలో గత ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 125 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అందిస్తున్నామని, మిగిలిన పేదలకు కూడా ఇళ్లు మంజూరు చేసేలా పరిసర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించేందుకు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
     పేదలను నగరాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలోకి తరలించి ఇళ్లు కట్టే విధానం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదని, వారి జీవనాధారాలకు దగ్గరగా, అదే నియోజకవర్గ పరిధిలోనే ఇళ్లు అందించడం ప్రభుత్వ కట్టుబాటు అని మంత్రి స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే కేవలం రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తుందని, అది సాధ్యం కాకపోతే తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని విసిరిన సవాల్‌కు ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతల నుంచి స్పందన రాలేదని గుర్తుచేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో ప్రయోజనం లేదనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ మాత్రం అదే నిధులను పేదల గూడు కోసం వినియోగిస్తోందన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా గుడిసెల్లేని తెలంగాణ లక్ష్యాన్ని సాధిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Wednesday, 1 July 2026

నిజామాబాద్ లో నకిలీ అక్రీడేషన్ కలకలం

కొత్త అక్రిడేషన్ కార్డుల పేరుతో కిలాడీ ప్లాన్.. 
కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ కార్డు తయారీ..!*
నిజామాబాద్ జిల్లాలో నఖీలీ అక్రెడిటేషన్ కార్డు కలకలం రేపింది.
ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి మరీ చెలామని చేసారు. దీంతో ఓ నకిలీ కార్డు తయారు చేసి ఓ నఖీలీ రిపోర్టర్ చలామని అవుతున్నారు. ఇటీవల కొన్ని రోజులు క్రితం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కొత్త అక్రెడిటేషన్ కార్డులను జారీ చేసింది.
*కొత్త కార్డులు జారీ..*
గతంలో జర్నిస్టులు అక్రెడిటేషన్ కలిగిన వారు సైతం వారి వివరాలను మరో సారి సరి చేసుకిని కొత్త కార్డులకు అప్లై చేసుకోనుటకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ప్రభుత్వం కొన్ని కఠిన మైన నిబంధనలతో కూడిన పక్కా ప్రణాళికతో జర్నలిస్టు లకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో ఓ చానల్ పేరుతో ఓ వ్యక్తి ఏకంగా జిల్లా కలెక్టర్ సంతాన్ని ఫోర్జరీ చేసి మరీ మండల స్థాయి కార్డును తయారుచేసిన ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది

36 గంటలు శ్రమ...5ఆపరేషన్లు.. ఒక పేషెంట్లకు ఊపిరిలుదిన ఉస్మానియా వైద్య బృందం

*డాక్టర్స్ డే నాడు ఉస్మానియా వైద్య బృందం అద్భుతం చేసి చూపారు....  36 గంటలపాటు శ్రమించి పేషంట్‌కు ఒకేసారి అయిదు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. 
సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్‌కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన రికార్డును సాధించారని పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం ఈ విజయాన్ని సాధించి వైద్య వృత్తికి మరింత ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా వైద్యులు, ఇతర సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.*

Tuesday, 30 June 2026

కబ్జాలపై వెంటనే చర్యలు తీసుకోండి : నవతరెడ్డి డిమాండ్

*కబ్జాదారుల గుప్పిట్లో 50 కోట్ల CMC(GHMC) బల్దియా భూమి!*

 *శేరిలింగంపల్లి చందానగర్‌లో 4 వేల గజాల  స్థలం ఆక్రమణ*

 *అడ్డగోలుగా ప్రహరీ కూల్చి ఆక్రమించిన CMC అధికారుల మొద్దునిద్ర*

 *బి ఆర్ ఎస్ ప్రభుత్యం హయాంలో మహిళా భవనం కు,ఫంక్షన్ హాల్ కోసం భూమి  కేటాయిస్తే  కాంగ్రెస్ ప్రభుత్యలో  కబ్జాదారుల పాలు*

 *కలెక్టర్ ఇచ్చిన అధికారిక పత్రంలు ఇచ్చిన  చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న సీఎంసీ యంత్రాంగం*

 *ప్రజాప్రతినిధి అండతో మున్సిపల్ అధికారుల తీరుపై మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ద్యాజం*

 *తక్షణమే ఉన్నతాధికారులు స్పందించకపోతే మహిళలతో కలిసి  న్యాయపోరాటం తప్పదని హెచ్చరిక*

*చందానగర్:*
మహిళమణుల  అవసరాల కోసం కేటాయించిన సుమారు 50 కోట్ల విలువైన CMC భూమి కబ్జాదారుల పాలవుతున్నా మున్సిపల్ అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు. కాపాడాల్సిన అధికారులే ప్రజాప్రతినిధి అండతో కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చందానగర్ డివిజన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ బాగోతం మున్సిపల్ అధికారుల అంతులేని నిర్లక్ష్యానికి, అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది. సొంత భూమిని రక్షించుకోవడంలో విఫలమైన అధికారుల తీరుపై చందానగర్ మాజీ కార్పొరేటర్, న్యాయవాది బొబ్బ నవతారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్,డిప్యూటీ కమిషనర్ కు,గత 2 సంవత్సరాలుగా పిర్యాదు చేస్తున్న పట్టించుకోవడం లేదు అని  ఉన్నతాధికారులకు ఈ రోజు  ఆమె ఘాటైన లిఖితపూర్వకంగా  ఫిర్యాదు చేశారు.చందానగర్ డివిజన్ కైలాష్ నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 210లో సుమారు 4 వేల గజాల స్థలం ఉంది. దీని బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ. 50 కోట్లు ఉంటుంది. ఈ స్థలంలో మహిళా భవనం, మోడల్ మార్కెట్, ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2018 (మార్చి 7న), 2019 (మే 5న) ప్రొసీడింగ్స్ (LC1/3076/2016) ద్వారా మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించారు. దీని ప్రకారం 2019లోనే కార్పొరేషన్ అధికారులు ఆ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించి, గేటు కూడా ఏర్పాటు చేశారు. అయితే, కబ్జాదారులు 2022 ఆగస్టు 10న, 2024 ఫిబ్రవరి 9న దౌర్జన్యంగా ఆ ప్రహరీని కూల్చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక మున్సిపల్ అధికారులు చోద్యం చూశారే తప్ప చర్యలు తీసుకోలేదు.

స్థలం ఆక్రమణకు గురవుతుండటంపై మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా.. అధికారులు అత్యంత బాధ్యతారాహిత్యంగా బదులిచ్చారు. అది మాది కాదు  ప్రభుత్వ భూమి అని, దానికి సంబంధించిన వివరాలు తమ వద్ద లేవని తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె స్వయంగా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీలను జతచేసి.. 2024లో అప్పటి డెప్యూటీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. 2025 నవంబర్‌లో సైతం జోనల్ కమిషనర్‌కు మరోసారి వినతిపత్రం ఇచ్చారు. అయినా ఉన్నతాధికారుల్లో ఉలుకూ పలుకూ లేదు.మున్సిపల్ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకున్న కొందరు, అదే స్థలంలో టీజీఎస్పీడీసీఎల్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి తెరతీశారు. దీనిపై నవతారెడ్డి ఆర్టీఐ ద్వారా విద్యుత్ శాఖను వివరణ కోరగా.. ఆ భూమికి సంబంధించి తమ వద్ద ఎలాంటి అధికారిక కేటాయింపు పత్రాలు లేవని,ప్రజాప్రతినిధుల సూచనతో నిర్మాణం చేశామని  సమాధానమిచ్చారు. ఇదే విషయమై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను నిలదీయగా.. తాము విద్యుత్ శాఖకు  హెచ్ఎంసీ యాక్ట్ యూ బై ఎస్  635 కింద నోటీసులు ఇచ్చామని చేతులు దులుపుకున్నారు. కోట్లాది రూపాయల భూమిని ఆక్రమించి,ఎలాంటి అనుమతులు లేకుండా స్థలంలో పత్రాలు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే నోటీసులు ఇచ్చి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా జీహెచ్ఎంసీ/సీఎంసీ అధికారులు చోద్యం చూస్తున్నారు. రూ.50 కోట్ల ప్రజా ధనాన్ని కబ్జాదారులకు ధారాదత్తం చేస్తున్నారు. కలెక్టర్ ప్రొసీడింగ్స్ ప్రకారం తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకుని, మహిళా భవనం, ఫంక్షన్ హాల్ నిర్మించాలి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి తక్షణమే అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మున్సిపల్ అధికారుల తీరును ఎండగడుతూ పెద్ద ఎత్తున మహిళ పోరాటం, న్యాయ పోరాటం చేస్తామని బొబ్బ నవతారెడ్డి హెచ్చరించారు.

ఆవేదన అంచుల నుండి ఆనందపు తీరాలకు.. ఇది ఓ నిహారిక కధ

కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేసుకున్నవి కావు… దేవుడు మన కోసం ముందే రాసిపెట్టినవి… ❤️🙏🏻

ఎన్నో సంవత్సరాలుగా సినిమాలు చూశాను…
అప్పుడప్పుడు నటించాను…
సినిమాల కోసం పని చేశాను…

కానీ ఈ రోజు…
సెన్సార్ బోర్డు మెంబర్‌గా నా మొదటి సినిమా చూసిన రోజు. 🎬

సినిమా పూర్తయ్యాక…
చర్చలు జరిగాయి…
సంతకాలు చేసి బయటికి వచ్చిన ఆ కొన్ని నిమిషాలు…
నా కాళ్లు ముందుకు నడుస్తున్నాయి…
కానీ నా మనసు మాత్రం ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయింది.

“అసలు ఇదంతా నేనేనా…?” అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను.

20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు…
చేతిలో ఏమీ లేదు…
Inter కూడా పూర్తి చేయలేక మధ్యలోనే ఆగిపోయాను.
ఒక చిన్న ఉద్యోగం దొరికితే చాలు…
జీవితం నెట్టుకొస్తే చాలు…
అనుకున్న ఒక సాధారణ అమ్మాయి.

కానీ…
దేవుడు రాసిన కథ వేరేలా ఉంది.

రెండేళ్లకే అనుకోకుండా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాను…
పెళ్లి తర్వాత ఇక సినిమాలకు దూరంగా ఉండాలని అనుకున్నాను…
కానీ జీవితానికి మన ప్లాన్ల కంటే దేవుడి ప్లాన్ ఎప్పుడూ గొప్పదే.

మళ్లీ సినిమాల్లోకి వచ్చాను…
పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పూర్తి చేశాను…
అమ్మ కలను నా కలగా మార్చుకొని Niharika Design Studio ప్రారంభించాను.
కరోనా సమయంలో మీ అందరి ప్రేమ, సహకారంతో  Foundation ద్వారా ఎంతోమంది జీవితాల్లో చిన్న వెలుగుగా నిలిచే అవకాశం వచ్చింది.

ఈ ప్రయాణంలో…
“ఇంకో అడుగు కూడా వేయలేను… నా వల్ల కాదు…”
అని కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి.

“ఇక బ్రతకడం ఎందుకు…”
అనే ఆలోచన కూడా ఎన్నోసార్లు వచ్చింది.

కానీ…
ఈ రోజు…
ఆ ఆలోచన కూడా నన్ను తాకలేని స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు.

అవును…
ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నాను…
కొన్నిసార్లు మళ్లీ బలహీనపడుతాను…
మళ్లీ లేస్తాను…

ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక విషయం బాగా తెలుసు…

దేవుడు ఆలస్యం చేయవచ్చు… కానీ మన జీవితంలో జరిగే ప్రతి మంచి విషయానికి సరైన సమయాన్నే ఎంచుకుంటాడు. ❤️

ఈ రోజు నాకు ఈ సినిమా ఇంకో కారణం వల్ల కూడా చాలా ప్రత్యేకం…

చిన్నప్పటి నుంచీ నేను ఎంతో అభిమానించే నా Real Hero సినిమా…
అదే సినిమాను సెన్సార్ బోర్డు మెంబర్‌గా చూసే అదృష్టం రావడం…
నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. 🎥✨

కొన్ని స్థానాలు…
కొన్ని అవకాశాలు…
మనమే వెతికి సంపాదించేవి కావు…

దేవుడు పిలిచి… “ఇది నీ సమయం” అని ఇచ్చేవి.

ఈ అవకాశం కూడా నాకు అలాంటిదే.

 ఈ నమ్మకం ఉంచి…
ఈ బాధ్యతకు నన్ను గుర్తించి, నా పేరును సూచించి, ఈ అవకాశం రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻

భగవాన్… కామాక్షి అమ్మ…
మీ ప్రేమ…
మీ కృప…
మీ ఆశీర్వాదం లేకుండా నా జీవితంలో ఏదీ సాధ్యం కాదు.

Everything I am… Everything I have… is only because of Your unconditional love. ❤️🙏🏻

అంతా మీ కృప… మీ ఆశీర్వాదమే… 🙏🏻

#GratitudeAlways #BlessedJourney #CensorBoardMember #DivineGrace #DreamsDoComeTrue ❤️🙏🏻