మహిళలకు రక్షణగా నిలిచేందుకు దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దిశా యాక్ట్, దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లు తెచ్చిన ఎ.పి. సీయం వైయస్ జగన్ కు మహిళా లోకం రుణ పడి వుంటుందని వైయస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, రీజనల్ కోఆర్డినేటర్ పూతలపట్టు నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్ శైలజ చరణ్ రెడ్డి అన్నారు. మహిళా రక్షణకోసమై దేశం లోనే మొట్టమొదటిసారిగా... తొలి దిశ పోలిస్ స్టేషన్ ను రాజమండ్రిలో ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ కు అమే కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రం సాంఘిక , సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు వెన్నుదన్ను లా రక్షణ కల్పించడం ద్వారా వైఎస్రొ జగన్మోహన్సారెడ్డి మరోసారి మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారని శైలజరెడ్డి కొనియాడారు
దిశ చట్టంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చడం ద్వారా సత్వర న్యాయం పొందవచ్ఛని అభిప్రాయ పడ్డారు.
- ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తవుతుందన్నారు. దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని కేసుల దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు జగన్ సర్కార్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
- 13 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం.
- రేప్, గ్యాంగ్ రేప్‌లకు పాల్పడితే ఉరిశిక్ష.
- చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు.
- సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష. రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష.
- మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్ (ఆన్‌లైన్) రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
- మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఆధునికీకరణ.
- తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్‌ఏ సెంటర్లు.
- బయాలజీ, సెరాలజీ, సైబర్ ల్యాబ్‌లు.
- దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సు.
- కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష.
- రాష్ట్రంలో మహిళా పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్. ఒక డీఎస్పీ, మూడు ఎస్‌ఐ పోస్టులు మంజూరు.
- బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గైనకాలజీ పోస్టుల భర్తీ.
- అన్యాయానికి గురైన మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్‌ఐఆర్ సౌకర్యం.
ఇలాంటి అద్భుతమైన, చారిత్రాత్మకమైన నిర్ణయాలను తీసుకొని చరిత్ర సృష్టించ గల నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని , రాజశేఖర్ రెడ్డి గారి కలలను నిజం చేస్తూ మహిళల అందరి మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్న జన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని ఆమె అభివర్ణించారు. పిల్లల భద్రతకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కృషి చేయడం పట్ల ఆమే హర్షాన్ని వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment