Tuesday, 27 January 2026

దివ్యాంగుల సంక్షేమానికి 100 కోట్లు ఖర్చు చేశాం : "డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు"


 
*దివ్యాంగుల సంక్షేమానికి 100 కోట్లు ఖర్చు చేశాం.. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు* 

*దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం*

*మధిర నియోజకవర్గ పరిధిలో దివ్యాoగులకు రిట్రోఫిటెడ్ మోటారు వాహనాల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం*
-----------------------------------------------------------------------
మధిర, జనవరి- 27  : దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం పదేళ్ళలో చేయలేని పనులని, ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే చేసిందని, అందులో భాగంగానే ఈ రెండేళ్లలో దివ్యాంగుల కోసం 100 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు చేసిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో *డిప్యూటీ సీఎం మాట్లాడుతూ*
చదువుకుంటున్న దివ్యాంగులకు ఐపాడ్లు, కంప్యూటర్లు ట్యాబ్స్ ప్రజా ప్రభుత్వం అందిస్తోందన్నారు. తమది ప్రజల గురించి ఆలోచన చేసేటువంటి ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వమని అన్నారు. దివ్యాంగులకు ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తామని, వారికి అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారిని కూడా సమాజంలో మనతో పాటు ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, దివ్యాంగుల గురించి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని అన్నారు. దివ్యాంగులు కూడా అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. సమాజంలో ఇతరులు కన్నా ఎక్కువ అవకాశాలను, ఆసరాను దివ్యాంగులకు మనం అందించాలని అన్నారు. అంగవైకల్యంతో ఉన్నామన్న బాధ వారికి రాకుండా వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఈ ఆలోచన దిశగానే ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఇర్రిగేషన్ ఎస్ఇ వాసంతి, విద్యుత్ ఎస్ఇ శ్రీనివాస చారి, ఆర్ అండ్ ఎస్ఇ యాకుబ్, జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారావు, వ్యవసాయ శాఖ ఏడి విజయ చందర్, మధిర తహసీల్దార్ రాంబాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------------------------------------------------------
Govt Spent 100 crores for the welfare of the disabled.. State Deputy CM, Minister for Finance, Planning and Energy Bhatti Vikramarka Mallu* 

* TS Govt with disabled in every way : Deputy CM Bhatti Vikramarka Mallu*

*Deputy CM distributes retrofitted motor vehicles to the disabled in Madhira constituency*
------------------------------------------------------------------------
Madhira, January- 27: The public government is committed to the welfare of the disabled, and this government has done things that the previous government could not do in ten years, and as part of that, the government has spent 100 crore rupees for the disabled in these two years, said State Deputy CM, Minister for Finance, Planning and Energy Bhatti Vikramarka Mallu. On Wednesday, the Deputy CM, along with District Collector Anudeep Durisetty,distributed tricycles to the disabled at the Madhira constituency center. Speaking at the event, the Deputy CM said that the public government is providing iPods, computers and tabs to the disabled who are studying. He said that theirs is the Indiramma public government that thinks about the people. He said that the public government will ensure that the disabled do not face any problems and will provide all the necessary welfare schemes for them. Unfortunately, it is the responsibility of all of us to take those born with disabilities forward in the society along with us, he said that everyone in the society should think about the disabled.The Deputy CM said that there is a great need for the disabled to excel in all fields. He said that we should provide more opportunities and support to the disabled than others in the society. The Deputy CM said that they should not suffer from the pain of being disabled and should be encouraged and taken forward. He said that the Indiramma public government is moving forward in this direction. In the event, State Warehouses Corporation Chairman Rayala Nageswara Rao, Local Bodies Additional Collector Dr. P. Sreeja, Irrigation SE Vasanthi, Electricity SE Srinivasa Chari, R&SE Yakub, District Welfare Officer Velpula Vijetha, District Minority Welfare Officer Mujahid, District Chief Planning Officer Srinivas, Madhira Market Committee Chairman Narasimha Rao, Agriculture Department AD Vijaya Chander, Madhira Tehsildar Rambabu, officers of various departments, public representatives, and others participated.
------------------------------------------------------------------------

*हमने दिव्यांगों की भलाई के लिए 100 करोड़ रुपये खर्च किए हैं.. राज्य के डिप्टी सीएम , फाइनेंस, प्लानिंग और एनर्जी मिनिस्टर भट्टी विक्रमार्क मल्लू*

*हम दिव्यांगों की हर तरह से मदद करेंगे*

*डिप्टी सीएम ने मधिरा चुनाव क्षेत्र में दिव्यांगों को रेट्रोफिटेड मोटर गाड़ियां बांटीं*
------------------------------------------------------------------------
मधिरा, 27 जनवरी: राज्य के डिप्टी सीएम, फाइनेंस, प्लानिंग और एनर्जी मिनिस्टर भट्टी विक्रमार्क मल्लू ने कहा कि जनता की सरकार दिव्यांगों की भलाई के लिए पूरी तरह से समर्पित है, और इस सरकार ने वो काम किए हैं जो पिछली सरकार दस साल में नहीं कर पाई, और इसी के तहत सरकार ने इन दो सालों में दिव्यां गों के लिए 100 करोड़ रुपये खर्च किए हैं। बुधवार को डिप्टी सीएम  ने डिस्ट्रिक्ट कलेक्टर अनुदीप दुरीसेट्टी के साथ मिलकर मधिरा चुनाव क्षेत्र के सेंटर में दिव्यांगों को ट्राइसाइकिल बांटी।

इस मौके पर बोलते हुए डिप्टी सीएम ने कहा कि जनता की सरकार पढ़ाई कर रहे दिव्यांगों को आइपॉड, कंप्यूटर और टैब दे रही है। उन्होंने कहा कि उनकी इंदिराम्मा पब्लिक सरकार लोगों के बारे में सोचती है। उन्होंने कहा कि पब्लिक सरकार यह पक्का करेगी कि दिव्यांगों को कोई दिक्कत न हो और उनके लिए सभी ज़रूरी वेलफेयर स्कीमें देगी। दुर्भाग्य से, यह हम सबकी ज़िम्मेदारी है कि हम अपने साथ समाज में दिव्यांगों को आगे ले जाएं, उन्होंने कहा कि समाज में सभी को दिव्यांगों के बारे में सोचना चाहिए। डिप्टी सीएम  ने कहा कि दिव्यांगों को सभी फील्ड में आगे बढ़ने की बहुत ज़रूरत है। उन्होंने कहा कि हमें समाज में दूसरों की तुलना में दिव्यांगों को ज़्यादा मौके और सपोर्ट देना चाहिए। डिप्टी सीएम ने कहा कि उन्हें दिव्यांग होने का दर्द नहीं सहना चाहिए और उन्हें हिम्मत देनी चाहिए और आगे बढ़ाना चाहिए। उन्होंने कहा कि इंदिराम्मा पब्लिक सरकार इस दिशा में आगे बढ़ रही है। इस इवेंट में स्टेट वेयरहाउस कॉर्पोरेशन के चेयरमैन रायला नागेश्वर राव, लोकल बॉडीज़ एडिशनल कलेक्टर डॉ. पी. श्रीजा, इरिगेशन एस ई वसंती, इलेक्ट्रिसिटी  एस ईश्रीनिवास चारी, आर एंड एसई याकूब, डिस्ट्रिक्ट वेलफेयर ऑफिसर वेलपुला विजेता, डिस्ट्रिक्ट माइनॉरिटी वेलफेयर ऑफिसर मुजाहिद, डिस्ट्रिक्ट चीफ प्लानिंग ऑफिसर श्रीनिवास, मधिरा मार्केट कमेटी के चेयरमैन नरसिम्हा राव, एग्रीकल्चर डिपार्टमेंट के ए डी  विजया चंद्र, मधिरा तहसीलदार रामबाबू, अलग-अलग डिपार्टमेंट के ऑफिसर, पब्लिक रिप्रेजेंटेटिव और दूसरे लोग शामिल हुए।

@ మణికుమార్ కొమ్మమూరు 
📲: 9032075966

No comments:

Post a Comment