శివుడు, చిత్రాలు, దండలు, అలంకరణలతో కొత్తగా ప్రారంభించిన కాశీ మహాకల్ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్ బి 5 యొక్క సీట్ నంబర్ 64 ను చిన్న ఆలయంగా మార్చారు. "భోలే బాబా" పేరుతో ఈ సీటు/బెర్త్ ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పవిత్రమైన రోజులు, సందర్భాలలో సీటు వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలనే ఆలోచన కూడా వున్నట్లు రైల్వే అధికారుల బోగట్టా.
దీనిపై కొందరు కొంచెం అతీగా వుందని విమర్శిస్తుండగా మరికొందరు దేవునికి ఆ మాత్రం సీటు వదలాల్సిందే అంటూ స్వఛ్చమైన హిందీలో బహుత్ అచ్ఛా అంటున్నారు.
కాశీ మహాకల్ ఎక్స్‌ప్రెస్ ఓంకరేశ్వర్ (ఇండోర్ సమీపంలో), మహాకలేశ్వర్ (ఉజ్జయిని), కాశీ విశ్వనాథ్ (వారణాసి) జ్యోతిర్లింగాలను కలుపుతు ప్రయాణించే ఈ రైలు ఫిబ్రవరి 20 నుండి క్రమం తప్పకుండా నడిపేందుకు ఐఆర్టటిసి ఏర్పాట్లు చేస్తోంది.. తేలికపాటి భక్తి సంగీతం, ప్రతి కోచ్‌లో ఇద్దరు ప్రైవేట్ గార్డ్‌లు వుండే ఈ రైలులో శాఖాహారం భోజనం అందజేయనున్నారు. వారణాసి - ఇండోర్ మధ్య వారానికి మూడుసార్లు నడవనున్న రైలు పూర్తి ఏ.సి. బోగీలు వుంటాయి.ఈ రైలు వారణాసి - ఇండోర్ మధ్య లక్నో మీదుగా 1,131 కిలోమీటర్లు, వారణాసి మరియు ఇండోర్ మధ్య 1,102 కిలోమీటర్ల దూరం ప్రయాగ్రాజ్ (అలహాబాద్) ద్వారా సుమారు 19 గంటల్లో ప్రయాణించనుంది.
No comments:
Post a Comment