శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. కళాబృందాలు కూచిపూడి నృత్యాలు కేరళ సంప్రదాయం నృత్యాలు కేరళ సంప్రదాయ డప్పు గిరిజన సంప్రదాయ నృత్యాలు స్వామి అమ్మవార్ల గ్రామ సేవలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
మంగళవారం( 10.03.2026) శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ వారు శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బి.రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె..సీనా నాయక్ ఈ పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమములో ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, పలువురు అర్చక స్వాములు, వేదపండితులు, అధికారులు, సిబ్బంది ఈ పట్టువస్త్రాలను సమర్పించడం జరిగింది.
ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు కార్యనిర్వహణాధికారి అర్చకస్వాములు, వేదపండితులు, ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు దుర్గామల్లేశ్వర దేవస్థానం సిబ్బందికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు.
తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాల సమర్పణ సంకల్పం పఠించబడింది. అనంతరం నూతన వస్త్రాలకు పూజాదికాలు జరిపించబడ్డాయి.
ఆ తరువాత మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు ఫలపుష్పాలు, అమ్మవారికి పసుపు, కుంకుమలు గాజులు, సమర్పించడం జరిగింది.
#సాయంత్రం గ్రామ ఉత్సవంలో భాగంగా సోమవారం బృంగి వాహన సేవ. మంగళవారం రాత్రి ఈరోజు హంస వాహన సేవ స్వామి అమ్మవార్లకు నిర్వహించారు
10.02.2026 శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చాగంటి కోటేశ్వరరావు.
Powered by:
MANIKUMAR KOMMAMURU.
📲: 9032075966.
No comments:
Post a Comment