Thursday, 2 May 2024

లక్ష్యం కోసం ప్రణాళికతో ముందుకు సాగండి : కలెక్టర్ వి.పి.గౌతమ్

ఖమ్మం, మే 2: ఉన్నత లక్ష్యం ఏర్పరచుకొని, లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఎస్ఎస్ సి- 2024 వార్షిక ఫలితాలలో 10  కి 10 జిపీఏ సాధించిన 16 మంది ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను గురువారం నూతన కలెక్టరేట్ లో విద్యాశాఖచే నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, విద్యార్థులను అభినందించి, శాలువా తో సత్కరించి, జ్ఞాపిక ను అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులు ప్రోత్సహించి, వారు ఎంచుకున్న లక్ష్య సాధనకు సహకరించాలన్నారు. విద్యార్థులు పరీక్షకు ఎలా సంసిద్ధమయ్యారు, వారి కుటుంబ నేపథ్యం, వారి భవిష్యత్ ప్రణాళికలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆ లక్ష్యసాధనకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. దీనికోసం విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ తరఫున తగిన మార్గదర్శనం చేయాలని ఆయన తెలిపారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో డిఈఓ సోమశేఖర శర్మ, సిఎంఓ రాజశేఖర్, డిసీఈబి కార్యదర్శి నారాయణ, ఆర్ సి ఓ లు ప్రత్యూష, అంజలి, విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment