Saturday, 1 March 2025

ఎల్లారీస్ లేకుంటే అక్రమ నిర్మాణాలకు అనుమతి నిల్.: జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్


*30 రోజుల్లో పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలి .... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*

*ఇంటర్ పరీక్షలు, ఎల్.ఆర్.ఎస్.  పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, అదనపు కలెక్టర్ లు*
ఖమ్మం :  30 రోజుల్లో పెండింగ్ లో ఉన్న 70 వేల  ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్.ఆర్.ఎస్. పై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇంటర్ పరీక్ష కేంద్రాలలో ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదని, పరీక్షలు సజావుగా నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిందని అన్నారు. 
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులతో మాట్లాడుతూ* రెవెన్యూ , ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు కలిసి బృందంగా పని చేస్తేనే ఎల్ఆర్ఎస్ లో పురోగతి సాధ్యమని అన్నారు. శనివారం అదనపు కలెక్టర్, తహసిల్దార్, ఎంపిడిఓ, ఎంపీఓ, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని కలెక్టర్ అన్నారు.
జిల్లాలో 70 వేల ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని, ప్రతి రోజు ఎంత మేరకు దరఖాస్తులు పరిష్కరించవచ్చు పరిశీలించి, ప్రతి బృందానికి లక్ష్యాలు నిర్దేశించాలని కలెక్టర్ తెలిపారు. పనుల పురోగతిని కలెక్టర్ గా తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని, 30 రోజుల వ్యవధిలో 70 వేల దరఖాస్తుల  ప్రక్రియ పూర్తి కావాలని అన్నారు.9 వేల ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను జిల్లాలో ఆమోదించామని అన్నారు. ఎల్.ఆర్.ఎస్. క్రమబద్ధీకరణ లేని పక్షంలో అక్రమ నిర్మాణాల తొలగింపు ఉంటుందని, నిర్మాణాలకు అనుమతి ఉండదని వారిని ఫాలో అప్ చేయాలని కలెక్టర్ సూచించారు.మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి సజావుగా నిర్వహించాలని  తెలిపారు.  పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగునీరు అందించాలని, పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని,  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని, ప్రత్యేక బస్సులను నడపాలని  తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారా మెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. 
ఈ సమావేశంలో జెడ్పీ సిఇఓ దీక్షా రైనా, డిపిఓ ఆశాలత, డిఎం&హెచ్ఓ డా. కళావతి బాయి, ఆర్డీవోలు నరసింహా రావు, ఎల్. రాజేందర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు,  ఆర్టిసి, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 
*ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్.ఆర్.ఎస్.  దరఖాస్తులను పరిష్కరించాలి... అదనపు కలెక్టర్ లు డా. శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి*

**టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలి*

**మండలాల్లో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేయాలి*

**ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల స్క్రూటినీ, పరిష్కారంపై సంబంధిత అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన అదనపు కలెక్టర్ లు*
------------------------------------------------------------------------
ఖమ్మం : ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్.ఆర్.ఎస్.  దరఖాస్తులను మార్చి నెలాఖరు లోగా స్క్రూటినీ పూర్తి చేసి పరిష్కరించేలా చూడాలని అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు.శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఎల్.ఆర్.ఎస్. పై సంబంధిత అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్ లు మాట్లాడుతూ* పెండింగ్ ఉన్న ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల స్క్రూటినీ కోసం అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి బృందంలో నీటి పారుదల శాఖ అధికారి, రెవెన్యూ అధికారి, టౌన్ ప్లానింగ్, సంబంధిత అధికారులు ఉండాలని అన్నారు. మండలంలో అవసరమైన మేర లాగిన్ అందించడం జరుగుతుందని, అవసరమైన బృందాలను ఏర్పాటు చేసుకొని ప్రతి రోజూ ఎన్ని దరఖాస్తులు స్క్రూటినీ జరుగుతుందో లక్ష్యాలు నిర్దేశించుకోవాలని అన్నారు. భూ క్రమబద్ధీకరణలో భాగంగా ప్రభుత్వ భూములలో, నీటి వనరుల ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో క్రమబద్ధీకరణకు అనుమతించరాదని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ధృవీకరణ చేయాలని, బృందంలో ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తును పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు. భూ క్రమబద్ధీకరణలో ఎక్కడైనా అవతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఎల్.ఆర్.ఎస్. స్క్రూటినీ పూర్తి చేసుకుని ఆమోదించిన దరఖాస్తుదారులను ఫాలో అప్ చేస్తూ మార్చి 31 లోపు ప్రభుత్వం అందించే రాయితీ వినియోగించుకునేలా చూడాలని అన్నారు. అనంతరం మండలాల వారిగా అదనపు కలెక్టర్ సమీక్షించి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యల గురించి వివరించి, సందేహాలను నివృత్తి చేసారు. ఈ సమావేశంలో డిపిఓ ఆశాలత, డిఎల్పీఓ రాంబాబు, 
ఖమ్మం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ షఫీయుల్లా, తహసీల్దార్ లు, ఎంపిడిఓ, నీటి పారుదల శాఖ, టౌన్ ప్లానింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment