Tuesday, 13 April 2021

భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రి వేడుకల ఆరంభం..

వరంగల్ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్రమహోత్సవాలు ప్రారంభమైనాయి. ఉదయం 4.00గంటలకు నిర్మాల్యాపనయనం జరిపిన అనంతరం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించిన పిమ్మట అర్చకులు అమ్మవారికి ఉత్సవాంగీకార ప్రార్థన జరిపారు. అమ్మవారి అనుజ్ఞ లభించిన అనంతరం గణపతి పూజ పుణ్యాహవాచనం పూర్వాంగవిధి జరిపి అమ్మవారికి పూర్ణాభిషేకం నయనానందకరంగా జరిపారు.వెనువెంటనే సర్వతోభద్ర మండలారాధన జరిపి కల్పోక్తంగాదేవతాహ్వానం జరుపడంతో ఉత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువిధములైన జపహోమార్చనాదులు జరిపారు.ఈరోజుకార్యక్రమాలకు నగర ప్రముఖ న్యాయవాది శ్రీ కుమ్మరి సాంబయ్య-సునీత దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు.
వరంగల్ పశ్చిమ MLA దాస్యం వినయభాస్కర్ రేవతి దంపతులు ఆలయానికి విచ్చేసి ఉగాది వేడుకలలో పాల్గొన్నారు.ఆలయానికి విచ్చేసిన MLA దంపతులకు EO రామల సునీత ప్రధానార్చకులు భద్రకాళిశేషు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి 
నవరాత్రులలో ప్రతినిత్యం దాతల సౌజన్యంతో జరుపపబడే లక్షపుష్పార్చన MLA
వినయభాస్కర్ దంపతుల చేతులమీదుగా ప్రారంభింపజేశారు.కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ భక్తులను దర్శనానికి అనుమతించారు.అయినవోలు అనంతమల్లయ్య సిద్ధాంతి కుమారులు రాధాకృష్ణ శర్మజరిపిన పంచాంగ శ్రవణం భక్తులను ఆకట్టుకుంది. దాదాపు పది వేల మంది భక్తులు ఈరోజు అమ్మవారిని దర్శించారు. ఏలాంటి తారతమ్యం లేకుండా VIPలకు కూడా ఈసారి సాధారణంగానే ఏర్పాట్లు జరిపిన తీరు ఆలయ అధికారులను భక్తుల మన్ననలకు పాత్రులను చేసింది

No comments:

Post a Comment