Thursday, 7 July 2022

వరప్రదాతకు మహా పుష్పాభిషేకం... పుష్ష్ప వనంగా మారిన సాయి సన్నిది ...



ఖమ్మం కల్చరల్, జూలై 7 : స్థానిక వరప్రదాత శ్రీ శిరిడి సాయి మందిరంలో గురువారం మహా పుష్పాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. షిరిడి సాయినాధునికి వివిధ రకాల పుష్పాలతో అభిషేకం నిర్వహించారు.రంగు రంగుల పుష్పాలతో మందిరం పుష్పవనంలా మారింది.మందిరం చైర్మన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారికి గులాబీ ,మల్లె, చేమంతి, సంపెంగ, జాజి, బంతి, విరజాజి, లిల్లీ, కనకాంబరం, ముద్దబంతి తదితర 500 కేజీల పుష్పాలతో స్వామివారి అభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, సాయి దీక్షాపరులు అత్యధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఉత్సవంలో భాగస్వాములయ్యారు. 
తొలుత పుష్పాలు నిండిన గంపలతో భక్తులు నగరంలో ఊరేగింపు నిర్వహించారు. స్థానిక ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి ప్రారంభమైన  ఈ ఊరేగింపు పొట్టి శ్రీరాములు రోడ్ , ట్రంక్ రోడ్, ఎమ్మార్వో ఆఫీస్ రోడ్, ఉమెన్స్ కాలేజ్ రోడ్డు మీదుగా వరప్రదాత శ్రీ షిరిడి సాయి ఆలయానికి చేరుకుంది. ఆలయంలో మేధా దక్షిణామూర్తి హోమం సాంప్రదాయ సిద్ధంగా ఋత్వికులు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు,  భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, ఆలయ కార్యదర్శి అర్వపల్లి నిరంజన్, ఆలయ కమిటీ సభ్యులు నూనె శ్రీనివాసరావు, తీర్ధాల శ్రీనివాసరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అల్పాహారం, ఫలహారాలను అందించారు.

No comments:

Post a Comment