*డాక్టర్స్ డే నాడు ఉస్మానియా వైద్య బృందం అద్భుతం చేసి చూపారు.... 36 గంటలపాటు శ్రమించి పేషంట్‌కు ఒకేసారి అయిదు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు.
సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్‌కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన రికార్డును సాధించారని పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం ఈ విజయాన్ని సాధించి వైద్య వృత్తికి మరింత ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా వైద్యులు, ఇతర సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.*
No comments:
Post a Comment