*ఎస్.ఐ.ఆర్. కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్*
*ప్రతి ఓటరు వివరాలను సమగ్రంగా పరిశీలించాలి*
*ప్రతి ఇంటికి బీఎల్‌వో చేరుకొని పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి*
*డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి అభ్యంతరాలు, క్లెయిమ్‌లపై క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలి*
*రఘునాథపాలెం మండలం కేంద్రంలో ఎస్.ఐ.ఆర్. కార్యక్రమం ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్*
----------------------------------------------------------------
ఖమ్మం : ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కు ప్రజలందరూ తమ పూర్తి వివరాలతో స్వచ్చందంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.శుక్రవారం ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా ప్రతి ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ, మ్యాపింగ్ ప్రక్రియ మరింత వేగవంతంగా చేయాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో బీఎల్‌ఓల పని తీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన ధృవీకరణ, సరైన డేటా నమోదు, పారదర్శకత తో పని చేయాలన్నారు. ఎస్ఐఆర్ లో భాగమైన మండలాలు, కార్పోరేషన్, మున్సిపాలిటీ సంబంధించి ప్రతి ఓటర్లను మ్యాపింగ్ చేసే విధంగా టార్గెట్ పెట్టుకొని వంద శాతానికి చేరుకోవాలన్నారు.
ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను జూన్ 24 నుంచి జులై 25 వరకు చేపట్టనున్నారన్నారు. డబుల్ ఓట్లు, మరణించిన ఓటర్ల వివరాలను ధృవీకరించి, తొలగింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. బదిలీ ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాలను సక్రమంగా పరిశీలించి, రికార్డులను నవీకరించాలని తెలిపారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రధాన లక్ష్యం, ఎన్నికల సిబ్బంది విధులు, పౌరుల భాగస్వామ్యం, ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై అవగాహన పెంచడం ద్వారా ప్రతి అర్హ పౌరుడు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి కావడానికి సహకరించాలని అధికారులు కృషి చేయాలన్నారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ, సేకరణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చి, అనర్హులైన ఓటర్ల వివరాలను తొలగించే ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం ద్వారా శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు, మరణించిన ఓటర్ల వివరాల తొలగింపు, డబుల్ ఎంట్రీలతొలగింపు జరుగుతుందని తెలిపారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పూర్తి స్థాయిలో ధృవీకరించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి అర్హమైన ఓటరుని గుర్తించి జాబితాలో చేర్చాలని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితా సిద్ధం చేసే ముందు ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి బీఎల్‌వోకు ఎస్‌ఐఆర్ నిబంధనలు, విధి విధానాలు, ఫీల్డ్ వెరిఫికేషన్ విధానం, ఫారాల నిర్వహణపై పూర్తి అవగాహన, పట్టు ఉండేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలందరూ ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అన్నారు. వివరాలు, కావాల్సిన దృవీకరణలు బూత్ స్థాయి అధికారి సందర్శన సందర్భంగా సిద్ధం గా ఉంచాలన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ప్రజలందరూ సంపూర్ణంగా సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------
*ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతం చేయాలి... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి*
-------------------------------------------------------------------
ఖమ్మం : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈ ఆర్ ఓ లతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడం, ఫారం పూర్తి చేసిన తర్వాత తిరిగి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు ముఖ్యపాత్ర పోషిస్తారని, పట్టణాలలో మ్యాపింగ్, అన్ మ్యాపింగ్ విభాగాలుగా సమాచారాన్ని విభజించి సవరణ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లకు సమావేశాలు నిర్వహించి సంబంధిత ఫోటోలు, మీటింగ్ మినిట్స్ నమోదు చేయాలని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాలు స్థానిక భాషలో ముద్రించబడతాయని, బూత్ స్థాయి అధికారుల ద్వారా ఓటర్లకు అందజేయబడిన ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని సంబంధిత పోర్టల్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఈ ఆర్ ఓ లు క్షేత్రస్థాయిలో తరచుగా పర్యటించి సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పరిశీలించాలని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని, మ్యాపింగ్ చేయబడని ఓటర్ల వివరాలను అప్డేట్ ఆప్షన్ ద్వారా నమోదు చేయాలని తెలిపారు. జూలై 24వ తేదీ లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేయడం జరుగుతుందని, జూలై 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరుగుతుందని, జూలై 31వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, జూలై 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు అభ్యంతరాల పరిష్కరణ, అక్టోబర్ 1వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, మీటింగ్ మినిట్స్ నమోదు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో 1 వేయి 200 మందికి మించి ఓటర్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల సంబంధించిన బూత్ స్థాయి అధికారుల వివరాలు ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని, బూత్ స్థాయి అధికారులకు వృద్ధ, అనారోగ్య, దివ్యాంగ ఓటర్ల నమోదు విషయంపై ప్రత్యేక శిక్షణ అందించాలని తెలిపారు. ఒకే కుటుంబం సంబంధించిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించాలని, తప్పుడు ప్రచారాన్ని నిరోధించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురస్కరించుకొని జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించామన్నారు. బూత్ స్థాయి అధికారులకు, బూత్ స్థాయి ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై జిల్లాలో బ్యానర్లు, హోర్డింగ్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాకు ప్రచార సామాగ్రి, బూత్ స్థాయి అధికారుల కిట్లు చేరినట్లు అన్నారు. ఎన్యుమరేషన్ ఫారాల పూర్తి, ఏ ఏ దృవీకరణలు తీసుకోవాలో బూత్ స్థాయి అధికారులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సదానందం, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ ఎం ఏ. రాజు, డిటి అన్సారీ, ఎన్నికల విభాగ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-------------------------------------------------------------------
Powered by :
MANIKUMAR KOMMAMURU
📲: 9032075966
No comments:
Post a Comment