తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం పుష్పయాగం మహోత్సవాన్ని టిటిడి ఆధ్వర్యంలో మంగళవారం ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహించింది. కొవిడ్ -19 నిబంధనల దృష్ట్యా ఆలయసిబ్బంది మాత్రమే పాల్గొని కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
* ఇందులో భాగంగా శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.
పుష్పయాగం సందర్భంగా టిటిడి ఉద్యానవన శాఖలో దాతలు సమకూర్చిన కుసుమాలను అమ్మవారి పుష్పయాగానికి వినియోగించారు.
పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైదికులు వేదపారాయణం నడుమ చామంతి, వృక్షి, సంపంగి, గన్నేరు, రోజా, మల్లెలు, మొల్లలు, కనకాంబరాలు, తామర, కలువ, మొగలి, మానుసంపంగి, సెంటు జాజులు, పగడపు పూలు వంటి 14 రకాల పుష్పాలు, మరువం, ధమనం, బిల్వం, తులసి, కదిరిపచ్చ వంటి ఆరు రకాల పత్రాలతో స్వామి వారికిఇరువురు దేవేరులకు పుష్పాంజలి చేపట్టారు. ఆద్యంతం శోభాయమానంగా సాగింది.
బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల కానీ తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. యాగంలో భాగంగా ప్రత్యేక పూజలు ఉత్సవ విగ్రహాలను నిర్వహించారు.
టిటిడి ఇఒ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, డైయో శ్రీమతి ఝాన్సీ రాణి, ఎఇఒ శ్రీ సుబ్రమణ్యం, కంకనా భట్టర్ శ్రీ డివిఓ మణికందన్ ప్రసాద్, సూపరింటెండెంట్ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు పాల్గొన్నారు.@ మణికుమార్..
No comments:
Post a Comment