Sunday, 11 April 2021

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన మహిళ కానిస్టేబుళ్ల జరిమానా*.



*ట్రిపుల్ రైడింగ్ పై  సిరియస్ అయిన పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ శాఖపరమైన చర్యలకు ఆదేశం*

విధినిర్వహణలో భాగంగా 
ఈనెల 9 వ తేదిన షర్మిలా సంకల్ప సభకు హజరైయ్యేందుకు  TS04FD0822 నెంబరు గల ద్విచక్ర వాహనంపై ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లు వెళ్తున్నట్లు నగరంలోని ఆనంద్ విహార్ సెంటర్ వద్ద  వున్న సీసీ కెమెరాలలో గుర్తించారు. మరోవైపు మహిళ పోలీసులు నిబంధనలు వ్యతిరేకంగా డ్రైవింగ్.. సెల్ ముచ్ఛటపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు..మీకో రూల్..మాకో రూలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు..ఈ విషయంలో ఖమ్మం  సిపి.విష్ణు ఎస్ వారియర్..చర్యలకు ఆదేశించారు.
ఖమ్మం సిటీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగానికి చెందిన మహిళ కానిస్టేబుల్, మరో ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లతో కలసి హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకరమైన నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద ట్రాఫిక్ పోలీసులు రూ,, 3300/- జరిమానా విధించారు. 
ట్రిపుల్ రైడింగ్ పై  సిరియస్ అయిన పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ భాధ్యతరహితంగా వ్యవహరించిన ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లపై శాఖపరమైన చర్యలకు ఆదేశించారు

No comments:

Post a Comment