*అత్యంత ప్రాధాన్యతతో అంధుల పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*
*ఆడియో సూచనలతో పాఠాలు మరింత సులభంగా అర్థమయ్యేందుకు బ్రెయిల్ లిటరసీ డివైస్ ఏర్పాటు*
*ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్ధినితో భావోద్వేగాలకు లోనైనా కలెక్టర్*
*విద్య, భద్రత, నైపుణ్యాభివృద్ధి కోసం ఆధునిక వసతులతో ప్రత్యేక స్కూల్ నిర్మాణం*
*ఖమ్మం జెడ్పీ సెంటర్ లోని నిజాంపేట ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అంధుల ప్రత్యేక పాఠశాల నిర్మాణ పురోగతి పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
-----------------------------------------------------------------------
ఖమ్మం : అంధుల విద్యాభివృద్ధి కోసం అత్యున్నత ప్రమాణాలతో ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
శుక్రవారం జెడ్పీ సెంటర్ లోని నిజాంపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అంధుల పాఠశాల నిర్మాణ పురోగతి పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనుల ప్రతి భాగాన్ని పరిశీలించి భవన నిర్మాణ నాణ్యత, ప్రహారీ గోడ గేట్, ప్రవేశ మార్గాలు, అంతర్గత గదుల రూపకల్పన, గ్రీనరీ, మొక్కలు, టైల్స్, ప్రత్యేకంగా టాయిలెట్స్, తరగతి గదులు, నైపుణ్యాభివృద్ధి కోసం ఏర్పాట్లు, మ్యూజికల్ రూం తదితర సదుపాయాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అంధులు పాఠశాలలో ప్రవేశించిన క్షణం నుంచి బయటికి వెళ్లే వరకు పూర్తిస్థాయి భద్రత, సౌలభ్యం లభించేలా నిర్మాణంలో ప్రతిదీ ఖచ్చితంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అంధ పిల్లల చదువుల కోసం వారి తల్లిదండ్రులు ప్రజావాణిలో అర్జీలు ఇచ్చినప్పుడు ఒక ఆలోచనతో అంధుల భవిష్యత్తకు కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటుకు కార్యచరణ చేపట్టి నేడు పూర్తి దశలలో ఉన్న పనుల పట్ల కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. అంధుల బ్రెయిలీ లీపి కోసం ప్రత్యేకమైక డిజిటల్ అడియో డివైజర్ ద్వారా అంధ విద్యార్థి ఉపయోగించే విధానం పరిశీలించారు. అంధ విద్యార్ధిని జి. భవాణి ఇలాంటి అధునాతన సౌకర్యాలు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసినందుకు కలెక్టర్ భావోద్వేగాలకు లోనయ్యారు. జిల్లాలో అంధ విద్యార్థులు ఈ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* అంధుల విద్యా అవకాశాల దృష్ట్యా ప్రత్యేక పాఠశాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ, మిగిలిన పనులను వేగవంతం చేసి అత్యుత్తమ నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు.
ఆడియో సూచనలు తో పాఠాలు మరింత సులభంగా అర్థమయేందుకు బ్రెయిలీ లీపి చదవటం, టైప్ చేయటం, రాయటం నేర్పడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన బ్రెయిలీ లిటరసీ డివైస్ లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. దృష్టి, కంఠ పరిమితి ఉన్న విద్యార్థులు తామే బ్రెయిలీ నేర్చుకోవచ్చని, పాఠ్యాంశాలు, ఆట అంతర్లీన పాఠాలు ద్వారా ఆటలు, పరీక్షలు, వ్యాయామాలు ఆడియో ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.
అంధ విద్యార్థులు స్వతంత్రంగా కదలాడేందుకు వీలుగా పాఠశాలను పూర్తిగా బారియర్ ఫ్రీ విధానంలో నిర్మించామని అన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేయనున్న సెన్సరీ రూమ్, సెన్సరీ గార్డెన్ అంధ విద్యార్థులలో స్పర్శ, శబ్దం, వాసన, దిశ అవగాహన, సమతౌల్యం వంటి సామర్థ్యాలను పెంచుతాయని కలెక్టర్ వివరించారు. ప్రత్యేక విద్యా మోడళ్లను ఆధారంగా తీసుకుని ఈ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంధ విద్యార్థులకు పాఠశాలలో బ్రెయిల్ లిపి పుస్తకాలు, ఆడియో బుక్స్, లెర్నింగ్ డివైజ్‌లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అన్నారు. నేటితరానికి అనుగుణంగా అంధుల్లో ముఖ్యమైన కంప్యూటర్ స్కిల్స్ కోసం ల్యాబ్‌ను స్మార్ట్ టెక్నాలజీతో ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులు సాఫ్ట్‌వేర్ స్క్రీన్ రీడర్లు, డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా పాఠాలు నేర్చుకునేలా వాతావరణం ఉండాలన్నారు.
విద్యుత్ సరఫరా విషయంలో ప్రమాదావకాశం లేకుండా చైల్ట్-సేఫ్ స్విచ్‌లు, హై క్వాలిటీ వైరింగ్, అనుకూలమైన లైటింగ్ సిస్టమ్ ఉన్నాయని తెలిపారు.అంధ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన డెస్కులు, కుర్చీలు, నేర్చుకునే పరికరాలు, సమకూర్చమని, అంధుల పాఠశాల పూర్తయిన తర్వాత ఖమ్మం జిల్లాలోని అంధ విద్యార్థులకు ఇది ఒక ఆధునిక విద్యా కేంద్రంగా నిలుస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, పంచాయతీరాజ్ ఈఈ మహేష్ బాబు, సీఎంవో ప్రణీవ్ కుమార్, ఏఈ చిరంజీవి, సంబంధిత విభాగాల అధికారులు తదితరులు ఉన్నారు.
------------------------------------------------------------------------
*Collector got Emotional Feel ...when he received Thank you from Divyanethri girl Student*
---------------------------------------------------------------------
Khammam: District Collector Anudeep Durisetty said that a special school is being set up with the highest standards for the education of the blind. On Friday, the District Collector made a surprise inspection of the progress of the construction of the new school for the blind being set up in the premises of the Nizampet Government Primary School in ZP Center. He inspected every part of the construction work and made several suggestions, including the quality of the building construction, the boundary wall gate, entrances, design of the internal rooms, greenery, plants, tiles, special toilets, classrooms, arrangements for skill development, musical room and other facilities. The Collector instructed the officials to ensure that everything in the construction should be perfect so that the blind people can have complete safety and convenience from the moment they enter the school until they leave.When the parents of blind children applied for education in Prajavani, with an idea, the work to establish a special school for the future of the blind was undertaken and Collector Anudeep Durisetty expressed satisfaction with the work that is in its complete stages today. The blind student's use of a special digital audio device for the blind Braille script was examined. The Collector was moved by the emotion of the blind student G. Bhavani thanking her for providing such advanced facilities. He advised the blind students in the district to take advantage of this school. Speaking on the occasion, District Collector Anudeep Durisetty said that priority should be given to the construction of a special school in view of the educational opportunities of the blind and the remaining work should be expedited and completed with the best quality. The Collector said that specially designed Braille literacy devices have been installed to teach reading, typing and writing in Braille script to make the lessons more easily understood with audio instructions. He explained that students with visual and auditory limitations can learn Braille on their own and can learn games, tests and exercises through audio through the curriculum and game-based lessons. He said that the school has been built completely barrier-free to enable blind students to move independently. The collector explained that the sensory room and sensory garden to be set up in the school will enhance the abilities of blind students such as touch, sound, smell, sense of direction, and balance. He said that these facilities are being set up based on special education models. He said that Braille books, audio books, and learning devices should be made available to blind students in the school. He said that a lab should be set up with smart technology for important computer skills for the blind in accordance with today's generation. He said that there should be an environment where students can learn lessons through software screen readers and digital learning modules. He said that there should be child-safe switches, high-quality wiring, and a suitable lighting system without any risk of accident in terms of power supply. He said that special desks, chairs, and learning equipment should be provided for blind students. The collector expressed hope that after the completion of the school for the blind, it will become a modern educational center for blind students in Khammam district. The Collector was accompanied by ZP CEO Deeksha Raina, Panchayat Raj EE Mahesh Babu, CMO Praneev Kumar, AE Chiranjeevi, officials of relevant departments and others. *Talent of Cyberabad Women Police in performing their duties*
Powered by: MANIKUMAR KOMMAMURU
📲: 9032075966.
_____________________________________________
సైబరాబాద్ మహిళా పోలీసులు వీధి నిర్వహణలో తమ ప్రతిభ, అంకితభావంతో గుర్తింపు పొందుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా, అధికారిక కార్యక్రమాల్లోనూ తమదైన ముద్ర వేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
*క్రమశిక్షణకు నిదర్శనం..*
అక్టోబర్ 21న నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా, మహిళా పోలీస్ అధికారులు క్రమశిక్షణతో కూడిన పరేడ్‌లో పాల్గొని అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కవాతులో వారు ప్రదర్శించిన ఏకాగ్రత, సమన్వయం, వృత్తిపరమైన అంకితభావం పరేడ్‌కు మరింత గౌరవాన్ని చేకూర్చింది. నగరానికి విచ్చేసే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులకు ఇచ్చే 'గార్డ్ ఆఫ్ హానర్', వారి సమయపాలన మరియు బాధ్యతాయుతమైన విధి నిర్వహణకు అద్దం పడుతోంది.
*అప్రమత్తమైన భద్రత..*
కేవలం పగటి విధులతోనే పరిమితం కాకుండా, మహిళా పోలీసులు రాత్రి సమయాల్లోనూ అత్యంత అప్రమత్తతతో సెంట్రీ విధులను నిర్వర్తిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని కీలక ప్రాంతాలు, కార్యాలయాల వద్ద నిరంతరం కాపలా కాస్తూ నగర భద్రతా వ్యవస్థలో తమవంతు కీలక పాత్ర పోషిస్తున్నారు.
*సృజనాత్మకతలోనూ..*
వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, హోం గార్డ్స్ వార్షికోత్సవం వంటి అధికారిక కార్యక్రమాల్లో మహిళా పోలీసులు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ తమలోని సృజనాత్మకతను ప్రదర్శిస్తున్నారు.
సభలను సమర్థవంతంగా నడిపిస్తూ, తమ వాగ్ధాటితో కార్యక్రమ నిర్వహణను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
*సీపీ ప్రత్యేక అభినందనలు*
ప్రతిష్టాత్మక 'మిస్ వరల్డ్' పోటీల బందోబస్తు విధుల్లో మహిళా పోలీసులు ప్రదర్శించిన అత్యుత్తమ పనితీరును పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా కొనియాడారు. క్లిష్టమైన పరిస్థితుల్లో వారు చూపిన అంకితభావాన్ని గుర్తిస్తూ వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఉన్నతాధికారుల నుంచి అందుతున్న ఈ గుర్తింపు, ఇతర మహిళా సిబ్బందికి స్ఫూర్తినిస్తోంది.
*సీపీఆర్‌తో ప్రాణ రక్షణ*
విధి నిర్వహణలో మహిళా పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, ప్రాణదాతలుగానూ నిలుస్తున్నారు. పరిగి నుంచి విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ముగ్గురు ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లు దీపశ్రీ, వనజ, పద్మలు ప్రమాద స్థలిలో చూపిన చొరవ అభినందనీయం
ప్రమాదానికి గురైన బస్సు వెనుక ప్రయాణిస్తున్న వీరు, ఘటన జరిగిన ఐదు నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నారు. క్షణమాత్రం ఆలస్యం చేయకుండా, మరో ఏడుగురు కానిస్టేబుళ్లతో కలిసి మొత్తం 11 మంది క్షతగాత్రులకు సీపీఆర్ నిర్వహించి, వారి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. బాధితులు స్పృహలోకి రాగానే వెంటనే వారిని ఆస్పత్రులకు తరలించారు.
*గాయాలను లెక్కచేయని పోలీస్ ఉక్కు సంకల్పం*
ఇటీవల చేవెళ్ల బస్సు-టిప్పర్ ఢీకొన్న ఈ ఘటనలో పోలీసులు గాయాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. చేవెళ్ల, వికారాబాద్, పరిగి సబ్ డివిజన్ల నుంచి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ నియంత్రిస్తూనే, ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఫైర్ సిబ్బందితో కలిసి వెల్డింగ్ కట్టర్ల సాయంతో బస్సు రాడ్లను తొలగించి బాధితులను కాపాడారు. ఈ క్రమంలో పలువురు మహిళా పోలీసులు కు స్వల్ప గాయాలయ్యాయి.
సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన మహిళా పోలీసుల సేవాదృక్పథాన్ని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
No comments:
Post a Comment