Thursday, 2 July 2026

*విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*

*విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి.... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*
-------------------------------------------------------------------
*మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి*
-------------------------------------------------------------------
*కొణిజెర్ల మండలం పల్లిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్దులతో కలిసి మద్యాహ్న బోజనం చేసిన జిల్లా కలెక్టర్*
-------------------------------------------------------------------
ఖమ్మం, కొణిజర్ల, జూలై -02: ప్రభుత్వ విద్యా సంస్ధలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని, ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపెడతారనీ జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.గురువారం వైరా నియోజకవర్గ పర్యటనలో భాగంగా కొణిజెర్ల మండలం పల్లిపాడు గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రత, తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీటి వసతి, వంటగది నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ దివాకర టిఎస్ మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలకు వడ్డిస్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు.భోజనం రుచిగా ఉందా, మెనూ ప్రకారం గుడ్డు, వెజిటబుల్ బిర్యానీ, పప్పు, సాంబారు అందిస్తున్నారా, ఆహారం పరిశుభ్రంగా తయారవుతోందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో కీలకమని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం వినియోగించాలని, ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేసి తాజా కూరగాయలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, హాజరు శాతం పెంచేందుకు తల్లిదండ్రులతో నిరంతరం సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజనం, మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రభుత్వ విద్యపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కొణిజెర్ల తహసీల్దార్ అరుణ, వైరా మున్సిపల్ కమీషనర్ రామచందర్ రావు, ఎంఈవో చావా శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

*దశలవారీగా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు : రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*

"క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో  టెండర్లు"
"తుది దశలో స్ధలాల సేక‌ర‌ణ‌"
"దశలవారీగా ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు"
"19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా వెయ్యి ఇళ్ల వ‌రకునిర్మాణం"
"మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి"

క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ మరో రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన పట్టాలను గురువారం నాడు మంత్రి సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్ధానిక‌ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రతి పేద కుటుంబానికి ఇల్లు” అనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. క్యూర్ ప‌రిధిలోని  19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో చోట కనీసం 500 నుంచి 1000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం రెండో, మూడో విడతల్లో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 5500 వరకు ఇళ్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ ఎకరాకు రూ.100 నుంచి రూ.200 కోట్ల వరకు ఉన్నా కూడా ఆ భూముల విలువను పక్కనబెట్టి పేదలకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి వారి పేరిట పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు.ధూల్‌పేట ప్రాంతంలో గత ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 125 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అందిస్తున్నామని, మిగిలిన పేదలకు కూడా ఇళ్లు మంజూరు చేసేలా పరిసర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించేందుకు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
     పేదలను నగరాల నుంచి 30 కిలోమీటర్ల దూరంలోకి తరలించి ఇళ్లు కట్టే విధానం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదని, వారి జీవనాధారాలకు దగ్గరగా, అదే నియోజకవర్గ పరిధిలోనే ఇళ్లు అందించడం ప్రభుత్వ కట్టుబాటు అని మంత్రి స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే కేవలం రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తుందని, అది సాధ్యం కాకపోతే తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని విసిరిన సవాల్‌కు ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతల నుంచి స్పందన రాలేదని గుర్తుచేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో ప్రయోజనం లేదనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ మాత్రం అదే నిధులను పేదల గూడు కోసం వినియోగిస్తోందన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా గుడిసెల్లేని తెలంగాణ లక్ష్యాన్ని సాధిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

Wednesday, 1 July 2026

నిజామాబాద్ లో నకిలీ అక్రీడేషన్ కలకలం

కొత్త అక్రిడేషన్ కార్డుల పేరుతో కిలాడీ ప్లాన్.. 
కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ కార్డు తయారీ..!*
నిజామాబాద్ జిల్లాలో నఖీలీ అక్రెడిటేషన్ కార్డు కలకలం రేపింది.
ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి మరీ చెలామని చేసారు. దీంతో ఓ నకిలీ కార్డు తయారు చేసి ఓ నఖీలీ రిపోర్టర్ చలామని అవుతున్నారు. ఇటీవల కొన్ని రోజులు క్రితం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కొత్త అక్రెడిటేషన్ కార్డులను జారీ చేసింది.
*కొత్త కార్డులు జారీ..*
గతంలో జర్నిస్టులు అక్రెడిటేషన్ కలిగిన వారు సైతం వారి వివరాలను మరో సారి సరి చేసుకిని కొత్త కార్డులకు అప్లై చేసుకోనుటకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ప్రభుత్వం కొన్ని కఠిన మైన నిబంధనలతో కూడిన పక్కా ప్రణాళికతో జర్నలిస్టు లకు కొత్త అక్రెడిటేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో ఓ చానల్ పేరుతో ఓ వ్యక్తి ఏకంగా జిల్లా కలెక్టర్ సంతాన్ని ఫోర్జరీ చేసి మరీ మండల స్థాయి కార్డును తయారుచేసిన ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది

36 గంటలు శ్రమ...5ఆపరేషన్లు.. ఒక పేషెంట్లకు ఊపిరిలుదిన ఉస్మానియా వైద్య బృందం

*డాక్టర్స్ డే నాడు ఉస్మానియా వైద్య బృందం అద్భుతం చేసి చూపారు....  36 గంటలపాటు శ్రమించి పేషంట్‌కు ఒకేసారి అయిదు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. 
సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్‌కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన రికార్డును సాధించారని పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం ఈ విజయాన్ని సాధించి వైద్య వృత్తికి మరింత ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా వైద్యులు, ఇతర సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.*

Tuesday, 30 June 2026

కబ్జాలపై వెంటనే చర్యలు తీసుకోండి : నవతరెడ్డి డిమాండ్

*కబ్జాదారుల గుప్పిట్లో 50 కోట్ల CMC(GHMC) బల్దియా భూమి!*

 *శేరిలింగంపల్లి చందానగర్‌లో 4 వేల గజాల  స్థలం ఆక్రమణ*

 *అడ్డగోలుగా ప్రహరీ కూల్చి ఆక్రమించిన CMC అధికారుల మొద్దునిద్ర*

 *బి ఆర్ ఎస్ ప్రభుత్యం హయాంలో మహిళా భవనం కు,ఫంక్షన్ హాల్ కోసం భూమి  కేటాయిస్తే  కాంగ్రెస్ ప్రభుత్యలో  కబ్జాదారుల పాలు*

 *కలెక్టర్ ఇచ్చిన అధికారిక పత్రంలు ఇచ్చిన  చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న సీఎంసీ యంత్రాంగం*

 *ప్రజాప్రతినిధి అండతో మున్సిపల్ అధికారుల తీరుపై మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ద్యాజం*

 *తక్షణమే ఉన్నతాధికారులు స్పందించకపోతే మహిళలతో కలిసి  న్యాయపోరాటం తప్పదని హెచ్చరిక*

*చందానగర్:*
మహిళమణుల  అవసరాల కోసం కేటాయించిన సుమారు 50 కోట్ల విలువైన CMC భూమి కబ్జాదారుల పాలవుతున్నా మున్సిపల్ అధికారులు మొద్దునిద్ర వీడటం లేదు. కాపాడాల్సిన అధికారులే ప్రజాప్రతినిధి అండతో కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చందానగర్ డివిజన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ బాగోతం మున్సిపల్ అధికారుల అంతులేని నిర్లక్ష్యానికి, అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది. సొంత భూమిని రక్షించుకోవడంలో విఫలమైన అధికారుల తీరుపై చందానగర్ మాజీ కార్పొరేటర్, న్యాయవాది బొబ్బ నవతారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్,డిప్యూటీ కమిషనర్ కు,గత 2 సంవత్సరాలుగా పిర్యాదు చేస్తున్న పట్టించుకోవడం లేదు అని  ఉన్నతాధికారులకు ఈ రోజు  ఆమె ఘాటైన లిఖితపూర్వకంగా  ఫిర్యాదు చేశారు.చందానగర్ డివిజన్ కైలాష్ నగర్ కాలనీలోని సర్వే నెంబర్ 210లో సుమారు 4 వేల గజాల స్థలం ఉంది. దీని బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ. 50 కోట్లు ఉంటుంది. ఈ స్థలంలో మహిళా భవనం, మోడల్ మార్కెట్, ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2018 (మార్చి 7న), 2019 (మే 5న) ప్రొసీడింగ్స్ (LC1/3076/2016) ద్వారా మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించారు. దీని ప్రకారం 2019లోనే కార్పొరేషన్ అధికారులు ఆ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించి, గేటు కూడా ఏర్పాటు చేశారు. అయితే, కబ్జాదారులు 2022 ఆగస్టు 10న, 2024 ఫిబ్రవరి 9న దౌర్జన్యంగా ఆ ప్రహరీని కూల్చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక మున్సిపల్ అధికారులు చోద్యం చూశారే తప్ప చర్యలు తీసుకోలేదు.

స్థలం ఆక్రమణకు గురవుతుండటంపై మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆర్టీఐ కింద దరఖాస్తు చేయగా.. అధికారులు అత్యంత బాధ్యతారాహిత్యంగా బదులిచ్చారు. అది మాది కాదు  ప్రభుత్వ భూమి అని, దానికి సంబంధించిన వివరాలు తమ వద్ద లేవని తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె స్వయంగా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీలను జతచేసి.. 2024లో అప్పటి డెప్యూటీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. 2025 నవంబర్‌లో సైతం జోనల్ కమిషనర్‌కు మరోసారి వినతిపత్రం ఇచ్చారు. అయినా ఉన్నతాధికారుల్లో ఉలుకూ పలుకూ లేదు.మున్సిపల్ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకున్న కొందరు, అదే స్థలంలో టీజీఎస్పీడీసీఎల్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి తెరతీశారు. దీనిపై నవతారెడ్డి ఆర్టీఐ ద్వారా విద్యుత్ శాఖను వివరణ కోరగా.. ఆ భూమికి సంబంధించి తమ వద్ద ఎలాంటి అధికారిక కేటాయింపు పత్రాలు లేవని,ప్రజాప్రతినిధుల సూచనతో నిర్మాణం చేశామని  సమాధానమిచ్చారు. ఇదే విషయమై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను నిలదీయగా.. తాము విద్యుత్ శాఖకు  హెచ్ఎంసీ యాక్ట్ యూ బై ఎస్  635 కింద నోటీసులు ఇచ్చామని చేతులు దులుపుకున్నారు. కోట్లాది రూపాయల భూమిని ఆక్రమించి,ఎలాంటి అనుమతులు లేకుండా స్థలంలో పత్రాలు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే నోటీసులు ఇచ్చి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా జీహెచ్ఎంసీ/సీఎంసీ అధికారులు చోద్యం చూస్తున్నారు. రూ.50 కోట్ల ప్రజా ధనాన్ని కబ్జాదారులకు ధారాదత్తం చేస్తున్నారు. కలెక్టర్ ప్రొసీడింగ్స్ ప్రకారం తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకుని, మహిళా భవనం, ఫంక్షన్ హాల్ నిర్మించాలి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి తక్షణమే అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మున్సిపల్ అధికారుల తీరును ఎండగడుతూ పెద్ద ఎత్తున మహిళ పోరాటం, న్యాయ పోరాటం చేస్తామని బొబ్బ నవతారెడ్డి హెచ్చరించారు.

ఆవేదన అంచుల నుండి ఆనందపు తీరాలకు.. ఇది ఓ నిహారిక కధ

కొన్ని ప్రయాణాలు మనం ప్లాన్ చేసుకున్నవి కావు… దేవుడు మన కోసం ముందే రాసిపెట్టినవి… ❤️🙏🏻

ఎన్నో సంవత్సరాలుగా సినిమాలు చూశాను…
అప్పుడప్పుడు నటించాను…
సినిమాల కోసం పని చేశాను…

కానీ ఈ రోజు…
సెన్సార్ బోర్డు మెంబర్‌గా నా మొదటి సినిమా చూసిన రోజు. 🎬

సినిమా పూర్తయ్యాక…
చర్చలు జరిగాయి…
సంతకాలు చేసి బయటికి వచ్చిన ఆ కొన్ని నిమిషాలు…
నా కాళ్లు ముందుకు నడుస్తున్నాయి…
కానీ నా మనసు మాత్రం ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయింది.

“అసలు ఇదంతా నేనేనా…?” అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను.

20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు…
చేతిలో ఏమీ లేదు…
Inter కూడా పూర్తి చేయలేక మధ్యలోనే ఆగిపోయాను.
ఒక చిన్న ఉద్యోగం దొరికితే చాలు…
జీవితం నెట్టుకొస్తే చాలు…
అనుకున్న ఒక సాధారణ అమ్మాయి.

కానీ…
దేవుడు రాసిన కథ వేరేలా ఉంది.

రెండేళ్లకే అనుకోకుండా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాను…
పెళ్లి తర్వాత ఇక సినిమాలకు దూరంగా ఉండాలని అనుకున్నాను…
కానీ జీవితానికి మన ప్లాన్ల కంటే దేవుడి ప్లాన్ ఎప్పుడూ గొప్పదే.

మళ్లీ సినిమాల్లోకి వచ్చాను…
పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పూర్తి చేశాను…
అమ్మ కలను నా కలగా మార్చుకొని Niharika Design Studio ప్రారంభించాను.
కరోనా సమయంలో మీ అందరి ప్రేమ, సహకారంతో  Foundation ద్వారా ఎంతోమంది జీవితాల్లో చిన్న వెలుగుగా నిలిచే అవకాశం వచ్చింది.

ఈ ప్రయాణంలో…
“ఇంకో అడుగు కూడా వేయలేను… నా వల్ల కాదు…”
అని కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి.

“ఇక బ్రతకడం ఎందుకు…”
అనే ఆలోచన కూడా ఎన్నోసార్లు వచ్చింది.

కానీ…
ఈ రోజు…
ఆ ఆలోచన కూడా నన్ను తాకలేని స్థాయికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు.

అవును…
ఇప్పటికీ ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నాను…
కొన్నిసార్లు మళ్లీ బలహీనపడుతాను…
మళ్లీ లేస్తాను…

ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక విషయం బాగా తెలుసు…

దేవుడు ఆలస్యం చేయవచ్చు… కానీ మన జీవితంలో జరిగే ప్రతి మంచి విషయానికి సరైన సమయాన్నే ఎంచుకుంటాడు. ❤️

ఈ రోజు నాకు ఈ సినిమా ఇంకో కారణం వల్ల కూడా చాలా ప్రత్యేకం…

చిన్నప్పటి నుంచీ నేను ఎంతో అభిమానించే నా Real Hero సినిమా…
అదే సినిమాను సెన్సార్ బోర్డు మెంబర్‌గా చూసే అదృష్టం రావడం…
నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. 🎥✨

కొన్ని స్థానాలు…
కొన్ని అవకాశాలు…
మనమే వెతికి సంపాదించేవి కావు…

దేవుడు పిలిచి… “ఇది నీ సమయం” అని ఇచ్చేవి.

ఈ అవకాశం కూడా నాకు అలాంటిదే.

 ఈ నమ్మకం ఉంచి…
ఈ బాధ్యతకు నన్ను గుర్తించి, నా పేరును సూచించి, ఈ అవకాశం రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻

భగవాన్… కామాక్షి అమ్మ…
మీ ప్రేమ…
మీ కృప…
మీ ఆశీర్వాదం లేకుండా నా జీవితంలో ఏదీ సాధ్యం కాదు.

Everything I am… Everything I have… is only because of Your unconditional love. ❤️🙏🏻

అంతా మీ కృప… మీ ఆశీర్వాదమే… 🙏🏻

#GratitudeAlways #BlessedJourney #CensorBoardMember #DivineGrace #DreamsDoComeTrue ❤️🙏🏻

Friday, 19 June 2026

*ఎస్‌.ఐ.ఆర్‌. కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*


*ఎస్‌.ఐ.ఆర్‌. కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*

*ప్రతి ఓటరు వివరాలను సమగ్రంగా పరిశీలించాలి*

*ప్రతి ఇంటికి బీఎల్‌వో చేరుకొని పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి*

*డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి అభ్యంతరాలు, క్లెయిమ్‌లపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలి*

*రఘునాథపాలెం మండలం కేంద్రంలో ఎస్‌.ఐ.ఆర్‌. కార్యక్రమం ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
----------------------------------------------------------------
ఖమ్మం : ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కు ప్రజలందరూ తమ పూర్తి వివరాలతో స్వచ్చందంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.శుక్రవారం ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  కలెక్టర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ, మ్యాపింగ్ ప్రక్రియ మరింత వేగవంతంగా చేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో బీఎల్‌ఓల పని తీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన ధృవీకరణ, సరైన డేటా నమోదు, పారదర్శకత తో పని చేయాలన్నారు. ఎస్ఐఆర్ లో భాగమైన మండలాలు, కార్పోరేషన్, మున్సిపాలిటీ సంబంధించి ప్రతి ఓటర్లను మ్యాపింగ్ చేసే విధంగా టార్గెట్ పెట్టుకొని వంద శాతానికి చేరుకోవాలన్నారు. 
ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను జూన్ 24 నుంచి జులై 25 వరకు చేపట్టనున్నారన్నారు. డబుల్ ఓట్లు, మరణించిన ఓటర్ల వివరాలను ధృవీకరించి, తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. బదిలీ ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాలను సక్రమంగా పరిశీలించి, రికార్డులను నవీకరించాలని తెలిపారు.
 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రధాన లక్ష్యం, ఎన్నికల సిబ్బంది విధులు, పౌరుల భాగస్వామ్యం, ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై అవగాహన పెంచడం ద్వారా ప్రతి అర్హ పౌరుడు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కావడానికి సహకరించాలని అధికారులు కృషి చేయాలన్నారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, సేకరణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చి, అనర్హులైన ఓటర్ల వివరాలను తొలగించే ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం ద్వారా శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాల తొలగింపు, డబుల్ ఎంట్రీలతొలగింపు జరుగుతుందని తెలిపారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తి స్థాయిలో ధృవీకరించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి అర్హమైన ఓటరుని గుర్తించి జాబితాలో చేర్చాలని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి బీఎల్‌వోకు ఎస్‌ఐఆర్‌ నిబంధనలు, విధి విధానాలు, ఫీల్డ్ వెరిఫికేషన్ విధానం, ఫారాల నిర్వహణపై పూర్తి అవగాహన, పట్టు ఉండేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అన్నారు. వివరాలు, కావాల్సిన దృవీకరణలు బూత్ స్థాయి అధికారి సందర్శన సందర్భంగా సిద్ధం గా ఉంచాలన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ప్రజలందరూ సంపూర్ణంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------
*ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతం చేయాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి*
-------------------------------------------------------------------
ఖమ్మం : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈ ఆర్ ఓ లతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడం, ఫారం పూర్తి చేసిన తర్వాత తిరిగి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు ముఖ్యపాత్ర పోషిస్తారని, పట్టణాలలో మ్యాపింగ్, అన్ మ్యాపింగ్ విభాగాలుగా సమాచారాన్ని విభజించి సవరణ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లకు సమావేశాలు నిర్వహించి సంబంధిత ఫోటోలు, మీటింగ్ మినిట్స్ నమోదు చేయాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలు స్థానిక భాషలో ముద్రించబడతాయని, బూత్ స్థాయి అధికారుల ద్వారా ఓటర్లకు అందజేయబడిన ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని సంబంధిత పోర్టల్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఈ ఆర్ ఓ లు క్షేత్రస్థాయిలో తరచుగా పర్యటించి సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పరిశీలించాలని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని, మ్యాపింగ్ చేయబడని ఓటర్ల వివరాలను అప్డేట్ ఆప్షన్ ద్వారా నమోదు చేయాలని తెలిపారు. జూలై 24వ తేదీ లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేయడం జరుగుతుందని, జూలై 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరుగుతుందని, జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, జూలై 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు అభ్యంతరాల పరిష్కరణ, అక్టోబర్ 1వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, మీటింగ్ మినిట్స్ నమోదు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో 1 వేయి 200 మందికి మించి ఓటర్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల సంబంధించిన బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని, బూత్ స్థాయి అధికారులకు వృద్ధ, అనారోగ్య, దివ్యాంగ ఓటర్ల నమోదు విషయంపై ప్రత్యేక శిక్షణ అందించాలని తెలిపారు. ఒకే కుటుంబం సంబంధించిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించాలని, తప్పుడు ప్రచారాన్ని నిరోధించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక  సమగ్ర సవరణ కార్యక్రమం పురస్కరించుకొని జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించామన్నారు. బూత్ స్థాయి అధికారులకు, బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై జిల్లాలో బ్యానర్లు, హోర్డింగ్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 
జిల్లాకు ప్రచార సామాగ్రి, బూత్ స్థాయి అధికారుల కిట్లు చేరినట్లు అన్నారు. ఎన్యుమరేషన్ ఫారాల పూర్తి, ఏ ఏ దృవీకరణలు తీసుకోవాలో బూత్ స్థాయి అధికారులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సదానందం, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ ఎం ఏ. రాజు, డిటి అన్సారీ, ఎన్నికల విభాగ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-------------------------------------------------------------------
Powered by : 
 MANIKUMAR KOMMAMURU
📲: 9032075966

Wednesday, 17 June 2026

ఏపీపీకి కమిషనర్ అభినందన


*అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను అభినంధించిన పోలీస్ కమిషనర్*

చిన్నారులపై లైంగిక వేధింపులు పోక్సో కేసుల్లో, గంజాయి వంటి తీవ్రమైన NDPS కేసుల్లో బలమైన సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించడం, ప్రాసిక్యూషన్, పోలీసుల సమన్వయంతో నేరం రుజువు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ... నేరస్థులకు జీవిత ఖైదు, 20 ఏళ్ల జైలు శిక్ష మొదలు అనేక కఠిన కారాగారా శిక్షలు పడేలా కృషి చేసిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
ఈ ఏడాదిలో ఇప్పటికే ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదు అయిన ఐదు పోక్సో కేసుల్లో ఖమ్మం అర్బన్ కేసు లో నిందుతుడికి జీవిత ఖైదు, రఘునాథపాలెం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష, ఖమ్మం రూరల్ రెండు వేర్వేరు కేసులో ఏడు, ఐదు సంవత్సరాల జైలు,రఘునాథపాలెం కేసులో మూడు సంవత్సరాల ఆరు నెలల శిక్ష పడ్డాయి.అదేవిదంగా గంజాయి వంటి 10 NDPS కేసుల్లో ఆరు కేసుల్లో 20 ఏళ్ల కఠిన కారాగారా శిక్ష, మరో రెండు కేసుల్లో 10 ఏళ్ల జైలు, ఒక కేసులో ఏడు ఏళ్ల జైలు, రెండు కేసుల్లో ఏడాది వరకు జైలు శిక్ష పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ అభినందించారు.

Tuesday, 16 June 2026

నరరూప రాక్షసుని కఠినంగా శిక్షించండి : బుడిగం శ్రీనివాస్

*ఖమ్మంలో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన  గౌస్ ను ఉరితీయాలి : మాజీ కార్పొరేటర్ బుడిగం శ్రీనివాసరావు                                                                      ...ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మానవ మృగాన్ని వెంటనే ఉరితీయాలి*                                    *కార్పొరేట్ వైద్యం పూర్తిస్థాయిలో ఉచితంగా అందించాలి..*                                                   *.. మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్ గ్రేషియా  అందించాలి*                                         ఖమ్మం జూన్ 16. ఖమ్మం లో మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్యయత్నం చేసిన మానవ మృగం గౌస్ ను తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడు గౌస్ పాషా ను వెంటనే ఉరితీయాలనీ కోరుతూ, మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం "నిరసన ర్యాలీ" నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్, వాకార్స్ సంఘం మాజీ అధ్యక్షులు బుడిగం శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి నిందితుడు గౌస్ ను ఉరి తీయాలనీ అయన విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీ పెవిలియన్ గ్రౌండ్ నుండి వైరా రోడ్ సిగ్నల్ పాయింట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాకం శ్యామ్ బాబు, విజయ్, దామోదర్ రెడ్డి, రామనాధం, నరసింహారావు, సుదర్శన్, జక్కుల వెంకటరమణ, శ్రీనివాసరెడ్డి, వీరబాబు, గంధం కోటేశ్వరరావు, మాదవి, సంధ్య, కిరన్మయి, కళావతి తదితరులు పాల్గొన్నారు.

Thursday, 11 June 2026

సమాచార హక్కు వారదులు వీరే...

పోరాటంతో సాధించలేనిది ఏదీ లేదు అన్నది జగద్విదితం. ఈముగ్గురి పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం – 2005, Right to Information Act
వీరిలో మధ్యలో ఉన్న ఆవిడే శ్రీమతి #అరుణారాయ్ IAS అధికారిణి..తన ఉద్యోగ నిర్వహణలో పేదలకు, అణగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు వారికి దక్కటల్లేదనే ఉద్ధేశ్యంతో తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి Right to Information, Right to Work, Right to Food మొదలగు కార్యక్రమాల ద్వారా పేదల తరుపున తన గొంతు వినిపించడంలో ముందున్నారు. 
ఎడమవైపు నుండి ఉన్న మొదటి వ్యక్తి #శంకరసింగ్. వీరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని తృణప్రాయంగా వదిలేసి ఆర్టీఐ కార్యకర్తగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.
కుడివైపు నుండి ఉన్న మొదటి వ్యక్తి #నిఖిల్ #డే. వీరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి గ్రామీణులకు స్వదేశంలో జరుగుచున్న అన్యాయాలపై నినందించాలని తపనతో విదేశీ విద్యకు స్వస్తిచెప్పి వచ్చిన వ్యక్తి. ఆర్టీఐ (RTI) ద్వారా ఎన్నో ప్రశ్నలు సంధించడమే కాకుండా,  ఎలా దానిని ఉపయోగించుకోవాలో ప్రజలకు శిక్షణ ఇస్తూ ఉంటారు.
ఈ ముగ్గురూ కలసి రాజస్థాన్ లోని దేవదుంగ్రి గ్రామంలో 1987 మేడే నాడు మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (Mazdoor Kisan Shakti Sangathan - MKSS) అనే సంస్థ ప్రారంభించి సాగించిన ఉద్యమ ఫలితమే సమాచార హక్కు చట్టం. 

*చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడాలి : బిఆర్ ఎస్ నేత తాజుద్దీన్,


*12 ఏళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటనను యావత్ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై చట్ట ప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.*

నేరం చేసిన వ్యక్తిని నిందితుడు అంటారు. నేరం చేసిన వ్యక్తి పేరు, మతం, కులం చూసి చట్టం పని చేయదు. *భారత రాజ్యాంగం ముందు అందరూ సమానమే. అందుకే నిందితుడు గౌస్ అయినా, బండి సంజయ్ కుమారుడైనా, మరెవ్వరైనా — నేరం చేస్తే ఒకటే చట్టం, ఒకటే శిక్ష ఉండాలి.*
ఈ దారుణాన్ని యావత్ ముస్లిం సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోంది. చిన్నారిపై జరిగిన ఈ అమానుష ఘటనను ఏ మతం, ఏ సంస్కృతి, ఏ మానవత్వం కూడా సమర్థించదు. అయితే కొందరు వ్యక్తులు ఈ ఘటనను మతానికి ముడిపెట్టి విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అత్యంత దురదృష్టకరం.

ముస్లిం సమాజం ఎప్పుడూ నేరస్థుడిని అతని మతం చూసి సమర్థించదు. నేరం చేసినవాడు ఎవడైనా శిక్ష పడాలనే వైఖరినే అనుసరిస్తుంది. అందుకే నిందితుడికి కఠిన శిక్ష విధించాలని ముస్లిం సమాజం మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది.

ఇక్కడ మరో విషయం కూడా సమాజం గుర్తించాలి. నెల క్రితం జరిగిన ఇలాంటి ఘటనల్లో నిందితులపై వేగంగా, కఠినంగా చర్యలు తీసుకుని ఉంటే, నేడు మరో గౌస్ లాంటి నిందితుడు ఇలాంటి దారుణానికి పాల్పడే ధైర్యం చేసి ఉండకపోవచ్చు. చట్టం ఆలస్యం కాకుండా కఠినంగా అమలు కావడం సమాజ రక్షణకు అత్యవసరం.

అలాగే నిందితుడిని కాపాడేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్న ముగ్గురు ప్రముఖుల కులం కూడా నిందితుడి కులం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడు ఈ వ్యవహారాన్ని కులం లేదా మతం కోణంలో చూడడం ఎంత తప్పో స్పష్టమవుతుంది. కొందరి వ్యక్తిగత చర్యలను మొత్తం సమాజానికి ఆపాదించడం బాధ్యతారాహిత్యం.

అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలకు కులం లేదు, మతం లేదు. బాధితుడి కన్నీటికి మతం ఉండదు. నిందితుడి నేరానికి కులం ఉండదు. కాబట్టి నేరాన్ని ఖండిద్దాం, నిందితుడికి శిక్ష కోరుదాం. కానీ సమాజంలో విద్వేషం, కుల-మత రాజకీయాలకు మాత్రం తావివ్వకూడదు.

సమాజ హితం కోరుకునే ప్రతి ఒక్కరూ న్యాయం పక్షాన నిలబడాలి. నేరస్థుడికి శిక్ష, బాధితురాలికి న్యాయం, సమాజానికి సామరస్యం — ఇదే మనందరి లక్ష్యం కావాలి.

*ఇట్లు,*
*మహమ్మద్ తాజుద్దీన్*
*బీఆర్ఎస్ పార్టీ మాజీ ముస్లిం మైనారిటీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు*

Wednesday, 10 June 2026

బసవతారకంలో చిన్నారుల మధ్య బాలకృష్ణ బర్త్ డే


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలో 22 జూన్ న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ రజతోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తున్నాం – శ్రీ నందమూరి బాలకృష్ణ

క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకొన్న శ్రీ నందమూరి బాలకృష్ణ

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్,  రిసెర్చి ఇన్సిస్టిట్యూట్ యొక్క రజతోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సోమవారం జూన్ 22 న సాయంత్రం హైటెక్ సిటీలోని నొవాటెల్ హోటల్ లో నిర్వహిస్తున్నామని శ్రీ నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.  బుధవారం హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్,  రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ చైర్మన్ హోదాలో నందమూరి బాలకృష్ణ కార్యక్రమాలను వివరించారు. 
 2000 వ సంవత్సరములో ప్రారంభమైన సంస్థ 25 సంవత్సరములు పూర్తి చేసుకొని ముందుకు సాగుతోందని ప్రస్థానాన్ని వివరించారు.  స్వర్గీయ నందమూరి తారకరామారావు, శ్రీమతి బసవతారకం ల‌ ఆశయాల మేరకు నడపడం జరుగుతోందని అంటూ గత సంవత్సర కాలంగా రజతోత్సవ వేళ పలు కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు.  
ఈ రజతోత్సవ కార్యక్రమాల ముగింపు ఈ నెల 22 న నిర్వహించబోయే భారీ కార్యక్రమంతో ముగుస్తుందని వివరించారు.  ఈ కార్యక్రమానికి శ్రీ జె పి నడ్డా,  కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులతో పాటూ శ్రీ వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి - శ్రీ రేవంత్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు విశిష్ట అతిదులుగా హాజరుకానున్నారని తెలిపారు.  వీరితో పాటూ కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్, తెలంగాణా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ, ఆంద్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ లు హాజరుకానున్నారని శ్రీ నందమూరి బాలకృష్ణ వెల్లడించారు.  
ఈ కార్యక్రమం ద్వారా 25 సంవత్సరముల గడిచిన కాలాన్ని అవలోకనం చేసుకొంటూ భవిష్యత్తులో హైదరాబాదు హాస్పిటల్ వద్ద నిర్మించనున్న సరికొత్త నార్త్ బ్లాక్ మరియు అమరావతిలోని తుళ్లూరు వద్ద నిర్మించనున్న హాస్పిటల్ ను అనుకొన్న గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు.  ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్మాణంతో పాటూ నడపడానికి గత 25 సంవత్సరములుగా సహకరించిన వారందరినీ గుర్తుకుతెచ్చుకొని వారి స్పూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.  లభాపేక్ష లేకుండా సంస్థ నిర్వహించడం జరుగుతోందని, భవిష్యత్తులోనూ ఇదే పంథాలో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు.
 సమావేశానికి ముందుగా హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకలలో  నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల మధ్య సంస్థ సిబ్బంది ఏర్పాటు చేసిన  కేక్ ను కట్ చేసి వారితో పంచుకొన్నారు.  అనంతరం చిన్నారులకు బొమ్మలు మరియు ఇతర బహుమతులు అందజేశారు.  అనంతరం హైదరాబాదుకు చెందిన  సీతారామారాజు హాస్పిటల్ కు అందించిన లక్షరూపాయాల విరాళాన్ని స్వీకరించారు.  తర్వాత త్రివేణి, కృష్ణవేణి స్కూల్లకు చెందిన విద్యార్థీ, విద్యార్థిణులు క్యాన్సర్ రోగుల సహాయార్థం సేకరించిన లక్షా వెయ్యి నూట పదహారు రూపాయాల విరాళాలాన్ని యాజమాన్యం, పిల్లలు కలసి నందమూరి బాలకృష్ణకు అందజేశారు.  పిమ్మట అమరావతిలోని తుళ్లూరు వద్ద నిర్మాణమవుతున్న నూతన హాస్పిటల్ నిర్మాణానికి  కాకర్ల రాఘవేంద్ర రావు అందించిన పది లక్షల రూపాయాల విరాళాన్ని చెక్కు రూపంలో స్వీకరించారు.  ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా చిన్నారులు చేస్తున్న మంచి పనిని ప్రశంసించారు.  పుట్టిన రోజులు శుభాకాంక్షలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తూ రానున్న రోజులలో మరింత ఉత్సాహంగా పని చేసేందుకు భగవంతుడు అవకాశమివ్వాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమాలలో  డా. టి సుబ్రహ్మణ్యేశ్వర రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. ఫణికోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా. కల్పనా రఘునాధ్, ఆసోసియేట్ డైరెక్టర్ – అకడమిక్స్, BIACH&RI మరియు పలువురు వైద్య విభాగాధిపతులు, వైద్యులు, నర్సింగ్ మరియు పారా మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Saturday, 6 June 2026

మరణంలోనూ మనసులు పెనవేసుకొని...

 ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లో ఉన్న ‘ది ఫ్లోరిష్ స్టే’ బి&బిలోని కింది అంతస్తులో తాళం వేసి ఉన్న ఒక స్నానాల గదిలో, బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ఒక పురుషుడు మరియు ఒక మహిళ చివరిసారిగా గుండెను పిండేసేలా కౌగిలించుకుని గడ్డకట్టిన స్థితిలో విగతజీవులుగా పడి ఉన్నారు. వీరు ఆఫ్రికా దేశస్తులుగా గుర్తించారు.

ఆ మహిళ టాయిలెట్ సీటుపై కూర్చుని ఉంది, ఆమె పక్కనే కుర్చీలో కూర్చున్న పురుషుడు ఆమెను గట్టిగా పట్టుకుని, ఆమె తలను అతని భుజంపై సున్నితంగా ఆనించి ఉన్నాడు. ఐదు అంతస్తుల ఆ భవనంలో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ మంటల నుండి తప్పించుకోవాలనే ఆశతో వారు బహుశా తమను తాము స్నానాల గదిలో బంధించుకున్నారు.

"వారు అగ్నిప్రమాదంలో చనిపోలేదు. పొగ వల్ల చనిపోయారు," అని మండుతున్న భవనం నుండి అతిథులను ఖాళీ చేయించడంలో సహాయపడటానికి ముందుకు వచ్చిన స్థానిక వాలంటీర్లలో ఒకరైన మహమ్మద్ షోయబ్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

"మేము కింది అంతస్తుకు వెళ్లి, లోపలి నుండి తాళం వేసి ఉన్న ఒక స్నానాల గదిని చూశాము," అని షోయబ్ గుర్తుచేసుకున్నారు.  మేము తలుపులు పగలగొట్టి చూడగా, ఒక జంట ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని ఉన్నారు. వారు అప్పటికే మరణించారు. ఆ మహిళ ఒక కుండపై కూర్చొని ఉండగా, ఆమె పక్కనే ఉన్న కుర్చీలో పురుషుడు ఆమెను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. మంటల నుండి తప్పించుకోవాలనే ఆశతో వారు తమను తాము లోపల బంధించుకున్నట్లు అనిపించింది. మేము వారిని కౌగిలింతలో బంధించి ఉండగా కనుగొన్నాము.

బుధవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో చెలరేగిన ఈ అగ్నిప్రమాదం, బేస్‌మెంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానిస్తున్నారు. ఆ భవనానికి అగ్నిప్రమాద నిరభ్యంతర పత్రం (NOC) లేదని, కిటికీలు మూసి ఉన్నాయని, మరియు కేవలం ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ 25 గదులను అక్రమంగా నిర్వహిస్తున్నారని దర్యాప్తు అధికారులు తరువాత వెల్లడించారు.

Thursday, 4 June 2026

*చెట్టు పై నుండి నోట్ల వర్షం కురిపించిన వానరం..*


*ఉత్తర ప్రదేశ్:*
*బులంద్ షహర్ కోర్టు పనిమీద వచ్చిన ఓ వ్యక్తికి కోతి చుక్కలు చూపించింది.నగదుతో ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లి చెట్టుమీద నుంచి నోట్ల వర్షం కురిపించింది.దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.జిల్లా కేంద్రంలోని కోర్టుకు వచ్చిన వచ్చిన రవీంద్ర,ఆయన సహచరుడు ఆమిర్ స్టాంప్ పేపర్లు కొందామని వెళుతుండగా హఠాత్తుగా వచ్చిన వానరం బ్యాగును అపహరించుకుపోయింది.రూ.2 లక్షల నగదు ఉన్న బ్యాగుతో అక్కడే ఉన్న ఓ చెట్టెక్కి కూర్చుంది.బ్యాగు మొత్తం చింపేయడంతో నోట్ల వర్షం కురిసింది.దీంతో స్థానికులు చెట్టుకింద పడిన నోట్లను సేకరించి తిరిగి రవీంద్రకు అప్పగించారు.*

పొంగుతున్న బీరు... ప్రభుత్వానికి భారీ ఆదాయం

*ఎండల ఎఫెక్ట్..* *తెలంగాణలో బీర్ల విక్రయాల జోరు!* 

*రెండు నెలల్లో 14 కోట్ల బీర్లు అమ్మకం.. ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం* 

హైదరాబాద్, జూన్ 4 :
తెలంగాణలో మండిపోతున్న ఎండలు బీర్ల అమ్మకాలకు ఊతమిచ్చాయి. ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా బీర్ల విక్రయాలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సుమారు 4 కోట్ల బీర్లు అదనంగా అమ్ముడవగా, మొత్తం విక్రయాలు 14 కోట్లకు చేరినట్లు సమాచారం.

ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో బీర్ల వినియోగం అత్యధికంగా నమోదైంది. సాధారణ రోజుల్లో 1.5 లక్షల కేసుల వరకు ఉండే అమ్మకాలు, ఎండల తీవ్రత కారణంగా రోజుకు 2.2 లక్షల కేసులకు పెరిగినట్లు తెలుస్తోంది.

బీర్ల విక్రయాలు పెరగడంతో ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం కూడా భారీగా సమకూరుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో మద్యం ద్వారా వచ్చే వార్షిక ఆదాయం సుమారు రూ.10 వేల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం అది నాలుగు రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్, అధిక ఉష్ణోగ్రతలు బీర్ల అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా వ్యాపారులు పేర్కొంటున్నారు. రాష్

Wednesday, 27 May 2026

లడ్డు కావాలంటే.. బందరు దారి పట్టడమే...

బందరు లడ్డు ... బందరు అనగా మచిలీపట్నం. కృ విజయవాడకు సమీపంలో ఉన్నదే ఈ మచిలీపట్నం బందరు.. గతంలో బందర్ పోర్టు ఉండటం వల్ల మచిలీపట్నానికి పూర్వం బందరు అనేవారు
బందరు కోనేరు సెంటర్... ఈ పేరు చెప్పగానే ఎంతటివారికైనా నోరూరాల్సిందే...షుగర్ పేషెంట్లను కూడా ఆ వాసన విడిచిపెట్టదు...ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఆ రుచి చూసేద్దాంలే అనుకుంటారు...అదే బందరు లడ్డు సెంటరు.. ఒక స్వీటు ఆ ఊరి పేరుతో ప్రసిద్ధి కావడం విశేషమే కదా...
 
బందరు లడ్డుగా ప్రసిద్ధి చెందిన ఆ లడ్డు అసలు పేరు తొక్కుడు లడ్డు. ఈ లడ్డూని శనగ పిండితో తయారు చేస్తారు. దీని తయారీకి చాలాసేపే పడుతుంది. తయారుచేసి నోట్లో వేసుకున్నాక శ్రమ అంతా మర్చిపోవలసిందే. అక్కడి తాతారావు స్వీట్ దుకాణంలో బందరు లడ్డు కొనడానికి జనం ఎగబడతారు. దుకాణానికి ముందు వైపు మోడరన్ గ్లాసుతో డిజైన్ చేసి ఉంటుంది. లోపల ఇంటీరియర్ చాలా విలక్షణంగా ఉంటుంది.
 
ఎడమ పక్కన గోడ మీద డజన్ల కొద్దీ సర్విసెట్టి సత్యనారాయణ తాతారావు చిత్తరువులు ఉంటాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జగ్జీవన్‌రామ్... వంటి పెద్దలంతా ఆయన దుకాణంలోని బందరు లడ్డూ అభిమానులు. వారు నిత్య కస్టమర్లు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి బందరు లడ్డు మీద ఎనలేని ప్రేమ. ‘‘ఈ దుకాణాన్ని మా మామగారు 1951లో ప్రారంభించారు’’ అని చెప్పే తాతారావు బందరు లడ్డూ దుకాణాలను విస్తృత పరిచారు.
 
 విచిత్రమేమంటే ఈ లడ్డు తయారీ విధానాన్ని ఇక్కడకు తీసుకువచ్చినవారు ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చినవారు. వాళ్లని సింఘ్స్ లేదా బొందిలీలు అంటారు. బందరులో స్థానికంగా ఉండేవారు వీరి దగ్గర తయారీ విధానం తెలుసుకున్నారు. వలస వచ్చిన ఉత్తర భారతీయులు ఈ లడ్డు తయారీని క్రమేపీ విడిచిపెట్టేశారు. స్థానికంగా ఉన్న బందరు వాస్తవ్యులు మాత్రం దీన్ని అందిపుచ్చుకున్నారు.
 
 ‘‘మా దగ్గర తయారయ్యే లడ్డూలు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్తున్నాయి. ఎక్కడ తెలుగు వారు ఉంటే అక్కడకు మా లడ్డూలు ప్రయాణిస్తాయి. బందరు లడ్డు తయారీ సామాన్యం కాదు. చాలా శ్రమతో కూడిన పని. అసలు సిసలైన ఘుమఘుమలాడే మధురమైన రుచి రావడానికి కనీసం ఆరేడు గంటల సమయం పడుతుంది’’ అంటూ వివరిస్తారు. మామూలు రుచి రావడానికి ఎక్కువ సమయం అవసరం లేదనే విషయాన్ని పరోక్షంగా చెబుతారు తాతారావు.
 తయారీ విధానంలో ఎటువంటి మార్పూ తీసుకు రాకపోవడమే తన విజయ రహస్యం అంటారు తాతారావు. ఏ విధంగా తయారుచేస్తారో చూడాలనుకునేవారిని ఆప్యాయంగా వంటగదిలోకి తీసుకువెళ్లి, అన్నీ వివరిస్తూ చూపుతారు.
 పెళ్లికూతురు, పెళ్లి కొడుకు లేకుండా అయినా పెళ్లి అవుతుందేమోకాని, బందరు లడ్డు లేకుండా ఇక్కడ ఏ శుభకార్యమూ జరగదు అని చెబుతారు అక్కడి పనివారు.  

స్వీట్స్‌ అంటే ఇష్టంలేనివారిని సైతం తినిపించేలా నోరూరించే మిఠాయి ‘బందరు లడ్డు’. ‘ఆహా ఏమి రుచి.. తినరా మైమరిచి’ అని లొట్టలేసుకుంటూ తింటారు. తీపి తినటానికే పుట్టాలి అనిపించేంత రుచిగా ఉంటుంది ఈ బందరు లడ్డు. ప్రపంచ ప్రసిద్థిగాంచిన ఈ లడ్డూ మనం మచిలీపట్నంగా పిలుచుకునే బందరులోనే తయారీ. అందుకే ఈ లడ్డూకి ‘బందరు లడ్డు’ అని పేరుపడిపోయింది. రుచుల్లో రారాజుగా ఖ్యాతికెక్కిన ఈ తొక్కుడు లడ్డూ తీపి చరిత్రను తెలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి? అందుకే జీవన పనుగట్టుకొని బందరుకు వెళ్లి, అనేక తీపికబుర్లు మోసుకొచ్చింది. ఆ విశేషాలు మీకు ప్రత్యేకం.
పరిచయం అవసరంలేని విశిష్టమైన మిఠాయి బందరు లడ్డు. బందరులో లడ్డూ, హల్వానే కాక ప్రతి మిఠాయికీ ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఆ రుచి ఎన్నో యేళ్లుగా తెలుగు ప్రజల కీర్తిలో ఓ భాగమవుతూ వస్తోంది. బందరు వెళ్ళిన వారంతా మరిచిపోకుండా కొనుక్కొని మరీ తినేలా ఈ ఊరి పేరుతో ప్రసిద్ధికెక్కింది బందరు లడ్డు.
**బందరులడ్డూ చరిత్ర
వందల సంవత్సరాలకు ముందున్న చరిత్రను తిరగేస్తే తప్ప బందరు లడ్డూ పుట్టుక గురించి చెప్పలేం. అది రెండవ ప్రపంచయుద్ధం కాలం నాటి మాటగా చెప్తుంటారు. మొదటిగా ఈ లడ్డూ సింగ్‌లచే బందరు వాసులకు సంక్రమించిందని చెప్తారు. రాజ్‌పుత్‌ల వంశం నుంచి వచ్చిన వారు సింగ్‌లనీ, వీరు బుందేల్‌ఖండ్‌ ప్రాంతం నుంచి వచ్చారనీ, వారిని ఇక్కడ బొందిలీలు అన్నారనీ, వారే ఈ లడ్డూ తయారీని నిర్వహించేవారనీ ప్రతీతి. ఇక్కడి వారి మాటల ప్రకారం బుద్దూసింగ్‌, నారాయణసింగ్‌, నాట్‌సింగ్‌, జగన్నాథ్‌సింగ్‌, ఠాకూర్‌సింగ్‌ అనేవారు పూర్వం బందరు లడ్డూకు అప్పట్లోనే ప్రపంచ ప్రఖ్యాతిని తీసుకొచ్చారట.
**అసలు సారథులు
బందరు లడ్డూ తయారీలో వృత్తిపరమైన గురువులుగా చక్కా నారాయణస్వామి, అనుముకొండ రాఘవయ్య (జింటాన్‌ మేస్త్రీ), తెలుకల రాఘవయ్య, టార్జాన్‌ మేస్త్రీ, గౌరా మల్లయ్య్ల ప్రసిద్ధి గడించారు. ప్రస్తుతం బందరు లడ్డూకి పేరొందిన తాతారావు మామగారైన వెంకటరత్నం సింగ్‌ల దగ్గర ఫార్ములా నేర్చుకున్నారని కొందరు చెబుతుంటారు. ఇక పరిశ్రమ యజమానులుగా అప్పటి కాలం నుంచి కశిం సుబ్బారావు, విడియాల శరభయ్య, మద్దుల దుర్గయ్య, రేపల్లె వెంకటేశ్వర్లు, విడియాల గురునాథం, విడియాల సత్యం, శిర్విశెట్టి రామకృష్ణారావు, శిర్విశెట్టి సత్యనారాయణ (తాతారావు), గౌరా మల్లయ్య, పెడన శేషయ్య లడ్డూ తయారీలో విశేషమైన శ్రద్ధ చూపారంటారు. ఇప్పుడు బందరులో తాతారావు నడుపుతున్న తాతారావు మిఠాయి కొట్టు, అలాగే గౌరా మల్లయ్య కుమారుడైన గౌరా వెంకటేశ్వరరావు నడిపిస్తున్న మల్లయ్య మిఠాయి కొట్లు స్థానికంగా ప్రసిద్ధి.
**బెల్లంతోనే మధురిమ
ప్రపంచంలో ఎవరైనా, ఎక్కడైనా మిఠాయి చేయటానికి ఎక్కువగా పంచదార వాడతారు. ఒక్క బందరులోనే బెల్లం వాడతారు. అందుకే ఈ మిఠాయికి అంత రుచి, పేరు వచ్చింది. కొన్ని వందల ఏళ్ల నుంచి మన తెలుగువారి సంస్కృతిలో భాగంగా వస్తుంది. ఇక్కడ అమ్మే స్వీట్లలో బందరు లడ్డు, హల్వాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ బందరు లడ్డు, హల్వా తయారీవిధానంలో కూడా ప్రత్యేకత కనిపిస్తుంది.
**నకిలీ బెడద ఎక్కువే
తాతారావు, మల్లయ్య ఒకప్పుడు కలిసే పనిచేసి, తర్వాత కాలంలో ఎవరికి వారు సొంత వ్యాపారాలు పెట్టుకున్నారు. అయితే బందరు లడ్డూ పేరుతో చాలాచోట్ల నకిలీ స్వీట్స్‌ కూడా అమ్మేస్తున్నారు. ”ఇంత ప్రఖ్యాతి పొందిన బందరు లడ్డూని ఎగుమతి చేస్తే, ధర పెంచవలసి ఉంటుంది. ఒక్కోసారి లడ్డూ పాడవటం కూడా జరగొచ్చు. అలా జరిగితే అది మన తప్పు అవుతుంది. ఆ ప్రభావం వలన బందరు లడ్డూకి ఉన్న పేరు చెడుతుంది. పేటెంట్స్‌ వద్దు అది తీసుకుంటే దానిపై వచ్చే నకిలీలను అదుపు చేసే బాధ్యతను నిర్వర్తించడం చాలా కష్టం” అని తాతారావు చెప్పుకొచ్చారు. అయితే త్వరలోనే బందరు లడ్డూకి పేటెంట్‌ రాబోతుందట! డి.ఎఫ్‌.ఆర్‌.ఎల్‌ నుంచి కూడా బందరు లడ్డూపై మంచి నివేదిక రావడం వలన బందరువాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ”భవిష్యత్‌లో దీన్ని నిలబెట్టుకుంటే ఉంటుంది, లేకపోతే మనం చేసేదేమీలేదు” అంటున్నారు మల్లయ్య స్వీట్స్‌ యజమాని వెంకటేశ్వరరావు.
**’చేదు’ జీవితాలు
బందరులో లడ్డూ తయారీలో 300-400 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారందరూ కలిపి ‘స్వీట్‌ మేకర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌’ అని పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నా వీరిలో సమన్వయం లేకపోవటం వలన యూనియన్‌ స్థాపన సాధ్యపడటం లేదు. పొయ్యి వెలిగించటం దగ్గర నుంచి పాకం పట్టడం, లడ్డూని తయారుచేయడం, అగ్నిగుండంలా ఉండే వంటపొయ్యల దగ్గర పనిచేస్తుంటారు. వేడినూనెతో కానీ, వేడి నెయ్యితో కానీ పని చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ తట్టుకుంటూ జీవితాలను గడుపుతున్నారు. ఇక్కడ పనిచేసే కార్మికులు యజమాని ఎప్పుడైనా పనిలో నుంచి తీసేసినా, జీతం సరిగా ఇవ్వకపోయినా అడిగే దిక్కే ఉండదు. అందుకే యూనియన్‌ ఉండాలన్నది వీరి అభిప్రాయం. పని విధానంలో శ్రమను బట్టి జీతాలను ఇవ్వాలన్నది ఈ కార్మికుల విజ్ఞప్తి.
**తెలుగు రుచుల్లో మేటి
తెలుగు రుచులనగానే గుంటూరు కారం, గోంగూర పచ్చడి.. అంటాం.. అన్నింటిలో బందరు లడ్డూ తీపే మేటి. అలాంటి బందరు లడ్డూ నకిలీల కంట్లోపడి బెంబేలెత్తుతోంది. వందల ఏళ్ళ క్రితమే ప్రపంచ ఖ్యాతిగన్న బందరు లడ్డూ రుచి పేటెంట్‌ హక్కుకూ నోచుకోక విలవిల్లాడుతోంది. ”అయ్యా! బందరు లడ్డూ రుచి తెలిసిన పాలకులారా! బందరు లడ్డూ రుచికి న్యాయం చేయండి. లడ్డూ తయారీలో శ్రమటోడ్చేవారి కష్టాన్నీ పట్టించుకోండి!! అప్పుడే బందురు లడ్డూకి నిజమైన రుచి వచ్చినట్టు.
**150 ఏళ్ళ బండి
ఈ తోపుడు బండికి 150 యేళ్లు. అప్పట్లో ‘బొందిలీలు’ మిఠాయి ఈ బండిపైనే అమ్ముకునేవారట! గౌరా మల్లయ్య వాళ్ల దగ్గర పనిచేసేవారు. కొన్నేళ్ల తర్వాత ఈ తోపుడుబండిని మల్లయ్య వాళ్ల దగ్గర నుంచి కొనుక్కున్నారు. తర్వాత కాలంలో మల్లయ్య కూడా ఈ బండిపైనే బందరు మిఠాయి అమ్మేవారు. మల్లయ్య తదనంతరం అతని కొడుకు ఈ బండిని భద్రంగా ఉంచారు. బండికున్న రూపంలో ఎలాంటి మార్పూ చేయకుండా, కేవలం చెక్క ఉన్న స్థానంలో అల్యూమినియం ప్లేటు అమర్చి, గాలికొట్టాల్సిన అవసరంలేని ట్యూబ్‌లెస్‌ టైర్లను తొడిగి, ఇప్పటికీ ఈ బండిని చరిత్రకు ఆనవాలుగా ఇక్కడ ఉంచారు. అప్పటి బండిలోనే మిఠాయిలను పెట్టి బందరు లడ్డూకి ఉన్న ఘనచరిత్రను చాటుతున్నారు.

Sunday, 24 May 2026

హాఫ్ మారథాన్లో... మనిషిని తోసి రాజన్న రోబో.. Humanoid robot takes first place in Beijing race..

 Humanoid robot takes first place in Beijing race

Something incredible just happened in Beijing on Sunday at the Beijing E-town Humanoid Robot Half Marathon: more than 12,000 human runners shared the course with over 100 humanoid robot teams. #ChinaSeen #ChinaMaxxing
And the result? A robot took first place
బీజింగ్ రేసులో హ్యూమనాయిడ్ రోబోట్ ప్రథమ స్థానం

ఆదివారం బీజింగ్‌లోని బీజింగ్ ఇ-టౌన్ హ్యూమనాయిడ్ రోబోట్ హాఫ్ మారథాన్‌లో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది: 12,000 మందికి పైగా మానవ పరుగువీరులు, 100కు పైగా హ్యూమనాయిడ్ రోబోట్ జట్లతో కలిసి పరుగు మార్గాన్ని పంచుకున్నారు. 

మరి ఫలితం? ఒక రోబోట్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.

Sunday, 17 May 2026

అభయారణ్యంలో కాశీ_విశ్వనాథుని_భూగోళశాస్త్రం

కాశీ_విశ్వనాథుని_భూగోళశాస్త్రం:
కాశీ లో గ్యాంవాపి కాకుండా ఎన్ని వాపీ లు ఉన్నాయి??ఎన్ని కూపాలు ఉన్నాయి?? ఎన్ని కబ్జా అయ్యాయి??? ఇప్పటివరకు తెలియని జ్యామితీయ,భౌగోళిక వివరణలతో ఇస్తున్న!!!

విశ్వేశ్వర పురాతన దేవాలయం యొక్క గ్రౌండ్ ప్లాన్ 
1831లో పునర్నిర్మించబడింది. ప్రధాన ఆలయం చతురస్రంగా ఉంటుంది;  
ప్రతి వైపు 108 అడుగులు (32.92 మీ) 
ఒక కోణంలో 27 గ్రిడ్‌లుగా (పాదాలు) విభజించబడింది.మధ్య అభయారణ్యం ప్రక్కనే, తూర్పు, దక్షిణం, పడమర మరియు ఉత్తరానికి ప్రతీకగా జ్ఞాన (జ్ఞానం), ముక్తి (విముక్తి), శృంగార (అలంకరణ), మరియు ఐశ్వర్య (కీర్తి)కి అనుగుణంగా నాలుగు పూర్వ-గదులు (మండపాలు) ఉన్నాయి (అల్తేకర్ చూడండి.  1937).  ప్రతి మండపాలు 16 x 16 అడుగుల (16 గ్రిడ్లు) విస్తీర్ణంలో ఉన్నాయి.
 లోపలి అభయారణ్యం మొదటి వృత్తాకార రూపాన్ని సూచిస్తుంది, అయితే నాలుగు కార్డినల్ మండపాలు రెండవ వృత్తం మరియు కార్డినాలిటీని సూచిస్తాయి.  మిగిలిన నాలుగు ప్రధాన దిశలలో మూడవ స్థాయిలో, తారకేశ్వర (SE), దండపాణి (SW), గణేశ (NW) మరియు భైరవ (NW) లకు అనుగుణంగా 9 గ్రిడ్‌లు (12 x 12 ft) విస్తీర్ణంతో నాలుగు సహాయక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.  NE).  

పూర్తి రూపంలో ఉన్న మొత్తం ఆలయం తొమ్మిది గోపురాల సుందరమైన సమూహంగా ఉండాలి.  గ్రౌండ్ ప్లాన్ నుండి ఊహించిన విధంగా, ఎత్తు 16, 8 మరియు 6 నిష్పత్తిలో కేంద్రం నుండి బయటికి తగ్గింది.  ఈ విధంగా, గ్రిడ్-మండల వరుసగా 64, 16 మరియు 9, కలిసి పవిత్ర జ్యామితిని ప్రతిబింబిస్తుంది.  నాలుగు ప్రధాన దిశాత్మక గ్రిడ్‌లు 16 ఒక్కొక్కటి మధ్యలో 64గా ఉద్భవించాయి.  అనుబంధ మండపానికి అదనంగా, మరో ఎనిమిది 9-గ్రిడ్ గదులు కూడా ఉన్నాయి;  ఆ విధంగా వారి సంఖ్య 12కి చేరుకుంది. ఇది 9 x 12 = 108తో పోల్చవచ్చు. మొత్తంగా, ఈ విధంగా లెక్కించబడుతుంది: [(16 x 4) + 64 + {(9 x 4) + (9 x 8)}], చివరి సంఖ్య  ఓపెన్-ఛాంబర్‌ల సంఖ్య 236కి వస్తుంది. మూడు మార్మిక లోకాల ప్రాతినిధ్యాన్ని కలిగి ఉండే ఫ్రేమ్‌వర్క్ మరియు గ్రిడ్ ఆధారంగా ట్రిపుల్ సర్కిల్ చిహ్నం ఏర్పడింది.

జలతీర్థం: వివిధ రాజులు మరియు ఋషులచే బాగా ప్రణాళిక చేయబడిన నగరంలో అత్యంత అధునాతన సహజ జలసంరక్షణ మరియు నీటినిర్వహణ ప్రణాళికను వారణాసి కలిగి ఉంది.  ఇది కూప్‌లు, కుండ్‌లు, సరోవర్‌లు, జలశాయ్‌లు, వాపిలు మొదలైన వాటిని జలతీర్థం (నీటి తీర్థయాత్ర) అని పిలుస్తారు.  గంగా నదికి మరో 84 ఘాట్‌లు ఉన్నాయి.

పద్మ పురాణం ప్రకారం, కాశీ 88చెరువులు,
62కుండాలు, 
8 వాపీలు మరియు 
29 కూపాలను కలిగి ఉన్న 20 కోసులలో విస్తరించి ఉంది;  అన్నీ కలిపి జలతీర్థం అంటారు.  

కాశీపురలోని జ్యేష్ఠ వాపి (కోల్పోయిన), కాశీ విశ్వనాథ్ సమ్మేళనంలోని జ్ఞానవాపి (బ్రతికి), కర్కోటక్ నాగ వాపి (మనుగడ), 
భద్ర మొహల్లాలో భద్రవాపి (మనుగడ), 
శంఖచూడ వాపి (కోల్పోయింది), 
సిద్ధి వాపి అనే కొన్ని వాపీల పేర్లు మరియు హోదాలు ఉన్నాయి.  బాబు బజార్ (ఓడిపోయింది).  కూపాలు చంద్ర కూపం, 
అప్సరకూపం, 
కాక్లోదక, 
చితాకూపం,
సముద్రకూపం,
ధర్మకూపం
మంగ్లోడక, 
శుక్రకూపం 
అఘోరకూపం
గౌరీ కూపం,
బ్రహ్మవైరాట కూపం,
అప్స్తంబక, 
నల్కువాక, 
బాల్‌చంద్ర, 
వ్యాసకూపం,
శుభోదకూపం,
 కోల్పోయిన కూపం ల జాబితా కనద కూపం, 
పిత్రి కూప్, 
రసోదక్, 
మార్కండేయ కూపం, 
దధికర్న్, 
విరూపాక్ష కూపం మరియు మహాదేవ్ కూపం..
______________________________________
వారణాసి/కాశీ గురించి:10వ శతాబ్దపు CE నాటి హిందూ వాస్తుశిల్పం ప్రకారం, హిందూ నగరం యొక్క లేఅవుట్ "కాస్మిక్ వాస్తు విద్య" ఆధారంగా రూపొందించబడింది.  వారణాసి నగరం విశ్వ నిర్మాణం మరియు స్థానిక పవిత్రత యొక్క సంక్లిష్ట సమ్మేళనాన్ని సూచిస్తుంది మరియు పవిత్రమైన రాజ్యం ఎవరి యొక్క మద్దతు లేకుండా పెరిగింది.  వారణాసి విశ్వేశ్వర ఆలయంతో సహా పవిత్రమైన జ్యామితిని కలిగి ఉంది మరియు గంగా, వరుణ మరియు అస్సీ నది చుట్టూ ఉన్న శివుని త్రిశూలంపై విశ్వవ్యాప్తంగా చెప్పబడే విశ్వ చరిత్ర కంటే పురాతనమైనది.

పవిత్ర జ్యామితి: తీర్థయాత్రల యొక్క వివిధ మార్గాలు వారణాసిలో ఎప్పుడూ ఒకే విధమైన రేఖాగణిత ఆకృతిని కలిగి ఉండవు.  ఏది ఏమైనప్పటికీ, హిందూ మతపరమైన భూగోళ శాస్త్రవేత్తలు మరియు కార్టోగ్రాఫర్‌లు అక్రమాలను ఒక రేఖాగణిత వృత్తాకార ప్రణాళికగా మార్చారు మరియు కొన్నిసార్లు ఇతర రూపాల కలయికతో స్థూల మరియు మీసో కాస్మోస్ యొక్క కాస్మోగ్రామ్‌కు దారితీసింది.

 వారణాసి వివిధ సందర్భాలలో నిర్వచించబడిన అనేక పవిత్ర భూభాగాలను కలిగి ఉంది.  వాటిలో, ఐదు అత్యంత ప్రజాదరణ పొందినవి మరియు వృత్తాకారంలో నడిచే బయటి (చౌరాసి క్రోసి యాత్ర) మినహా అన్నీ సక్రమంగా లేని ఆకారాలను కలిగి ఉంటాయి;  అయితే దాని తీర్థయాత్ర కనీసం గత యాభై సంవత్సరాల నుండి ఆచరణలో లేదు.  సిద్ధాంతంలో, నాలుగు అంతర్గత పవిత్ర ప్రయాణ మార్గాలు (అంత్రగృహ్ యాత్ర, అవిముక్త యాత్ర, నగర్ పాగ్-దక్షిణ మరియు పంచకోశి యాత్ర) జ్ఞానవాపి కూప్ వద్ద కలుస్తాయి, కాశీలోని నాభి (అక్షం ముండి) బయటి వృత్తం (చౌరాసి క్రాస్) కవర్ చేస్తుంది.  మిగిలినవన్నీ మరియు పశ్చిమాన డెహ్లీ వినాయక వద్ద కలుస్తుంది, విశ్వ భూభాగం, కాశీకి ద్వారం.  ఐదు యాత్రలు పంచమహాభూతానికి (గాలి, నీరు, అగ్ని, ఆకాష్ మరియు పృథ్వీ) ప్రతీక.
-------------------------------------------------
ఐదు సర్క్యూట్‌ల వివరణాత్మక వివరణ

 విశ్వ శక్తి యొక్క నీడను సూచించే మొదటి బాహ్య పవిత్ర వలయం (చౌరాశిక్రోషి యాత్ర), 5 క్రోషాల (సమానంగా) దూరంలో ఉన్న మధ్యమేశ్వరుని మందిరాన్ని కేంద్రంగా మరియు డెహ్లీ (గేట్) వినాయకుని రేడియల్ పాయింట్‌గా సూచిస్తూ నిర్వచించబడింది.అక్కడి  నుండి 11 మైళ్లు/ 17.6 కిమీ).  దీని చుట్టుకొలత కాశీ మండల అని పిలువబడే విశ్వ భూభాగాన్ని గుర్తిస్తుంది.  ప్రతి ఎనిమిది దిక్కులలో 12 శక్తి-దేవతలు (శక్తిలు), ఒక శక్తి-దేవత (దుర్గ), ఆమె పురుష భాగస్వాములలో ఒకరు (భైరవ), 3 వేటలు మరియు ఒక దిశాత్మక దేవత (దికపాల) ఉన్నారు.  వారి సంఖ్య 144కి చేరుకుంటుంది.

 రెండవ సర్క్యూట్ (పంచక్రోషి) 88.5 కిమీ (25 క్రోషాలు) దూరాన్ని కవర్ చేస్తుంది, ఇక్కడ 108 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.  5 రోజులలో (నాలుగు లేదా ఐదు రాత్రి హాల్ట్‌లు) పూర్తి చేసిన అత్యంత ప్రసిద్ధ తీర్థయాత్ర ఇది.

 మూడవ పవిత్ర సర్క్యూట్ నగర ప్రదక్షిణ అని పిలువబడే వివిధ చారిత్రక పురాణాల ప్రకారం నగర భూభాగాన్ని వేరు చేస్తుంది.  ఈ మార్గం 25 కి.మీ దూరం మరియు 72 పవిత్ర పుణ్యక్షేత్రాలను కలుపుతుంది మరియు రెండు రోజుల్లో పూర్తవుతుంది.

నాల్గవ పవిత్ర వలయం శివ (అవిముక్త)చే "నెవర్ ఫర్సేకెన్" జోన్‌ను సూచిస్తుంది.స్కంద పురాణం (16.25-35) ప్రకారం, సూర్యుడు (సూర్యుడు) శివుడిని ఈ ప్రాంతంలో శాశ్వతంగా నివసించమని కోరాడట, అందుకే దీనికి అవిముక్త అని పేరు వచ్చింది.ఈ భూభాగం యొక్క కేంద్రం అవిముక్తేశ్వర క్షేత్రం, ఇక్కడ నుండి వృత్తాకార మార్గం సుమారు 2 కిమీ రేడియల్ దూరం వద్ద కదులుతుంది.  ఇది ఎప్పుడూ గంగా నదిని దాటదు, అయితే మార్గం నది యొక్క ఎడమ ఒడ్డును అనుసరిస్తుంది.  దక్షిణం నుండి ఉత్తరం వరకు ఎత్తైన మట్టిదిబ్బపై పడి ఉన్న మూడు పుణ్యక్షేత్రాలు: త్రిపురాంతకేశ్వర, వాల్మీకేశ్వర మరియు ఓంకారేశ్వర.  ఈ మూడు గుట్టల పుణ్యక్షేత్రాలు శివుని త్రిశూలం (త్రిశూలం) యొక్క మూడు అంచులుగా కూడా సూచించబడ్డాయి.

ఐదవ సర్క్యూట్, లోపలి గర్భగుడి (అంతర్గృహ), విశ్వేశ్వరుని ఆలయం చుట్టూ ఏడు సార్లు కదులుతుంది.  ఇది విశ్వ సమగ్రతను సూచిస్తుంది, అనగా 7 చక్రాలు (వెన్నెముక శక్తి మండలాలు లేదా ప్లెక్సస్) మరియు 8 కార్డినల్ దిశలు.  ఏడు రౌండ్ల మురి భౌతికంగా మరియు అతీంద్రియంగా వాస్తవికత యొక్క అవగాహనను సూచిస్తుంది మరియు రక్షక దేవత శివుని ఆవాసం ప్రతిచోటా ఉందని యాత్రికులకు గుర్తు చేస్తుంది కానీ చుట్టుకొలత ఎక్కడా లేదు.  ఔటర్ సర్క్యూట్‌లోని ఎనిమిది సంయోగ బిందువులు భైరవ (శివుడి యొక్క ఉగ్ర రూపం కార్డినల్ దిశలలో "సమయం" మరియు "మృత్యువు"లను చూసుకోవడం) ఎనిమిది రూపాలచే నియంత్రించబడతాయి, వీటిలో మూడు కుడి వైపున గంగానదికి అడ్డంగా ఉన్నాయి.  మిగిలిన ఐదు పవిత్ర సర్క్యూట్ యొక్క ఎడమ వైపున ఉన్నాయి మరియు పంచక్రోషి మార్గంలో ఐదు నిలుపుదల ప్రదేశాలను సూచిస్తాయి.

ఈ వ్యవస్థ 56గణేశ / వినాయక విగ్రహాల ఏర్పాటులో మరింత అభివృద్ధి చేయబడింది.  భూమికి మరియు స్వర్గానికి (వాతావరణంలోని ఏడు పొరలను ప్రతీకగా సూచించే) రాజ్యంలోని మొత్తం ఏడు లోకాలలో ఎనిమిది కార్డినల్ దిశల వద్ద అడ్డంకులు నుండి వినాయకుడు ఈ నగరానికి వచ్చే నివాసులను మరియు సందర్శకులను రక్షిస్తాడు.  వారు అన్ని కార్డినల్ జంక్షన్లలో విశ్వానికి మరియు నివాసులకు లోకపాలకులుగా, దిశాత్మక సంరక్షకులుగా పనిచేస్తారు.  

ఎనిమిది దిక్కులు, 
ఏడు పొరలు, 
వారణాసిలోని మూడు పవిత్ర విభాగాలు మరియు తీర్థయాత్రల అనుసంధాన మార్గాలను మురి రూపంలో చూపే స్పేషియో-కాస్మోలాజికల్ మోడల్‌లో 56 వినాయకుల సంఖ్య మరియు స్థానాన్ని సూచించవచ్చు.  వాస్తు విద్యలో, వాస్తు-పురుష మండలం - ఒక అద్భుతమైన నిర్మాణ ప్రణాళిక వివరించబడింది.  మురి రూపం కదలికను సూచిస్తుంది, సమయం యొక్క చక్రీయ కదలిక.  ఈ విధంగా ప్రదక్షిణ చేస్తారు.  ఒక గుండ్రని బలిపీఠం భూగోళ ప్రపంచాన్ని సూచిస్తుంది మరియు దానిలోని ఒక చతురస్రం వేద ఖగోళ శక్తిని సూచిస్తుంది.
అసలు కాశీ విశ్వనాథుని గ్రౌండ్‌ప్లాన్:
 సేకరణ.. 🙏🙏

Tuesday, 21 April 2026

భూబారతిలో కొత్త అధ్యాయం... ఖమ్మం జిల్లాలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్....

భూ వివాదాల పరిష్కారంలో ఒక కొత్త అధ్యాయం

కుసుమంచి జిల్లాలోని మెటాపురంలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్

సర్వే మ్యాప్ (LPM) మరియు భూధార్ నంబర్ల కేటాయింపు

"భూ యాజమాన్య హక్కులకు శాశ్వత హామీ" – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రైతు జీవితం భూమితో ముడిపడి ఉంటుందని, యాజమాన్య హక్కులు స్పష్టంగా నిర్ధారించబడినప్పుడే వారి జీవితం సురక్షితంగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ధృవీకరించిన సర్వే మ్యాప్ మరియు ఒక ప్రత్యేకమైన భూధార్ నంబర్‌ను అందించడం రైతులకు విశ్వాసాన్ని, కుటుంబాలకు భద్రతను, భవిష్యత్తుపై నమ్మకాన్ని కల్పిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తూ, భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారాల దిశగా వేగవంతమైన చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రయత్నంలో భాగంగా, ప్రభుత్వం భూమి, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదిక కింద ఏకీకృతం చేసింది. అదే 'ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్'. దీనిని ఏప్రిల్ 2 నుంచి ఎంపిక చేసిన మండలాల్లో పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు.

వీటిలో కోస్గి (నారాయణపేట జిల్లా), కుసుమంచి (ఖమ్మం జిల్లా), అశ్వరావుపేట (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా), అమంగల్ (రంగారెడ్డి జిల్లా), మరియు వట్పల్లి (సంగారెడ్డి జిల్లా) ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్‌ను తప్పనిసరి చేసే నిబంధనను భూ భారతి చట్టంలో పొందుపరిచినట్లు మంత్రి తెలిపారు. అదనంగా, పౌరులు తమ ఆస్తుల కోసం ధృవీకరించబడిన సర్వే పత్రాల కోసం స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుని, పొందవచ్చు. ఈ నిబంధన ప్రస్తుతం ఐదు పైలట్ మండలాల్లో అమలులో ఉంది.మంగళవారం, ఖమ్మం జిల్లాలోని కుసుమంచి మండలంలో సర్వే మ్యాప్‌ను ఉపయోగించి మొట్టమొదటిసారిగా భూమి రిజిస్ట్రేషన్ జరగడంతో ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమీకృత భూ భారతి పోర్టల్ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

ఈ సందర్భంలో, నీలకొండపల్లి మండలం, ముత్తపురం గ్రామానికి చెందిన భాగం కిషన్ రావు అనే రైతు, గట్టు సింగారం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం. 156/E/1లో ఉన్న ఒక ఎకరం 4 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన కట్టా వెంకటేశ్వర రావుకు విక్రయించారు. వివరణాత్మక సరిహద్దు సర్వే పటాన్ని జతచేసి కుసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు.

ఈ లావాదేవీకి భూధార్ నంబర్ (795GCHDCUPJ7H0) మరియు భూ పార్శిల్ పటం (భూకామత పటం-1) జారీ చేయబడ్డాయి.

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ఈ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా అమలు చేస్తామని మంత్రి ధృవీకరించారు. భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వం భూ పరిపాలనలో పూర్తి పారదర్శకతను ప్రవేశపెట్టింది. కచ్చితమైన సర్వే పటాలు, ప్రత్యేకమైన భూధార్ నంబర్లను కేటాయించడం ద్వారా యాజమాన్యంలోని అస్పష్టత తొలగిపోతుంది.

ఖచ్చితమైన భూమి కొలత మరియు మ్యాపింగ్‌ను నిర్ధారించడానికి, పాత సర్వే పద్ధతుల స్థానంలో అధునాతన రోవర్ ఆధారిత సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు సేవలు మరింత అందుబాటులోకి, నమ్మదగినవిగా మారాయని ఆయన పేర్కొన్నారు.

A New Chapter in Resolving Land Disputes

First Registration with Survey Map in Metapuram of Kusumanchi

Allocation of Survey (LPM) and Bhoodhar Numbers

“Permanent Assurance for Land Ownership Rights” – Minister Ponguleti Srinivasa Reddy

State Minister for Revenue, Housing, and Information & Public Relations, Ponguleti Srinivasa Reddy, stated that a farmer’s life is closely tied to land, and only when ownership rights are clearly established can their life remain secure. He emphasized that providing a verified survey map and a unique Bhoodhar number ensures confidence for farmers, security for families, and trust in the future.Under the leadership of Chief Minister A. Revanth Reddy, the state government is strengthening the revenue system and taking rapid steps toward permanent solutions for land-related issues. As part of this effort, the government has integrated land, survey, and registration departments under a single platform—the Integrated Bhu Bharati Portal—which is being implemented on a pilot basis since April 2 in selected mandals.These include Kosgi (Narayanpet district), Kusumanchi (Khammam district), Aswaraopeta (Bhadradri Kothagudem district), Amangal (Ranga Reddy district), and Vatpally (Sangareddy district).The Minister stated that making a survey map mandatory at the time of registration has been incorporated into the Bhu Bharati Act. Additionally, citizens can voluntarily apply for and obtain certified survey documents for their properties. This rule is currently being enforced in the five pilot mandals.On Tuesday, a historic milestone was achieved with the first-ever land registration using a survey map in Kusumanchi mandal of Khammam district. Speaking on the occasion, the Minister said the Integrated Bhu Bharati Portal would serve as a model for the entire country. In this instance, a farmer named Bhagham Kishan Rao from Muttapuram village (Nelakondapalli mandal) sold 1 acre and 4 guntas of land located in Survey No. 156/E/1 of Gattu Singaram revenue village to Katta Venkateswara Rao of the same village. The registration was completed at the Kusumanchi Tahsildar office by attaching a detailed boundary survey map.A Bhoodhar number (795GCHDCUPJ7H0) and land parcel map (Bhukamatha Patam-1) were issued for the transaction.The Minister affirmed that this system will be implemented across the state in phases to ensure permanent resolution of land disputes. Through the Bhu Bharati Act, the government has introduced complete transparency in land administration. Assigning accurate survey maps and unique Bhoodhar numbers eliminates ambiguity in ownership.He also noted that outdated survey methods have been replaced with advanced rover-based technology to ensure precise land measurement and mapping, making services more accessible and reliable for the public.

Powered by :  

MANIKUMAR KOMMAMURU 

 📲:9032075966

ఎమ్మెల్యే గాంధీ పై నవతారెడ్డి ఫిర్యాదు.. ఇంట్లో అధికారిక సమీక్షలపై ఘాటు విమర్శలు

క్యాంపు కార్యాలయం ఉండగా.. MLA ఇంట్లో అధికారిక సమీక్ష సమావేశాల?

 మాజీ కార్పొరేటర్లు, వారి భర్తలకు అధికారుల సమావేశంలో పాల్గొనే అర్హత ఉందా?

 *మహిళా అధికారులను MLA ఇంటికి పిలిపించుకోవడం ఎంతవరకు సమంజసం?*

 *కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన మియాపూర్ లో MLA క్యాంపు కార్యాలయం ఏమైనట్లు?*

వాడుకలో లేని MLA క్యాంపు కార్యాలయాన్ని సీఎంసీ అధికారులకు అప్పగించండి..

 *ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, అధికారుల తీరుపై బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఘాటు విమర్శలు*
 శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరుకున్నాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సిఎం సి జోనల్ కమీషనర్ హేమంత్ గారికి పిర్యాదు చేసిన బీఆర్ఎస్ సీనియర్ మహిళా నేత, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి.
మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ పీఏసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసంలో సిఎంసీ అధికారులతో, ఏ పదవీ లేని మాజీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను, ప్రొటోకాల్‌ను గాలికొదిలేసి ఎమ్మెల్యే గాంధీతో పాటు అధికారులు వ్యవహరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

 *క్యాంపు కార్యాలయం ఎందుకు వాడుకోరు?
శేరిలింగంపల్లి, మియాపూర్, ఆల్విన్ కాలనీ సర్కిళ్ల పరిధిలోని అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, సీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో వారి ఇంట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిపై బొబ్బ నవతా రెడ్డి స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు. గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అధికారిక సమావేశాల నిర్వహణ కోసం మియాపూర్‌లో సకల హంగులతో అధికారిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. అంత మంచి క్యాంపు కార్యాలయం అందుబాటులో ఉండగా, మియాపూర్ సర్కిల్ అధికారులను కూకట్‌పల్లిలోని తన ఇంట్లోకో పిలిపించుకుని అధికారిక సమావేశాలు ఏర్పాటు చేయడం ఆంతర్యమేంటి? అని ఆమె నిలదీశారు.

*మహిళా అధికారులను ఇంటికి పిలిపించడం సమంజసమేనా MLA గారు?*

అధికారులతో, అందులోనూ ఈఈ శిరీష, డీఈ శ్రీదేవి, డీఈ మౌనిక వంటి మహిళా అధికారులను ఇంటికి (లేదా అనధికారిక ప్రదేశానికి) పిలిపించి మీటింగ్ పెట్టడం గౌరవంగా ఉందా ఎమ్మెల్యే గారూ? ఇది మహిళలను అవమానించినట్లు కదా? అని నవతా రెడ్డి ప్రశ్నించారు. పాలనాపరమైన, అధికారిక సమీక్షలను ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో హుందాగా నిర్వహించాల్సిన బాధ్యతను గాలికి వదిలేశారని విమర్శించారు. అధికారులు సైతం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి సమీక్షల్లో పాల్గొనడం సరికాదని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏఈలు భాస్కర్, యుగేంధర్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ.. అధికారుల తీరుపై విస్మయం వ్యక్తం చేశారు.

*మాజీ కార్పొరేటర్లను వారి భర్తలను ఏ అధికార హోదా తో సమావేశానికి పిలిచారు?*

అధికారులతో ప్రజాప్రతినిధులు నిర్వహించే అధికారిక సమీక్షా సమావేశంలో ప్రస్తుతం ఎలాంటి అధికారిక హోదా లేని మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ భర్త మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు ఏ అర్హతతో కూర్చున్నారని నవతా రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మూడు సర్కిల్ లలో ఈ ముగ్గురుకు తప్ప వేరే వారికి అర్హత లేదా? ఏ హక్కుతో మాజీ కార్పొరేటర్లను, మహిళా నేతల భర్తలను అధికారుల సమావేశానికి పిలిచారు? పాలనాపరమైన, అభివృద్ధి పనుల సమీక్షల్లో అధికారులను ఆదేశించే, లేదా వారితో చర్చించే అధికారిక హోదా వారికి ఎక్కడిది? ఇది ముమ్మాటికీ ప్రొటోకాల్ ఉల్లంఘన మరియు అధికార దుర్వినియోగమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన పరిపాలన సాగాల్సిన చోట ఇలాంటి అనధికారిక జోక్యాలను సహించేది లేదని, అధికారులు చట్టపరంగా, నిబంధనల మేరకే విధులు నిర్వర్తించాలని లేని ఎడల చట్టం వారిని శిక్షించే విధంగా పై అధికారులు దృష్టికి తీసుకువెళ్తాము అని బొబ్బ నవతా రెడ్డి హెచ్చరించారు.

Monday, 20 April 2026

కాలేశ్వరం లోపాలపై స్పష్టత వచ్చింది రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పునరుద్ధరించాలనే సంకల్పంలో భాగంగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ ప్రదేశాన్ని సందర్శించి పరిశీలించారు. మంత్రులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన, మేడిగడ్డ డ్యామ్ ప్రదేశంలో పునరుద్ధరణకు సంబంధించిన కొనసాగుతున్న భూభౌతిక, భూసాంకేతిక పరీక్షలను పరిశీలించారు.జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (#NDSA) మరియు ఇతర సంస్థల సిఫార్సులకు అనుగుణంగా మేడిగడ్డ పునరుద్ధరణ కోసం నిర్వహిస్తున్న పరీక్షలను ఆయన ఒక్కొక్కటిగా సమీక్షించారు.ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎన్‌డిఎస్‌ఎ ఛైర్మన్ అనిల్ జైన్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.

కుంగిపోయిన బ్యారేజీ ప్రదేశంలోని పరిస్థితులను, పునరుద్ధరణ కోసం నిర్వహిస్తున్న వివిధ పరీక్షల పద్ధతులను నీటిపారుదల శాఖ అధికారులు సవివరంగా వివరించారు. ముఖ్యమంత్రి పలు అంశాలపై వివరణలు కోరారు.మేడిగడ్డ బ్యారేజీలోని 20, 21, 22 నంబర్ల పిల్లర్ల వద్ద బోర్‌రిగ్‌లను ఉపయోగించి జరుగుతున్న నమూనాల సేకరణ పనులను ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. ఇందులో భాగంగా జియోటెక్నికల్, జియోఫిజికల్, జీపీఆర్ (GPR) పరీక్షలు, నమూనాల సేకరణ వంటివి ఉన్నాయి. నమూనాలను సేకరించడానికి మొత్తం 520 బోర్‌రిగ్‌లను ఉపయోగిస్తున్నారు. నష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, ఈ నమూనాలను ప్రయోగశాల విశ్లేషణ కోసం సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (#CWPRS)కు పంపనున్నారు.  డ్రోన్ ఆధారిత జీపీఆర్ (GPR) పరీక్షల గురించి అధికారులు ప్రతినిధి బృందానికి వివరించారు. ఈ పరీక్షలు పిల్లర్ల సమీపంలో 20-30 మీటర్ల లోతు వరకు నేల పరిస్థితులను అంచనా వేయడానికి సహాయపడతాయని వారు తెలిపారు. బ్యారేజీ వద్ద పైల్స్‌ను సీల్ చేయడానికి సంబంధించిన క్రాస్-హోల్ సీస్మిక్ పరీక్షల గురించి కూడా వారు వివరించారు. కొనసాగుతున్న పరీక్షలను సమీక్షించిన అనంతరం, ముఖ్యమంత్రి మంత్రులు మరియు ఉన్నతాధికారులతో సమావేశమై కీలక ఆదేశాలు జారీ చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుండిల్ల బ్యారేజీలలో లోపాలను సరిదిద్ది, వాటిని పునరుద్ధరించే విషయంలో ఎలా ముందుకు సాగాలనే దానిపై స్పష్టత వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సంబంధిత వర్గాలు సమస్యను అర్థం చేసుకున్న తర్వాత, సగం పరిష్కారం లభించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.కొనసాగుతున్న పరీక్షల ద్వారా సమస్యపై పూర్తి అవగాహన ఏర్పడిన తర్వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని, సేకరించిన నమూనాల ఫలితాల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనంతరం ఆయన పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు అన్ని పనులూ తప్పనిసరిగా #NDSA మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రతి దశలోనూ అనుమతులు పొందాలని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, నిర్మాణ సంస్థలు, తదితరులు పాల్గొన్నారు.

MANIKUMAR KOMMAMURU 

 📲 9032075966

Monday, 6 April 2026

*విరామంలో ఘనవీడ్కోలు... సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు పలికిన ... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*


**ప్రజలకు అందించిన నిర్విరామ సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*

*దీర్ఘకాలంగా ప్రభుత్వ సేవలు అందించి రిటైర్ అయిన వారికి ఘనంగా వీడ్కోలు* 

**మార్చి మాసంలో (8) మంది ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ నేపథ్యంలో నిర్వహించిన రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్*
------------------------------------------------------------------------
ఖమ్మం, ఏప్రిల్ -06: ప్రజలకు నిర్విరామంగా సేవలు అందించి, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు.
మార్చి నెలలో పదవీ విరమణ పొందిన (8) మంది ఉద్యోగుల కోసం సోమవారం ప్రజావాణి అనంతరం ఏర్పాటు చేసిన రిటైర్మెంట్ సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి.శ్రీనివాస రెడ్డి లతో కలిసి పాల్గొని ఉద్యోగుల సేవలను కొనియాడారు. ఖమ్మం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేసిన బి. అరుణ్ కుమార్, మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేసిన బి. జయదాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిపిఎంఓగా పని చేసిన ఎండి. అఫ్జల్ మియా, ఎంపిహెచ్ఈఓ గా పనిచేసిన ఎంవి. నరసింహా రావు, ట్రైబల్ శాఖ పరిధిలో హెచ్ పిగా పని చేసిన ఎస్.కే. ఆసిఫ్ మియా, హౌసింగ్ శాఖ కొణిజెర్ల ఏఈ గా పని చేసిన ఐ. ఉమేశ్వర్,  రఘునాథ పాలెం తహసిల్దార్ కార్యాలయం లో చైన్ మ్యాన్ గా పనిచేసిన డి. అమృతమ్మ, ఎస్సి సంక్షేమ శాఖ పరిధిలో ఓఎస్ గా పని చేసిన డి. ఎలిశమ్మ పదవి విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* 30 నుంచి 35 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు నిర్విరామంగా అందించి పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  పదవీ విరమణ తర్వాత జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు పదవి విరమణ పొందిన వారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాసరావు, రిటైర్మెంట్ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
MANIKUMAR KOMMAMURU 
📲: 9032075966

Friday, 3 April 2026

*ఎంపీలు వద్దిరాజు, సురేష్ రెడ్డి,దీవకొండలు ఉప రాష్ట్రపతికి సన్మానం, డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తో భేటీ*


బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి,డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర,విప్ దీవకొండ దామోదర్ రావులు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సీ.పీ.రాధాకృష్ణన్ ను శాలువాతో సన్మానించారు.పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఎంపీలు ముగ్గురు గురువారం రాత్రి ఛైర్మన్ ఛాంబర్ లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.అలాగే, సురేష్ రెడ్డి, రవిచంద్ర, దామోదర్ రావులు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తో ఆయన ఛాంబర్ లో భేటీ అయి కొద్దిసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

"BRS MPs Met vice president Radha Krishnan"

BRS Parliamentary Party Leader K.R. Suresh Reddy, Deputy Leader Vaddiraju Ravichandra, and Whip Diwakonda Damodar Rao honored Vice President and Rajya Sabha Chairman C.P. Radhakrishnan with a shawl. After the adjournment of Parliament, the three MPs met him in the Chairman's Chamber on Thursday night and honored him with a shawl. Similarly, Suresh Reddy, Ravichandra, and Damodar Rao met Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh in his chamber and had a brief cordial conversation

.

बारासा पार्लियामेंट्री पार्टी के लीडर के.आर. सुरेश रेड्डी, डिप्टी लीडर वड्डीराजू रविचंद्र और व्हिप दिवाकोंडा दामोदर राव ने देश के उपराष्ट्रपति और राज्यसभा चेयरमैन सी.पी. राधाकृष्णन को शॉल ओढ़ाकर सम्मानित किया। पार्लियामेंट के स्थगित होने के बाद, तीनों राज्यसभा सदस्य ने गुरुवार रात चेयरमैन के चैंबर में उनसे मुलाकात की और उन्हें शॉल ओढ़ाकर सम्मानित किया। इसी तरह, सुरेश रेड्डी, रविचंद्र और दामोदर राव ने राज्यसभा के डिप्टी चेयरमैन हरिवंश नारायण सिंह से उनके चैंबर में मुलाकात की और थोड़ी देर अच्छी बातचीत की।

Wednesday, 1 April 2026

హిందూ దైవిక స్త్రీ శక్తులు... 64 మంది యోగినులు (చౌసత్ యోగినులు).......!!

64 మంది యోగినులు (చౌసత్ యోగినులు).......!!
హిందూ తాంత్రిక సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన దైవిక స్త్రీ శక్తులు (శక్తి స్వరూపాలు). వీరు ఆది శక్తి (పార్వతి లేదా దుర్గా) యొక్క వివిధ అంశాలను సూచిస్తారు.
పురాణాల ప్రకారం కథ..........
పురాణాల ప్రకారం, రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలను వేధించాడు. అతని రక్తం నేలపై పడితే కొత్త రక్తబీజులు ఉత్పన్నమవుతాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి దుర్గాదేవి తన దైవిక శక్తిని 64 ఛాయా రూపాలుగా (యోగినులుగా) విడుదల చేసింది. ఈ యోగినులు రక్తబీజుని రక్తాన్ని నేలపై పడకుండా తాగేశారు, దీంతో అతడు నాశనమయ్యాడు. వారి సేవకు కృతజ్ఞతగా దుర్గాదేవి వారికి ప్రత్యేక ఆలయాలు (యోగిని దేవాలయాలు) ఇచ్చింది. ఇది తాంత్రిక ఆరాధనకు మూలం.
యోగినులు సాధారణంగా భయంకరమైన రూపాలు (కొందరు జంతు ముఖాలు లేదా తలలు), శక్తివంతమైన సిద్ధులు (అణిమ, మహిమ, లఘిమ మొదలైనవి), యోగ, తంత్ర నైపుణ్యం కలిగినవారు. వారు భైరవులతో (శివుని రూపాలు) సంబంధం కలిగి ఉంటారు. వీరు సృష్టి, సంరక్షణ, నాశనం అనే అన్ని అంశాలను సూచిస్తారు.
ప్రాముఖ్యత........
64 మంది యోగినులు, ఇది పూర్ణత్వం, కాస్మిక్ చక్రాన్ని సూచిస్తుంది. 8 మాతృకలు (అష్ట మాతృకలు) నుండి ప్రతి ఒక్కటి 8 రూపాలుగా విస్తరించడం వల్ల 64 అయ్యాయి.
ఆరాధన.......
తాంత్రికులు వీరిని పూజిస్తే కోరికలు తీరడం, భయాలు తొలగడం, సిద్ధులు పొందడం, ఆధ్యాత్మిక జ్ఞానం లభించడం వంటి ఫలితాలు ఉంటాయని నమ్మకం. నవరాత్రి, దుర్గా పూజల్లో కూడా వీరి పేర్లు జపిస్తారు.
ఆలయాలు.......
ఆలయాలు ఇవి సాధారణంగా గుండ్రపు, ఆకాశం తెరచిన (హైపెత్రల్) ఆలయాలు.

భారతదేశంలో ప్రధానమైనవి........
హీరాపూర్ (ఒడిశా) — చిన్న, అందమైన ఆలయం, గ్రానైట్ శిల్పాలు.
రానీపూర్-ఝరియాల్ (ఒడిశా).
ఖజురాహో, మిటావలి (మధ్యప్రదేశ్) — పెద్ద గుండ్రపు నిర్మాణాలు. 
ఇది ఒక ప్రముఖ జాబితా కొన్ని గ్రంథాల్లో మాతృకలు కూడా చేర్చబడతాయి.

64 యోగినుల పేర్ల జాబితా (ఒక సాధారణ జాబితా — వివిధ గ్రంథాల్లో కొంచెం తేడా ఉండవచ్చు)
అష్టమాతృకలు (ప్రధాన నాయక దేవతలు).....
64 యోగినీలు ఈ 8 దేవతల ఆధీనంలో ఉంటారు:
బ్రాహ్మీ
మహేశ్వరీ
కౌమారీ
వైష్ణవీ
వారాహీ
ఇంద్రాణీ
చాముండా
మహాలక్ష్మీ

64 యోగినీల జాబితా (సంక్షిప్తంగా).....
🟡 బ్రాహ్మీ వర్గం.......
బ్రాహ్మీ
మహావిద్యా
సరస్వతి
అంబికా
గాయత్రీ
సావిత్రి
వాగ్దేవి
ధీశక్తి
🔵 మహేశ్వరీ వర్గం........
మహేశ్వరీ
రుద్రాణి
కాళి
త్రిపురభైరవి
భవాని
శివదూతి
భైరవి
దక్షిణకాళి
🔴 కౌమారి వర్గం........
కౌమారి
స్కందమాత
సేనానీ
శక్తి
కుమారి
గుహ్యకాళి
సుబ్రహ్మణ్యశక్తి
శక్తిదేవి
🟢 వైష్ణవి వర్గం........
వైష్ణవి
నారాయణి
లక్ష్మి
మాధవి
గోవింది
విష్ణుమాయ
కామాక్షి
శాంతి
🟣 వారాహీ వర్గం.......
వారాహీ
ధూమావతి
బగళాముఖి
చిన్మస్తా
త్రిపురసుందరి
భువనేశ్వరి
తారాదేవి
కామేశ్వరి
⚪ ఇంద్రాణి వర్గం..........
ఇంద్రాణి
అహల్యా
శచి
వజ్రిణి
తేజస్విని
స్వర్ణకాంతి
జ్వాలాముఖి
ఆదితి
⚫ చాముండా వర్గం.......
చాముండా
కాళరాత్రి
కపాలిని
రక్తదంతికా
ఉగ్రచండా
భద్రకాళి
శూలినీ
కాళి
🟠 మహాలక్ష్మి వర్గం.........
మహాలక్ష్మి
కమలాత్మికా
అన్నపూర్ణ
శ్రీదేవి
పద్మావతి
ధనలక్ష్మి
గజలక్ష్మి
విజయలక్ష్మి

యోగినీ పూజ యొక్క లక్షణాలు..........
రాత్రి సమయంలో, ప్రత్యేకంగా అమావాస్య రోజున పూజ చేస్తారు
ఇది సాధారణ భక్తి కాదు – ఇది తంత్ర సాధన
గురువు మార్గదర్శనం తప్పనిసరి
సరిగా చేస్తే ఆకర్షణ శక్తి, ఐశ్వర్యం, రక్షణ
అంతర్దృష్టి (Intuition) పెరుగుతుంది.
యోగినుల ఆరాధన అత్యంత రహస్యమైనది మరియు తాంత్రిక గురువు మార్గదర్శకత్వంలో చేయాలి. వీరిని పూజించడం వల్ల దైవిక స్త్రీ శక్తి (శక్తి)ని లోపల అవీకరించుకోవచ్చని భావం.

🔴🟢🔵🟡🙏🟡🔵🟢🔴

Friday, 27 March 2026

కన్నుల పండువగా భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు


కన్నుల పండువగా భద్రాద్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం

పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు

* శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది 
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీత దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు
* సీఎం తన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు
రూ.351 కోట్లతో భూమిపూజ 
* అంతకుముందు భద్రాచలం ఆలయ అభివృద్ధికి తొలి విడతలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు భూమి పూజ చేశారు
* ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు
* మిథిలా మైదాన ప్రాంగణంలో జరుగుతున్న ఈ క్రతువును తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు దీంతో భద్రాచలం వీధులు రామ నామస్మరణతో మోగిపోతున్నాయి.
_____________________________________________
Bhadrachalam Sri Sita Ramachandra Swamy Kalyanam Celebrated with Grandeur

The celestial wedding ceremony (Tirukalyana Mahotsavam) of Lord Sri Sita Ramachandra Swamy at Bhadrachalam was conducted with great pomp and devotion. Honourable Chief Minister Sri A. Revanth Reddy attended the celebrations along with his family and, on behalf of the State Government, offered Pattu Vastras and Mutyala Talambralu to the deity. He also had darshan of the Lord and received blessings.The grand event, held at Mithila Stadium, witnessed the presence of Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, Ministers Tummala Nageswara Rao, Konda Surekha, Ponguleti Srinivasa Reddy, Danasari Anasuya Seethakka, Vakati Srihari, along with several public representatives, DGP B. Shivadhar Reddy, senior officials, and a large number of devotees.On this occasion, the Chief Minister performed the foundation stone laying ceremony for the temple expansion works with an initial allocation of ₹351 crore. The development plan includes ₹180 crore for temple expansion and infrastructure, ₹96 crore for surrounding area development, and ₹75 crore for Godavari ghat development.
_____________________________________________
भद्राचलम श्री सीता रामचंद्र स्वामी कल्याणम धूमधाम से मनाया गया

भद्राचलम में भगवान श्री सीता रामचंद्र स्वामी का दिव्य विवाह समारोह (तिरुकल्याण महोत्सव) बड़ी धूमधाम और भक्ति के साथ मनाया गया। माननीय मुख्यमंत्री श्री ए. रेवंत रेड्डी अपने परिवार के साथ समारोह में शामिल हुए और राज्य सरकार की ओर से भगवान को पट्टू वस्त्र और मुत्याला तलंबरालु चढ़ाए। उन्होंने भगवान के दर्शन भी किए और आशीर्वाद लिया। मिथिला स्टेडियम में हुए इस भव्य कार्यक्रम में उपमुख्यमंत्री मल्लू भट्टी विक्रमार्क, मंत्री तुम्मला नागेश्वर राव, कोंडा सुरेखा, पोंगुलेटी श्रीनिवास रेड्डी, दानसारी अनसूया सीठक्का, वाकाटी श्रीहरि के साथ-साथ कई जनप्रतिनिधि, DGP बी. शिवधर रेड्डी, वरिष्ठ अधिकारी और बड़ी संख्या में भक्त मौजूद थे।
इस मौके पर, मुख्यमंत्री ने ₹351 करोड़ के शुरुआती आवंटन के साथ मंदिर के विस्तार के कामों का शिलान्यास किया। डेवलपमेंट प्लान में मंदिर के विस्तार और इंफ्रास्ट्रक्चर के लिए ₹180 करोड़, आस-पास के इलाके के विकास के लिए ₹96 करोड़ और गोदावरी घाट के विकास के लिए ₹75 करोड़ शामिल हैं।

Friday, 13 March 2026

రాష్ట్రంలో ఎల్‌పిజి కొరత లేదు: ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి. No shortage of LPG in State: N. Uttam Kumar Reddy *గ్యాస్ సిలిండర్ల అక్రమ మళ్ళింపుపై కఠిన చర్యలు.. ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి*



రాష్ట్రంలో ఎల్‌పిజి కొరత లేదు : ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

నీటిపారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుండి ఎల్‌పిజి సరఫరా, వేసవి తాగునీటి సన్నద్ధత మరియు 99 రోజుల ప్రజా పలాన-ప్రగతి ప్రాణాలిక కార్యక్రమం అమలును సమీక్షించడానికి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మరియు పోలీసు కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు మరియు గృహ వినియోగదారులు, ఆసుపత్రులు మరియు ప్రభుత్వ హాస్టళ్లకు నిరంతరాయంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించాలని, ప్రజల అపోహలను తొలగించాలని మరియు వినియోగదారులు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా చూసుకోవాలని కలెక్టర్లను కోరారు.ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, నీటిపారుదల ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్, ఇఎన్‌సి రమేష్ బాబు, శ్రీనివాస్, ప్రత్యేక కమిషనర్, ఐ అండ్ పిఆర్ సిహెచ్. ప్రియాంక మరియు ఇతర సీనియర్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

_____________________________________________

No shortage of LPG in State: N. Uttam Kumar Reddy...
Irrigation & Civil Supplies Minister Capt. N. Uttam Kumar Reddy, along with Minister Tummala Nageswara Rao, held a video conference from Dr. B.R. Ambedkar Secretariat with District Collectors, SPs and Police Commissioners to review LPG supply, summer drinking water preparedness and implementation of the 99-Day Praja Palana–Pragati Pranalika programme.The Minister clarified that there is no shortage of cooking gas in the state and directed officials to ensure uninterrupted supply to domestic consumers, hospitals and government hostels. Collectors were asked to prevent black marketing, remove public misconceptions and ensure that consumers do not face any inconvenience.
Chief Secretary K. Ramakrishna Rao, Civil Supplies Commissioner Stephen Ravindra, Irrigation Principal Secretary Sridhar, Special Secretary Prashant Jeevan Patil, Assistant Secretary K. Srinivas, ENC Ramesh Babu, Srinivas, Special Commissioner, I&PR CH. Priyanka, and other senior officials participated in the review.
------------------------------------------------------------------------
*గ్యాస్ సిలిండర్ల అక్రమ మళ్ళింపుపై కఠిన చర్యలు.. ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి*
------------------------------------------------------------------------
ఖమ్మం : డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు. గురువారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను ఏ వ్యక్తి అయినా సరే అక్రమంగా నిల్వ చేయడం పూర్తిగా నిషేధించామన్నారు.హోటళ్ళు, రెస్టారెంట్లలో డొమెస్టిక్ సిలిండర్లను వినియోగించడం చట్టవిరుద్ధమని తెలిపారు. వాణిజ్య అవసరాలకు కేవలం కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వాడాలని అదనపు కలెక్టర్ అన్నారు.డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా మళ్ళించిన వారిపై ఇసి యాక్ట్ 1955, సెక్షన్ 6ఏ కింద కేసులు నమోదు చేయడంతో పాటు తీవ్రమైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని అన్నారు. సివిల్ సప్లయిస్ అధికారులు నిరంతరం దాడులు నిర్వహించాలన్నారు.నియమాలు ఉల్లంఘించిన వారి లైసెన్సులు రద్దు చేయలన్నారు.ఎల్పీజీ సబ్సిడీ లబ్ధిదారులందరూ వెంటనే ఇ-కేవైసి పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ అన్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది అడిగినప్పుడు లబ్ధిదారులు తప్పనిసరిగా ఓటిపి అందించి సహకరించాలన్నారు.ఓటిపి ఇవ్వకపోతే, సబ్సిడీ నిలిపివేయబడే అవకాశం ఉందని తెలిపారు. ఇ-కేవైసి చేయించుకోకపోతే భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ సరఫరా నిలిపివేయబడుతుందని అన్నారు. లబ్ధిదారులు అత్యంత త్వరగా సమీప గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఇ-కేవైసి పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
డొమెస్టిక్ సిలిండర్ల అక్రమ వినియోగం గురించి సమాచారం ఉన్న వారు వెంటనే సివిల్ సప్లయిస్ విభాగానికి లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని అదనపు కలెక్టర్ కోరారు. సర్కారు సబ్సిడీపై అందించే డొమెస్టిక్ సిలిండర్లు కేవలం సాధారణ గృహ వినియోగదారుల కోసం మాత్రమే అని, వాటిని వాణిజ్య అవసరాలకు దుర్వినియోగం చేయడం ప్రభుత్వానికి, సామాన్య ప్రజలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుందని ఆదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.