Tuesday, 16 June 2026
నరరూప రాక్షసుని కఠినంగా శిక్షించండి : బుడిగం శ్రీనివాస్
*ఖమ్మంలో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన గౌస్ ను ఉరితీయాలి : మాజీ కార్పొరేటర్ బుడిగం శ్రీనివాసరావు ...ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మానవ మృగాన్ని వెంటనే ఉరితీయాలి* *కార్పొరేట్ వైద్యం పూర్తిస్థాయిలో ఉచితంగా అందించాలి..* *.. మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించాలి* ఖమ్మం జూన్ 16. ఖమ్మం లో మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్యయత్నం చేసిన మానవ మృగం గౌస్ ను తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడు గౌస్ పాషా ను వెంటనే ఉరితీయాలనీ కోరుతూ, మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం "నిరసన ర్యాలీ" నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్, వాకార్స్ సంఘం మాజీ అధ్యక్షులు బుడిగం శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి నిందితుడు గౌస్ ను ఉరి తీయాలనీ అయన విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీ పెవిలియన్ గ్రౌండ్ నుండి వైరా రోడ్ సిగ్నల్ పాయింట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాకం శ్యామ్ బాబు, విజయ్, దామోదర్ రెడ్డి, రామనాధం, నరసింహారావు, సుదర్శన్, జక్కుల వెంకటరమణ, శ్రీనివాసరెడ్డి, వీరబాబు, గంధం కోటేశ్వరరావు, మాదవి, సంధ్య, కిరన్మయి, కళావతి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment