తిరుమల శ్రీ వారి బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల నేపధ్యంలో భధ్రతా ఏర్పాట్లపై టి.టి.డి సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీస్ వ్యవస్థ కూడా కట్టు దిట్టమైన చర్యలు చేపడుతున్నాయని తిరుపతి అర్భన్ ఎస్.పి.రమేష్ రెడ్డి పేర్కొన్నారు.
అంతర్వేదిలో జరిగినటువంటి రధం దగ్ధం తరువాత అన్ని ప్రాంతాలకు సంబందించిన ఆలయాలలు, రధాలు, ఆలయ పరిసర ప్రాంతాల భద్రతా చర్యలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు ఆయన అన్నారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఈ నెెెల 19 నుండి ఏకాంతంగా జరుగుతున్నందున ఆ సమయంలో ఆన్లైన్ లో ముందుగా టికెట్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీ వారి దర్శనానికి అనుమతిస్తూoదన మరియు Covid-19 ను దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వైరస్ వ్యాప్తి చెందకుండా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని, అలాగే ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం కూడా ఉన్నందున వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని Covid-19 ప్రభుత్వ నిబందనల మేరకు చర్యలు చేపట్టి భందోబస్తూ ఏర్పాటు చేస్తున్నామన్ననారుత. కచ్చితంగా ఆలయాలకు సంబంధించిన ప్రతి సంపదను వాటి యొక్క పరిరక్షణను కాపాడుతామని. జిల్లాలో మొత్తం 656 చిన్నా, పెద్దా ఆలయాలను ఎప్పటికప్పుడు పోలీసులు విసృతంగా తనికీలు చేయడం జరుగుతుందిని ఎస్పీ అన్నారు. పలుచోట్ల అధికారులను., సిబ్బందిని మరియు ప్రజలను చైతన్యపరచటం జరిగిందని. ఏ చిన్న సంఘటన జరిగినా ప్రజలు తమకు వెంటనే తెలియపరచాలనివిజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితిని అనుకూలంగా తీసుకొని మతసామ్యరసాన్ని దెబ్బతీసే విధంగా ఏమైనా చర్యలుగాని చేసినట్లైతే అది ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, సోషల్ మీడియా ద్వారా కావొచ్చు చేసిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని ఎస్.పి. హెచ్చరించారు. బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చేటటువంటి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఇప్పుడు ఏ పద్దతైతే అవలంబిస్తున్నామో టిక్కెట్ ఉన్న వారిని మాత్రమే కొండమీదకు అనుమతించాలి అనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయం భక్తులు అందరు కూడా గమనించవలసినదిగా ప్రార్థన. శ్రీ వారి సేవలు ఏకాంతంగా జరుగుతాయి కాబట్టి మిగత సమయాల్లో స్వామి వారి దర్శనం ఎలా ఉంటుందో అలానే జరుగుతుంది. అనవసరంగా ఎక్కువ ప్రజలు అలిపిరి వద్ద వచ్చి టికెట్స్ ఇస్తారని గుమ్మి కూడటంలాంటివి చేయకూడదని విన్నపం చేసుకుంటున్నాము. అందరూ కూడా భక్తి శ్రద్దలతో ఎవరి మనోభావాలను కించపరచకుండా, ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా మతసామ్యస్త్రం పాటించాలని వాటికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మేము హెచ్చరించడం కూడా జరిగింది. AP Public Safty Act కింద దాదాపు 150 ఆలయాలకు నోటీసు కూడా జారీ చేయటం జరిగింది. ఎక్కడైతే సి.సి. కెమెరాలు లేవో అక్కడ సి.సి కెమరాలు పెట్టించి వాటి యొక్క జాగ్రత్త తెసుకోవలసిందిగా తెలియజేశాము. పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నారు. ఎటువంటి సమాచారం ఇవ్వదల్చినా కూడా మాకు 8099999977 కు మరియు డయల్ 100 కు తక్షణమే సమాచారం అందించి సహకరించాలి. తప్పని సరిగా పోలీస్ వారు 10 to 15 నిమిషములలో చేరి అక్కడ ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుక్కోవడానికి సిద్దంగా ఉంటారని ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు తిరుమల యందు తెలియజేసాాారు
No comments:
Post a Comment