తొలిసారిగా ఖమ్మంలో జాదూగర్ సికందర్ మ్యాజిక్
నూతన సంవత్సరం నూతన అనుభూతి
15వేలకు పైగా ప్రదర్శనలు
హాస్యం మాయజాలం మేళ వించిన వైవిధ్యభరితమైన ప్రదర్శన ఖమ్మం గుమ్మంలో..
__ జాదుగర్ సికందర్
ఖమ్మం, డిసెంబర్ 31: తొలిసారిగా తన మ్యాజిక్ షో తో ఖమ్మం ప్రజలకు అలరించడానికి వచ్చానని జాదుగర్ సికందర్ అన్నారు.. బుధవారం బక్క రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలిసారిగా జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా జనవరి 1 నుండి స్థానిక భక్తా రామదాసు కళాక్షేత్రంలో తన మ్యాజిక్ షో ప్రారంభం కానుందని ప్రకటించారు. రోజుకు రెండు షోలతో , ఆదివారం వంటి సెలవు దినాలలో మూడు షోలు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం మూడు గంటలు సాయంత్రం 6 గంటలకు మ్యాజిక్ ప్రదర్శనలు జరుగుతాయి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు , తిరిగి యధావిధిగా మూడు గంటలకు ,సాయంత్రం 6 గంటలకు మ్యాజిక్ షో లు ఉంటాయని వివరించారు.తొలిసారిగా దక్షిణ భారతదేశంలో సికింద్రాబాద్ లో మ్యాజిక్ షో నిర్వహించి , అనంతరం వరంగల్ లో తదనంతరం ఖమ్మంలో తన మ్యాజిక్ ప్రదర్శనకు అర గెంట్రమ్ చేస్తున్నానని తెలిపారు. గతంలో ఉత్తర భారత దేశంలో నీ అనేక రాష్ట్రాలలో వివిధ వేదికలపై తన మాయజాల ప్రదర్శనలు లక్షలాది మందిని మంత్రముగ్ధులను భావించినట్లు ప్రకటించారు. తొలిసారి పవిత్ర వారణాసిలో ప్రదర్శన ప్రారంభం అయిందని , ఇప్పటివరకు సుమారు 15000కు పైగా మ్యాజిక్ షో ప్రదర్శనలు తలపెట్టానని పేర్కొన్నారు. సుమారు 50 మంది సిబ్బందితో అత్యంత వైభవంతో హాస్యం మేళ వించి అద్భుతంగా సాగే షోలో అనుక్షణం ఉత్కంఠ భరిత వైవిద్యపూరిత అంశాలు మిమ్మల్ని మంత్రముగ్ధులు గావిస్తాయన్నారు. తన షోలో ముఖ్యంగా డైనోసార్ , బెర్ముడా ట్రయాంగిల్ హైలెట్ గా ఉంటాయన్నారు. ఉత్తమ కళాభి రుచి కలిగిన ఖమ్మం ప్రజలు తన మ్యాజిక్ షో ను ఆస్వాదించాలని , అలాగే తనను ఆదరించాలని జాదూగర్ సికందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మ్యాజిక్ షో ఆర్గనైజర్ సయ్యద్ అబ్దుల్ కరీం , లోకల్ మెజీషియన్లు కే వి. చారి , హిందూ జైన్, మ్యాజిక్ పిఆర్ఓ యం డి. షఫీ యు జమ తదితరులు పాల్గొన్నారు.
The Globe 🌎 24x7News
Manikumar Kommamuru
Senior journalist
*Mobile 📲 9032075966*
No comments:
Post a Comment