*ఖమ్మం: జుజూబి మాటలు చెప్పనని జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయపరంగా చిక్కులు లేకుండా... నిపుణుల సలహాతో ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ రోల్ మోడల్ గా ఉండేలా చేస్తామన్నారు. ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం తనను కలిసి వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులతో మంత్రి చర్చించారు. , ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని, కోడ్ పూర్తయ్యాక జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులతో చర్చించి తప్పకుండా నిర్ణయం తీసుకుందామన్నారు. జర్నలిస్టుల్లో చాలామంది పేదలు ఉన్నారు... వాళ్ల సాధక బాధకాలు నాకు తెలుసు కాబట్టి, ముందుగానే డబ్బులు కట్టించి.. కాలయాపన చేస్తూ మభ్యపెట్టే తీరు నాది కాదని స్పష్టం చేశారు. ఆకలితో అలమటించి, రూపాయి రూపాయి పోగేసుకునే ఏ ఒక్క జర్నలిస్టు డబ్బులు వృధా కావద్దని.. ఆ దిశగానే నా ప్రయత్నం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఎలా వీలైతే అలా... నిపుణుల సూచన మేరకు ముందుకెళ్దామన్నారు. ఏదో ఒక రకంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అటువంటివాటిని పట్టించుకోను, కాని జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్న చిత్తశుద్ధి తో వున్నానని స్పష్టం చేసారు కొంతమంది జర్నలిస్టు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేద్దాం అన్నారు. కాగా మొట్టమొదటిసారిగా మంత్రి హోదాలో ఖమ్మం సందర్శించిన సందర్భంగా ఆయన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు బాధ్యత తనదే అన్న విషయం విధితమే
No comments:
Post a Comment