Tuesday, 8 September 2020

విజయవాడలో హవాలా నగదు ప‌ట్టివేత‌..

 విజయవాడ :హవాలా మార్గంలో తరలిస్తున్న రూ.1.47 కోట్ల విలువైన నగదు, 34 వేల అమెరికన్ డాలర్లు, ఒక కారును స్వాధీనం
విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ ఏ.డి.సి.పి. కె.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏసిపిలు టి.కనకరాజు, వి.ఎస్.ఎన్.వర్మ, ఇన్‌స్పెక్టర్ పి.కృష్ణమోహన్ మరియు వారి సిబ్బందితో కలసి విజయవాడ, భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని, గొల్లపూడి, వై-జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా ఏపీ 37 బి డబ్ల్యూ 4532 నెంబరు గల షిఫ్ట్ కారులో ప్రత్యేకంగా సీటు వెనుక ఏర్పాటు చేసిన బాక్సులలో అమర్చి ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమ మార్గంలో హవాలా నగదును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ.1 కోటి 47 లక్షల విలువ గల నగదు, 34 వేల ఆమెరికన్ డాలర్లు మరియు ఒక షిఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు.
వివరాలలోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురానికి చెందిన చామకూరి ఆనందరావు, చామకూరి హరిబాబులు ఇద్దరు అన్నదమ్ములు వీరిద్దరు గత కొంత కాలంగా నరసాపురంలో గల దేవి జ్యూయలరీ మార్ట్ నందు పని చేయుచుండగా సదరు షాపు యజమాని అయిన ప్రవీణ్ కుమార్ జైన్ తన వద్ద పని చేస్తున్న పై ఇద్దరు నిందితులకు రూ. 50 లక్షలు, వేలు (సుమారు రూ. 25 లక్షలు) గల అమెరికన్ డాలర్లు కలిగిన హవాలా నగదు, విజయవాడకు చెందిన మరో నలుగురు వ్యక్తుల వద్ద నుండి (రూ. 50 లక్షలు వల్లూరి శివనాథ్ వద్ద, రూ.20 లక్షలు భారతీయ వద్ద, రూ.15 లక్షలు ఉత్తం వద్ద, రూ. 12 లక్షలు దివాకర్ వద్ద) రూ.97 లక్షలు హవాలా నగదు మొత్తం కలిపి రూ.1 కోటి 47 లక్షల నగదు మరియు 34 వేలు అమెరికన్ డాలర్లను తీసుకుని హైదరాబాద్ లో ఉంటున్న ప్రవీణ్ కుమార్ జైన్ సోదరుడు అయిన కీర్తికి ఇచ్చిరమ్మని ఎటువంటి బిల్లులు లేనటువంటి హవాలా నగదును ఏపీ 37 బి డబ్యూ 4532 నెంబరు గల షిఫ్ట్ కారులో సీటుకు వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్సులలో సదరు నగదును అమర్చి తరలిస్తుండగా సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వలపన్ని అక్రమ మార్గంలో రవాణా చేయబడుతున్న కావాలి నగదు సుమారు రూ.1 కోటి 47 లక్షల నగదు మరియు 34 వేలు అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకుని, తదుపరి దర్యాప్తు నిమిత్తం భవానీపురం పోలీసు వారికి నిందితులను అప్పగించడం జరిగింది. 
మరియు ఇంకంట్యాక్స్ అధికారులకు, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఇ డి) వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. 
ఈ సందర్భంగా హవాలా నగదును తరలిస్తున్న నలుగురు నిందితులైన చామకూరి ఆనందరావు, చామకూరి హరిబాబు, వల్లూరి శివనాద్, ప్రవీణ్ కుమార్ జైన్లను గుర్తించి చాకచక్యంగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బ‌త్తిన శ్రీనివాసులు అభినందించారు.

No comments:

Post a Comment