ఖమ్మం, సెప్టెంబర్ 13: అభివృద్ధి పనులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులు, 3వ రైల్వే లైన్ భూ నిర్వాసితులతో జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 3వ రైల్వే లైన్ ఏర్పాటు కొరకు 126 ఎకరాల మేర భూసేకరణ చేపట్టుతున్నట్లు తెలిపారు. పరిహారం నిర్ణయానికి భూమి కోల్పోతున్న రైతులతో సంప్రదింపులు జరిపి ధర నిర్ణయానికి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. చింతకాని మండలం చింతకాని గ్రామంలో 8 మంది రైతులకు చెందిన 2.33 ఎకరాలు, నాగులవంచ గ్రామానికి చెందిన 24 మంది రైతుల నుండి 4.37 ఎకరాలు, ఆనంతసాగర్ గ్రామానికి చెందిన 28 మంది రైతుల నుండి 7.14 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, రైల్వే అధికారి సూర్యనారాయణ, చింతకాని మండల తహసీల్దార్ మంగీలాల్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment