*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పి, ఎంపీలు, ఎమ్మెల్యేలు*
కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కాంగాటి.శ్రీదేవి కుమారుడు రామ్మోహన్ రెడ్డి, స్వర్గీయ చెరుకులపాడు నారాయణరెడ్డి దంపతుల కుమారుడు, వారి సమీప బంధువు వైఎస్సార్ సిపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి కుమారుడు శివారెడ్డిల వివాహ వేడుకలలో వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపేందుకు గురువారం ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు 11:16 గంటలకు
చేరుకున్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు జిల్లా ఇన్చార్జ్ మరియు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు తలసిల రఘురాం లు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్
నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కర్నూలు నగరంలోని దిన్నే దేవరపాడు (రాగమయూరి రీస్టార్ట్) కు 11:39 గంటలకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ కే పకీరప్ప, జాoయిట్ కలెక్టర్ 2 సయ్యద్ ఖాజా మోహిద్దీన్, కర్నూలు యంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి,
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యులు ఆర్థర్, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, శ్రీశైలం శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగి రెడ్డి, టిటిడి మెంబర్ మురళి,వైయస్సార్సీపి కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రామయ్య, నాయకులు ప్రదీప్ కుమార్ రెడ్డి, నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి అర్జీలు సమర్పించి ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాగమయూరి రీస్టార్ట్ ఫెంక్షన్ హల్ కు 11:47 గంటలకు చేరుకొని వివాహా వేడుకలలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment