Saturday, 14 February 2026

ఎల్లప్పుడూ పార్టీ వెన్నంటి వున్నాము.. ఏదులాపురపాలన మాదిగ వర్గానికి ఇవ్వండి... మాదిగ సంఘం నేతలు కర్నే రామారావు, కనకం జనార్ధన్ విజ్ఞప్తి....

ఏదులాపురం చైర్మన్ పదవి మాదిగలకు కేటాయించాలి 

అధిక సీట్లు.. ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నవి మాదిగలవే

విలేకరుల సమావేశంలో ఎం ఆర్ పి ఎస్ జిల్లా కార్యదర్శి కనకం జనార్ధన్ మాదిగ విజ్ఞప్తి 

ఖమ్మం ఫిబ్రవరి 14 : ఏదులాపురం చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వు చేయబడిందని, ఏదులాపురం మున్సిపల్ ఎన్నికలలో ఎస్సీ మాదిగలు నాలుగు సీట్లు గెలుచుకున్నారని, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులు గెలుపొందారని అధిక స్థానాలు దక్కించుకున్న మాదిగలకు చైర్మన్ పదవి కేటాయించాలని ఎమ్మార్పీఎస్ , ఎం ఎస్ పి జిల్లా కార్యదర్శి, ఖమ్మం రూరల్ మండల ఇన్చార్జి కనకం జనార్ధన్ మాదిగ కోరారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..


ఏదులాపురం మున్సిపాలిటీలోనూ, పాలేరు నియోజకవర్గంలోనూ జిల్లా లోను అటు రాష్ట్రంలోనూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకింగ్ జనాభా అత్యధికంగా ఉందని, రిజర్వేషన్ల ప్రాతిపదికన తమ సామాజిక వర్గానికి ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉందని, కానీ జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఎక్కువ స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు గెలుపొందారని అటువంటి వారికి కాదని మరొకరికి కట్ట పెట్టాలనే ప్రయత్నాలు మంచిది కాదని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మాదిగ సామాజిక వర్గం అక్కున చేర్చుకొని అండదండగా నిల్చారని, ఏ ఎన్నిక వచ్చిన, పార్టీకి ఎంత కష్టం వచ్చినా దశాబ్దాల తరబడి వెన్నంటే నిలిచారని అటువంటివారిని కాదని మరొక సామాజిక వర్గానికి ఇవ్వాలనే ప్రయత్నాలు మంచి పరిణామం కాదని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించి భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకొని న్యాయబద్ధంగా మాదిగలకు దక్కే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల లోను, ఓటు బ్యాంకింగ్ లోను, జనాభా లోను మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే విజయం సాధించారని అటువంటి వారికే చైర్మన్ పదవి కేటాయించాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్సీ ఉపకులం డక్కల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్నే రామారావు మాట్లాడుతూ.. ఏదులాపురం మున్సిపాలిటీ అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన మాదిగలకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దయతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

-----------------------------------------------------------------------

The post of Chairman of Yedulapuram should be allotted to Madigas

More seats.. Those with more votes are Madigas

MRPS District Secretary Kanakam Janardhan Madiga's appeal at a press conference

Khammam February 14: MRPS, MSP District Secretary and Khammam Rural Mandal In-charge Kanakam Janardhan Madiga requested that the post of Chairman of Yedulapuram be allotted to SCs, stating that SC Madigas won four seats in the Yedulapuram municipal elections, and two members from the SC Mala community won.Speaking at a press conference organized at Khammam Press Club on Saturday, he said that the Madiga community has the highest vote banking population in the district and the state in the Yedulapuram municipality and Paleru constituency, and that there is a possibility that their community will get the post of Yedulapuram Municipal Chairman on the basis of reservations, but the developments that are happening are worrying in contrast. He said that the majority of seats in the elections were won by people from the Madiga community and efforts to give them to someone else are not good. 

     He said that the Madiga community has taken State Revenue Minister Ponguleti Srinivas Reddy into its fold and stood by him, and that no matter how difficult the party faced in any election, they have stood by him for decades, and efforts to give them to someone else are not good developments.State Revenue Minister Ponguleti Srinivas Reddy appealed to the Madigas to pay special attention and keep the future in mind and see that they get it fairly. He requested that the post of chairman should be allotted to such candidates as the Madigas have won the most seats in the municipal elections in terms of reservation, vote banking and population.On this occasion, SC Upakulam Dakkala Sangam State President Karne Rama Rao spoke.. Similarly, he appealed to the Madigas, who have the largest population in the Edulpuram Municipality as well as Paleru constituency, to be allotted to Madigas on the basis of reservations. Minister Ponguleti Srinivas Reddy asked them to think carefully and take a good decision.

-----------------------------------------------------------------------

येदुलपुरम के चेयरमैन का पद मडिगा लोगों को दिया जाना चाहिए

ज़्यादा सीटें.. जिनके पास ज़्यादा वोट हैं वे मडिगा लोग हैं

एमआरपीएस के डिस्ट्रिक्ट सेक्रेटरी कनकम जनार्दन मडिगा ने प्रेस कॉन्फ्रेंस में अपील की

खम्मम 14 फरवरी: एमआरपीएस, एमएसपी के डिस्ट्रिक्ट सेक्रेटरी और खम्मम रूरल मंडल इंचार्ज कनकम जनार्दन मडिगा ने रिक्वेस्ट की कि येदुलपुरम के चेयरमैन का पद एससी लोगों को दिया जाए, उन्होंने कहा कि येदुलपुरम म्युनिसिपल चुनाव में एससी मडिगा लोगों ने चार सीटें जीतीं, और एससी माला कम्युनिटी के दो सदस्य जीते।शनिवार को खम्मम प्रेस क्लब में ऑर्गनाइज़ एक प्रेस कॉन्फ्रेंस में बोलते हुए, उन्होंने कहा कि येदुलपुरम म्युनिसिपैलिटी और पलेरू चुनाव क्षेत्र में मडिगा कम्युनिटी की जिले और राज्य में सबसे ज़्यादा वोट बैंकिंग आबादी है, और इस बात की संभावना है कि उनकी कम्युनिटी को रिज़र्वेशन के आधार पर येदुलपुरम म्युनिसिपल चेयरमैन का पद मिल जाएगा, लेकिन जो डेवलपमेंट हो रहे हैं वे इसके उलट चिंताजनक हैं। उन्होंने कहा कि चुनावों में ज़्यादातर सीटें मडिगा समुदाय के लोगों ने जीती हैं और उन्हें किसी और को देने की कोशिशें अच्छी नहीं हैं। उन्होंने कहा कि मडिगा समुदाय ने राज्य के रेवेन्यू मिनिस्टर पोंगुलेटी श्रीनिवास रेड्डी को अपने साथ लिया है और उनके साथ खड़ा है, और पार्टी को किसी भी चुनाव में कितनी भी मुश्किलों का सामना करना पड़े, वे दशकों से उनके साथ खड़े हैं,

और उन्हें किसी और को देने की कोशिशें अच्छी नहीं हैं।राज्य के रेवेन्यू मिनिस्टर पोंगुलेटी श्रीनिवास रेड्डी ने मडिगा लोगों से अपील की कि वे खास ध्यान दें और भविष्य को ध्यान में रखें और देखें कि उन्हें यह सही तरीके से मिले। उन्होंने रिक्वेस्ट की कि चेयरमैन का पद ऐसे उम्मीदवारों को दिया जाना चाहिए क्योंकि मडिगा लोगों ने म्युनिसिपल चुनावों में रिज़र्वेशन, वोट बैंकिंग और आबादी के हिसाब से सबसे ज़्यादा सीटें जीती हैं।इस मौके पर एससी उपकुलम डक्कला संगम के राज्य अध्यक्ष कर्ण रामा राव ने बात की। इसी तरह, उन्होंने मडिगा लोगों से अपील की, जिनकी एडुलपुरम म्युनिसिपैलिटी के साथ-साथ पलेरू चुनाव क्षेत्र में सबसे ज़्यादा आबादी है, उन्हें रिज़र्वेशन के आधार पर मडिगा लोगों को दिया जाना चाहिए। मंत्री पोंगुलेटी श्रीनिवास रेड्डी ने उनसे ध्यान से सोचने और अच्छा फैसला लेने को कहा।

No comments:

Post a Comment