Wednesday, 22 July 2020

కరోనా కట్టడి లో అపశృతి...యువకునిపై లాఠీ దెబ్బ.. చికిత్స పొందుతూ మృతి


ఆంధ్రప్రదేశ్/ప్రకాశం జిల్లా/చీరాల : ప్రకాశం జిల్లా పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. చీరాలలో మూడు రోజుల క్రితం కిరణ్‌ తన స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై బయటకు వచ్చాడు. చీరాల ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ వారిని ఆపి మాస్క్‌ ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 కరోనా వైరస్‌ విజృంభిస్తుంటే మాస్క్‌ పెట్టుకోకుండా బయటకు వస్తారా? అని లాఠీతో కొట్టడంతో కిరణ్‌ అక్కడికక్కడే సృహతప్పి పడిపోయాడు. దీంతో అతన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయినా.. కిరణ్‌ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసు దెబ్బల కారణంగానే కిరణ్‌ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కిరణ్‌ తండ్రి మోహన్‌రావు చీరాలలో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు. మాస్క్‌ పెట్టుకోలేదన్న కారణంతో పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈవిషయంపై పోలీసులు స్పందించారు..18వతేది కిరణ్ తన మిత్రులతో కలసి మందు తాగి డ్రైవింగ్ చేయడంతోపాటు కరోనా ఉధృతంగా వున్న తరుణంలో కనీస బాధ్యత లేకుండా మస్కులేకుండా తిరగడంతో హెచ్చరించమని పేర్కొన్నారు...

No comments:

Post a Comment