ఖమ్మం: విభజనకు తావులేని భజన-సేవలలో పాలుపంచుకోవడం ద్వారా దైవానుగ్రహం పొందుతారని సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ సభ్యులు RJ రత్నాకర్ అన్నారు. ఖమ్మం జిల్లాలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన పలు కార్యక్రమాలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జిల్లాలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. నేలకొండపల్లి మండలం జెక్కెపల్లి గ్రామంలో భజన మండలి నూతన భవనమును ప్రారంభించి. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో భజన మండలికి సొంత భవనం ఉండాలనే ఆకాంక్షతో జక్కెపల్లి గ్రామ వాసులు అందరూ కలిసి తలా కొంత చందాలు వేసుకొని భజన మండలి నూతన భవనమును నిర్మించుకోవటం ఆనందదాయకమని భజన మండలికి హాజరైతే విభజన ఉండదని గ్రామం ప్రశాంతంగా ఉంటుందని గ్రామాలు ప్రశాంతంగా ఉంటే దేశం ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు . ఖమ్మం పట్టణంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిత్య అన్నదాన కార్యక్రమం ఆరవ వార్షికోత్సవం కు హాజరై ప్రతిరోజు క్రమం తప్పకుండా 500 మందికి అన్నదానం చేస్తున్న ఖమ్మం జిల్లా సత్యసాయి సంస్థ సభ్యులను ప్రశంసించారు. వైరా సత్యసాయి సమితి వారు నిర్వహించబోయే గోశాలను ప్రారంభించారు.
సాయంత్రం సత్తుపల్లిలో సత్యసాయి సమితి మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై సత్యసాయి సంస్థలు చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమమునకు జిల్లా అధ్యక్షులు దమ్మాలపాటి సుధాకర్ రావు, కన్వీనర్ ఆలస్య నరసింహారావు,
మాదిరాజు రామచంద్ర రావు, మూర్తి, ఆదినారాయణ, బుల్ల రామారావు,కొదుమూరు వెంకటేశ్వర్లు,రామారావు, భాస్కర రావు, ఎం.విజయ్ తదితరులు పాల్గొన్నారు@మణికుమార్ కొమ్మమూరు,9032075966.
No comments:
Post a Comment