Saturday, 2 December 2023

*ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు : సిఆర్‌పిఎఫ్‌ జవాన్లకు గాయాలు*



ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో శనివారం ఉదయం జరిగిన నక్సలైట్ల దాడిలో ఇద్దరు సిఆర్‌పిఎఫ్‌ జవాన్లకు, ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. గత ఏడాది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయిన 54 మంది నక్సలైట్ల జ్ఞాపకార్థం నేటి నుంచి డిసెంబర్‌ 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలు జరుపుకోనున్నట్లు నక్సలైట్లు కరపత్రాలను విడుదల చేశారు..
కొన్ని చోట్ల పోస్టర్లను అంటించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జవాన్లు శనివారం ఉదయం పీఎల్‌జీఏ వారోత్సవాలకు సంబంధిచిన పోస్టర్లను ఆ ప్రాంతం నుండి తొలగిస్తున్నారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌ లోని దంతేవాడలో నక్సలైట్లు.. ఈరోజు ఉదయం సీఆర్పీఎఫ్‌ జవాన్లు టార్గెట్‌ గా ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ పేలుడులో సీఆర్పీఎఫ్‌ 195 బెటాలియన్‌కు చెందిన ఇద్దరు జవాన్లకు, అలానే ఒక మీడియా వ్యక్తికి గాయాలయ్యాయి. కాగా గాయపడిన సీఆర్పీఎఫ్‌ జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం..

*ఇద్దరు మావోయిస్టు పార్టీ సాంకేతిక నిపుణుల టీం సభ్యుల  అరెస్ట్*
రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీమతి రెమారాజేశ్వరి ఐపిఎస్., గారు మీడియాతో మాట్లాడుతూ...... తేది: 02-12-2023న రామగుండము పోలీస్ కమీషనరేట్, మంచిర్యాల జోన్  జైపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇందారం గ్రామం లోని ఒక ఇంట్లో  నిషేదిత CPI (మావోయిస్ట్) పార్టీ, టెక్నికల్ డిపార్ట్‌మెంట్, సెంట్రల్ టెక్నికల్ టీమ్ క్యాడర్, D. గంగాధర  రావు @ నర్సన్న @ బక్కన్న @ వెంగో దాదా మరియు అతని భార్య భవానీ @ సుజాత @ శ్యామల, DVCM, CPIM, DKSIC CPI మావోయిస్టు పార్టీ మెంబర్ లు ఉన్నారనే నమ్మదగిన సమాచారం మేరకు రామగుండము పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక బృందం అట్టి ఇంటిని తనిఖి చేసి వారిని అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేసి  అరెస్ట్ చేయడం జరిగింది. 

No comments:

Post a Comment