Sunday, 23 February 2020
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన హిరో అర్జున్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లలో భాగంగా రోజా, వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు హీరో అర్జున్ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. పర్యావరణ పరిరక్షణ కి సంతోష్ చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్పూర్తిగా తీసుకొని రోజా మొక్కలు నాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలనే సంకల్పం గొప్పది . దానికి రోజా మొక్కలు నాటించే కార్యక్రమం చెప్పట్టడం చాలా అభినందనీయం అన్నారు . ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజావనం లో జగపతిబాబు , ప్రముఖ దర్శకుడు ఆర్కే సేల్వామణి, నటి కుష్బూ లను పాల్గొనాలని వారికి ఛాలెంజ్ విసిరారు. రోజా మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం అని సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment