_____________________________________________
*ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలి... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*
*భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, పారిశుద్ధ్యం, త్రాగునీరు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి*
*ఖమ్మం రూరల్ మండలం తీర్దాల శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ దంపతులు*
_____________________________________________
ఖమ్మం : పరమశివుడి ఆశీస్సులతో జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెంది, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుడిని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రార్థించారు.మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ జిల్లా కలెక్టర్ తన సతీమణి మాధవి తో కలిసి ఖమ్మం రూరల్ మండలం తీర్దాల శ్రీ శ్రీ శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ,* స్వామివారి చల్లని దీవెనలు భక్తులందరిపై ఉండాలని, జిల్లాలో శాంతి, సమృద్ధి నెలకొనాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
దర్శనానంతరం భక్తులతో ఆలయం వద్ద, కూడలి జాతర సందర్భంగా చేసిన ఏర్పాట్లు ఎలా వున్నాయని భక్తులను అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. దైవ దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్న భక్తులకు కలెక్టర్ దంపతులు పండ్లను పంపిణీ చేశారు. స్వామి వారి దర్శనం వేగంగా జరిగే లాగ చర్యలు తీసుకోవాలని, త్రాగునీరు, వైద్యసేవలు, పరిసరాల పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని, ఆలయంకు వచ్చే రహదారులలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌళిక సదుపాయాల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, అర్చకులు జిల్లా కలెక్టర్ దంపతులను శాలువాతో సత్కరించి, స్వామి వారి శేషవస్త్రాములు, తీర్ధ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, దేవాదాయ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment