Sunday, 22 February 2026

జర్నలిస్ట్ అక్రిడేషన్ ల జారీలో సమస్యలు పరిష్కరిస్తాం.. రామ్ నారాయణ కు హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి

యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు

-వెబ్ సైట్ సమస్యలు పరిష్కరిస్తాం

-రామ్ నారాయణ కు హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి

-సమస్యలు పరిష్కరించాలని కోరిన టి యు డబ్ల్యూ జే ఐ జే యు బృందం

-కేబుల్ చానల్స్, చిన్న పత్రికలకు కూడా అక్రిడేషన్లు కల్పించాలని విజ్ఞప్తి

_____________________________________________

ఖమ్మం  : జర్నలిస్టు యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల అక్రిడేషన్, వెబ్ సైట్, కేబుల్ చానల్స్, చిన్న పత్రికల సమస్యలపై మంత్రి పొంగులేటి కి టియుడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టు యూనియన్ నాయకుల బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామ్ నారాయణ సారధ్యంలో ప్రత్యేకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల రామ్ నారాయణ ఈ సందర్భంగా మంత్రికి అన్ని విభాగాల జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. రాష్ట్రంలో 44709 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పారని, తమరు ఇచ్చిన జీవో ప్రకారం చూస్తే 50% కార్డులు కూడా రావనే గందరగోళం జర్నలిస్టుల్లో నెలకొందని పేర్కొన్నారు. ఫ్రీలాన్సర్, వెటరన్ జర్నలిస్టులకు పెట్టిన నిబంధనలు ఇబ్బందిగా ఉన్నాయని, వెబ్ సైట్ ఓపెన్ చేస్తే అందులో అడిగే ప్రశ్నలు కార్డులు ఇచ్చేలా లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. వెబ్సైట్ ఫార్మేట్ సులభతరంగా లేదని ప్రస్తావించారు. జిల్లా అక్రిడేషన్ కమిటీలలో గత సాంప్రదాయం ప్రకారం రిజిస్టర్డ్ యూనియన్ నుంచి లెటర్ పంపితే కమిషనర్ కార్యాలయం ఆమోదించి వారిని కమిటీ లో సభ్యులుగా తీసుకున్నారని, ప్రస్తుతం దానిని పక్కన పెట్టి కలెక్టర్లకు అధికారం కల్పించడానినీ తప్పు పట్టారు. ఇది అత్యంత విచారకరమన్నారు. పాత పద్ధతినే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత జీవో ప్రకారం కలెక్టర్ అందరిని నామినేట్ చేస్తారనే ఉందని , ఇది సాధ్యం కాదని, కలెక్టర్కు కొత్త చిక్కులు తెచ్చి పెడుతుందని పేర్కొన్నారు. మా విన్నపాన్ని పరిశీలించి గతంలో అక్రిడేషన్ కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేశారో అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని రామ్ నారాయణ మంత్రిని కోరారు.

జీవో ప్రకారం పెద్ద పత్రికలు, శాటిలైట్ చానల్స్,  డెస్క్ జర్నలిస్టుల కార్డులు తగ్గించడం జరిగిందని, దీంతో ఇబ్బందులు తప్పవనే ఆందోళనతో జర్నలిస్టులు ఉన్నారని పేర్కొన్నారు. చిన్న పత్రికల వారు కూడా తమకు గతంలో మాదిరిగా కార్డులు రావని ఆందోళనలో ఉన్నారని, కేబుల్ చానల్స్ జర్నలిస్టులకు అన్యాయమే జరుగుతుందని వివరించారు. గతంలో వారు కార్డులు పొందినప్పటికీ , ఈసారి కార్డులు రావని ఆందోళన చెందుతున్నారని 20 నిమిషాల పాటు అన్ని అంశాలపై మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. అక్రిడేషన్ వెబ్ సైట్ ను సరళీకరణ చేస్తామన్నారు. అక్రిడేషన్ల గడువు మరో నెల పొడిగింపు జరుగుతుందని, జర్నలిస్టులు, సంఘాల నాయకులు ఆందోళన చెందరాదన్నారు. అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ఐజేయు జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్, మాజీ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, యూనియన్ జిల్లా కార్యదర్శి మైస పాపారావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మామిడాల భూపాల్, జర్నలిస్టుల జిల్లా హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు కనకం సైదులు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మోయినుద్దీన్, జిల్లా కోశాధికారి నాగండ్ల శివ, ఖమ్మం నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్, నంచర్ల జనార్ధన చారి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వేగినాటి మాధవరావు, జిల్లా నాయకులు ఏలూరు వేణుగోపాలరావు తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

------------------------------------------------------------------------

Minister Ponguleti promises to resolve issues in issuing accreditation cards

Accreditation committees will be formed only on the proposal of the unions

-We will resolve the website issues

-Minister Ponguleti assures Ram Narayana

-TUWJ IJU team seeks resolution of issues

-Request to provide accreditation to cable channels and small newspapers too

----------------------------------------------------------------------

Khammam : State Revenue, Information, Public Relations and Housing Minister Ponguleti Srinivas Reddy has assured that accreditation committees will be formed only on the proposal of the journalist unions. On Sunday, a group of TUWJ IJU journalist union leaders, led by State General Secretary K Ram Narayana, met at the Minister Ponguleti Srinivas Reddy's camp office in Khammam and handed over a petition to Minister Ponguleti on the issues of accreditation of journalists, websites, cable channels and small newspapers. On this occasion, the Union's State General Secretary Kattekola Ram Narayana explained to the Minister the problems faced by journalists of all sections. He said that they had been told that accreditation cards would be given to 44709 journalists in the state, and according to the GO given by them, there was confusion among journalists as even 50% of the cards were not received. The Minister brought to his attention that the rules imposed on freelancer and veteran journalists were troublesome, and that opinions were expressed that if the questions asked on the website were opened, the cards would not be issued. He mentioned that the website format was not easy.

According to the past tradition in the district accreditation committees, if a letter was sent from a registered union, the Commissioner's office approved it and they were taken as members of the committee, but now it has been set aside and the Collectors have been given the power. He said this is very sad. He appealed to continue the old system. He said that according to the current GO, the Collector nominates everyone, but this is not possible and will bring new complications to the Collector. Ram Narayana requested the minister to consider our request and continue the same tradition as the accreditation committees were set up in the past. He stated that according to the JVO, the cards of big newspapers, satellite channels, and desk journalists have been reduced, and that journalists are worried that this will lead to problems. He explained that those from small newspapers are also worried that they will not get cards like in the past, and that injustice will be done to cable channel journalists. He explained to the minister for 20 minutes that although they had received cards in the past, they are worried that they will not get cards this time. The minister responded positively to this. Minister Ponguleti assured that accreditation committees will be set up only on the proposal of the unions. He said that the accreditation website will be simplified. The accreditation deadline will be extended by another month, and journalists and union leaders should not worry. Minister Ponguleti clarified that accreditation cards will be given to all eligible people. Those who met the minister included TUWJ IJU Journalists Union State Committee member Mateti Venugopal, former district president Vanam Venkateswarlu, union district secretary Maisa Paparao, district electronic media president Mamidala Bhupal, journalists' district housing society president Kanakam Saidulu, union district vice president Moinuddin, district treasurer Nagandla Siva, Khammam city committee president secretaries Cherukupalli Srinivas, Nancharla Janardhana Chari, district organizing secretary Veginati Madhavarao, district leader Eluru Venugopal Rao and other journalists.

_____________________________________________

 एक्रेडिटेशन कार्ड जारी करने में आने वाली दिक्कतों को हल करें...

रामनारायण ने टीयूडब्ल्यूजे आईजेयू की ओर से मंत्री पोंगुलेटी से अपील की

----------------------------------------------------------------------

खम्मम : राज्य के रेवेन्यू, इन्फॉर्मेशन, पब्लिक रिलेशन्स और हाउसिंग मिनिस्टर पोंगुलेटी श्रीनिवास रेड्डी ने भरोसा दिलाया है कि एक्रेडिटेशन कमेटियां सिर्फ पत्रकार यूनियनों के प्रस्ताव पर बनेंगी। रविवार को, टीयूडब्ल्यूजे आईजेयू पत्रकार यूनियन के नेताओं का एक ग्रुप, राज्य जनरल सेक्रेटरी के राम नारायण की लीडरशिप में, मंत्री पोंगुलेटी श्रीनिवास रेड्डी के खम्मम में कैंप ऑफिस में मिला और पत्रकारों, वेबसाइट्स, केबल चैनलों और छोटे अखबारों की एक्रेडिटेशन के मुद्दों पर मंत्री पोंगुलेटी को एक पिटीशन सौंपी। इस मौके पर, यूनियन के राज्य जनरल सेक्रेटरी कट्टेकोला राम नारायण ने मंत्री को सभी वर्गों के पत्रकारों की दिक्कतों के बारे में बताया। उन्होंने कहा कि उन्हें बताया गया था कि राज्य में 44709 पत्रकारों को एक्रेडिटेशन कार्ड दिए जाएंगे, और उनके दिए गए जीवो के अनुसार, पत्रकारों में कन्फ्यूजन था क्योंकि 50% कार्ड भी नहीं मिले थे। मंत्री ने उनके ध्यान में लाया कि फ्रीलांसर और पुराने पत्रकारों पर लगाए गए नियम परेशान करने वाले थे, और राय दी गई थी कि अगर वेबसाइट पर पूछे गए सवाल खोले गए, तो कार्ड जारी नहीं किए जाएंगे। उन्होंने बताया कि वेबसाइट का फॉर्मेट आसान नहीं था। जिला एक्रेडिटेशन कमेटियों में पहले के रिवाज के अनुसार, अगर किसी रजिस्टर्ड यूनियन की तरफ से कोई लेटर भेजा जाता था, तो कमिश्नर ऑफिस उसे अप्रूव करता था और उन्हें कमेटी का मेंबर माना जाता था, लेकिन अब इसे खत्म कर दिया गया है और कलेक्टरों को पावर दे दी गई है। उन्होंने कहा कि यह बहुत दुख की बात है। उन्होंने पुराने सिस्टम को जारी रखने की अपील की। ​​

उन्होंने कहा कि मौजूदा जीवो  के अनुसार, कलेक्टर सभी को नॉमिनेट करते हैं, लेकिन यह मुमकिन नहीं है और इससे कलेक्टर के लिए नई मुश्किलें आएंगी। राम नारायण ने मंत्री से रिक्वेस्ट की कि वे हमारी रिक्वेस्ट पर विचार करें और उसी रिवाज को जारी रखें जैसे पहले एक्रेडिटेशन कमेटियां बनाई जाती थीं। उन्होंने कहा कि जेवीओ के अनुसार, बड़े अखबारों, सैटेलाइट चैनलों और डेस्क पत्रकारों के कार्ड कम कर दिए गए हैं, और पत्रकारों को चिंता है कि इससे दिक्कतें होंगी। उन्होंने बताया कि छोटे अखबारों वाले भी चिंतित हैं कि उन्हें पहले की तरह कार्ड नहीं मिलेंगे, और केबल चैनल के पत्रकारों के साथ अन्याय होगा। उन्होंने मंत्री को 20 मिनट तक समझाया कि हालांकि उन्हें पहले कार्ड मिले थे, लेकिन उन्हें चिंता है कि इस बार उन्हें कार्ड नहीं मिलेंगे। इस पर मंत्री ने पॉजिटिव जवाब दिया। मंत्री पोंगुलेटी ने भरोसा दिलाया कि यूनियनों के प्रस्ताव पर ही एक्रेडिटेशन कमेटियां बनाई जाएंगी। उन्होंने कहा कि एक्रेडिटेशन वेबसाइट को आसान बनाया जाएगा। एक्रेडिटेशन की डेडलाइन एक और महीने के लिए बढ़ा दी जाएगी, और पत्रकारों और यूनियन नेताओं को चिंता करने की ज़रूरत नहीं है। मंत्री पोंगुलेटी ने साफ किया कि सभी योग्य लोगों को एक्रेडिटेशन कार्ड दिए जाएंगे। मंत्री से मिलने वालों में टीयूडब्ल्यूजे आईजेयू जर्नलिस्ट्स यूनियन स्टेट कमेटी के सदस्य माटेती वेणुगोपाल, पूर्व डिस्ट्रिक्ट प्रेसिडेंट वनम वेंकटेश्वरलू, यूनियन डिस्ट्रिक्ट सेक्रेटरी मैसा पापाराव, डिस्ट्रिक्ट इलेक्ट्रॉनिक मीडिया प्रेसिडेंट ममीडाला भूपाल, जर्नलिस्ट्स डिस्ट्रिक्ट हाउसिंग सोसाइटी के प्रेसिडेंट कनकम सैदुलु, यूनियन डिस्ट्रिक्ट वाइस प्रेसिडेंट मोइनुद्दीन, डिस्ट्रिक्ट ट्रेजरर नागंदला शिवा, खम्मम सिटी कमेटी के प्रेसिडेंट सेक्रेटरी चेरुकुपल्ली श्रीनिवास, ननचारला जनार्दन चारी, डिस्ट्रिक्ट ऑर्गेनाइजिंग सेक्रेटरी वेगिनाटी माधवराव, डिस्ट्रिक्ट लीडर एलुरु वेणुगोपाल राव और दूसरे जर्नलिस्ट शामिल थे।

Powered by: MANIKUMAR KOMMAMURU 
📲:9032075966

No comments:

Post a Comment