*క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం పెంపొందుతాయి.... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి*
*క్రీడలు పోలీస్ సిబ్బందిలో ఒత్తిడి తగ్గించి ఉత్సాహం నింపుతాయి*
*15వ బెటాలియన్ బి. గంగారంలో ఇంటర్ కంపెనీ స్పోర్ట్స్ మీట్–2026 ప్రారంభించిన జిల్లా కలెక్టర్*
ఖమ్మం, జనవరి -06: పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తగ్గించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.15వ బెటాలియన్ బి. గంగారం ప్రాంగణంలో మంగళవారం రోజున ఇంటర్ కంపెనీ స్పోర్ట్స్ మీట్–2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా వేడుకలకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ముఖ్య అతిథిగా హాజరై, పోలీస్ సిబ్బంది కంటింజెంట్ కవాతును పరిశీలించి స్పోర్ట్స్ మీట్‌ను అధికారికంగా ప్రారంభించారు.అనంతరం కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కలిసి క్రీడాకారులను కలెక్టర్ పరిచయం చేసుకొని, 100, 200 మీటర్ల పరుగు పందెం పోటీలను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ*
క్రీడలతో క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం కలుగుతాయన్నారు. శారీరక ఎదుగుదలకు దోహదపడే క్రీడలను మన జిల్లాలో ప్రోత్సహించడం సంతోషంగా ఉందని తెలిపారు. క్రీడలు పోలీసు సిబ్బందిలో సమన్వయం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, స్ఫూర్తి, పోటీతత్వం, సమన్వయ బావం మరింత బలపడుతుందని తెలిపారు. పోలీస్ సిబ్బంది నిర్వహించిన కవాతు అత్యంత ఆకర్షణీయంగా ఉందని, వారి క్రమశిక్షణ, సమయపాలన అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమే అయినా, క్రీడాస్ఫూర్తితో పాల్గొనడమే నిజమైన విజయం అని ఆయన స్పష్టం చేశారు. పోలీస్ సిబ్బంది విధి బాధ్యతలతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపుతూ ఉత్సాహంగా పాల్గొనడం హర్షణీయమని, ఇలాంటి క్రీడా పోటీలు సిబ్బందిని మరింత సమర్థవంతమైన ప్రజాసేవకు ప్రేరేపిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.
క్రీడల ద్వారా జీవితంలో ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చని, స్వీయ నియంత్రణ, టీం స్పిరిట్, ఓటమి నుంచి కోలుకొని విజయం వైపు కొనసాగడం వంటి అనేక మంచి గుణాలు నేర్పిస్తుందని అన్నారు. ప్రతి రోజు కొంత సమయం క్రీడలకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, కమాండెంట్ ఎన్. పెదబాబు, అడిషనల్ కమాండెంట్ ఏ. అంజయ్య, అసిస్టెంట్ కమాండెంట్ ఎస్. శ్రీధర్ రాజా, బి. వేణుగోపాల్ రెడ్డి, ఏవో వి. అశోక్ కుమార్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, మినిస్టీరియల్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
*_తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక - కీలక హామీ అమలు..!!_*
_తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి వేళ కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న హామీల అమలు పైన ఫోకస్ చేసింది._
_ఉద్యోగుల బకాయిలను ప్రతీ నెలా నిర్దేశించిన మొత్తంలో విడుదల చేస్తోంది. మహిళలకు ఆర్దికంగా చేదోడుగా నిలిచేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను సిద్దం చేస్తోంది. అదే సమయం లో ప్రస్తుత పథకాల అర్హత ఉండీ.. లబ్దిదారులు కాలేకపోయిన వారికి మరో ఛాన్స్ ఇవ్వాలని తాజా గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. దీని ద్వారా గతంలో ఇచ్చిన హామీ దిశగా కార్యాచరణ ప్రారంభించింది._
_తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు అర్హత ఉన్నా ఇప్పటికీ లబ్ది పొందినవారి కోసం మరో అవకాశం కల్పించాలని డిసైడ్ అయింది. అర్హత ఉన్న అందరికీ అవకాశం ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. అందు కోసం వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు కొత్తగా విధి విధానాలు ఖరారు చేసింది. ప్రతీ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసుల్లో ప్రజా పాలన అధికారులను నియమించిన ప్రభుత్వం వీరి ద్వారా మీరు పథకాలను దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తులను అధికారులు పరిశీలించి మిమ్మల్ని ఆయా పథకాల లబ్దిదారుల జాబితాల్లో చేర్చనున్నారు. గతంలో కొంతమందికి రేషన్ కార్డులు లేకపోవడం, వివరాల్లో తప్పులు దొర్లడంతో పథకాలకు అర్హత సాధించలేకపోయిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. తమ ప్రభుత్వంలో లబ్దిదారులకు అందరికీ పథకాలు అందిస్తామని ఇచ్చిన హామీ అమలుకు కట్టుబడి ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది._
_కాగా, ప్రభుత్వం ఈ తాజాగా కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది. దీంతో కొత్తగా రేషన్ కార్డు వచ్చినవారు ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించారు. దీంతో కొత్తగా రేషన్ కార్డు పొందినవారు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఎంపీడీవో ఆఫీసులను సంప్రదించి దరఖాస్తు పెట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇక మున్సిపల్ వార్డుల్లో కూడా ప్రజా పాలన అధికారులను నియమిం చింది. వీరికి కూడా దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు వెల్లడించారు. గతంలో దర ఖాస్తు చేసుకోనివారితో పాటు గతంలో తప్పుల వల్ల లబ్ది పొందనివారు ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. గృహలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందించే గృహలక్ష్మి పథకం కోసం ఆధార్, రేషన్ కార్డు, కరెంట్ బిల్లులను సమర్పించాలి. ఇక మహాలక్షి పథకం ద్వారా రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. లబ్దిదారులకు నేరుగా అకౌంట్లో నిధులు జమ చేయనున్నారు._
------------------------------------------------------------------------
*కేసిఆర్ కుమార్తె అడుగులు ఎటువైపు..!
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి బీజం పడింది తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం దాదాపు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది, వచ్చెఅసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ తరపున పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేయడంతో తెలంగాణ రాజకీయ సమీకరణలు మారే అవకాశాలపై విశ్లేషణలు మొదలయ్యాయి.....తెలంగాణ జాగృతిని రాజకీయ వేదికగా కొనసాగిస్తారా?లేక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుస్తారా? అనే సందేహాలకు ఆమె ప్రసం గాలు స్పష్టతనిచ్చాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తప్పకుండా పోటీ చేస్తానని చెప్పడం ద్వారా కొత్త రాజకీయ పార్టీ రానుందన్న సంకేతాన్ని బలంగా ఇచ్చారు. కవిత కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్య పోనక్కర్లేద ని కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలకు మరింత బలం చేకూరాయి.. ఆయన చేసిన వాక్యాలు రాజకీయ వర్గంలో తీవ్ర చర్చకు దారితీసాయి.. నిన్న మొన్నటి వరకు ఆమె టార్గెట్ హరీశ్‌రావు. అప్పుడప్పుడు కేటీఆర్‌పై అటాక్. మధ్యలో సంతోష్ పై సెటైర్లు. కానీ ఇప్పుడు కవిత అక్క..డైరెక్ట్‌గా గులాబీ బాస్‌పైనే బాణాలు ఎక్కు పెడుతోంది. పెద్ద సార్ టార్గెట్‌గానే..ఇంకా చెప్పా లంటే కల్వకుంట్ల ఫ్యామిలీ లక్ష్యంగానే ఆమె రాజకీయ పోరాటం ఉండబోతుంద న్నది చెప్పకనే చెప్పేస్తోంది. కానీ కవిత కామెంట్స్‌పై కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి మాత్రం నో రియాక్షన్. కవిత రోజు రోజుకు డోస్ పెంచుతున్నా బీఆర్ఎస్ కీలక నేతలెవరూ స్పందించడం లేదు. ఇదే ఇప్పుడు కారు పార్టీలో హాట్ టాపిక్‌గా మారు తోంది.కారులో ఉన్నప్పుడే అందరినీ కార్నర్ చేసింది. ఒక్క అధినేతను వదిలిపెట్టి..హరీశ్, కేటీఆర్, సంతోష్‌ను..వరుసపెట్టి అటాక్ చేస్తూ వచ్చింది కవిత. ఇక బీఆర్ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాక..ఆమె విమర్శల దాడి ఇంకా ఎక్కువైంది. ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే టార్గెట్ గా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కవిత.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు నేరుగా తీసుకోక పోయినా ఆయనపై విమర్శలు చేశారు కవిత. శాసనమండలి సాక్షిగా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయం అంటూ పరోక్షంగా కేసీఆర్‌ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు కవిత. తెలంగాణను ఏం ఉద్దరించామని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాలకు వెళ్లారంటూ మండలిలో ఉచ్చరించకూడని భాషతో తండ్రి కేసీఆర్‌ను ప్రశ్నించారామె.
*బిఆర్ఎస్ నేతల మౌనం వెనుక అంతర్యం ఏమిటి?*
కవిత వ్యాఖ్యలు, ఆమె చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత నష్టాన్ని కలిగిస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట. ఆమె శాసన మండలిలో కన్నీళ్లు పెట్టుకుని మరీ అధినేత కేసీఆర్ సహా పార్టీపై, తొమ్మిదిన్నరేళ్ల పాలనపై ఆరోపణలు చేయడంపై గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారట. కవిత ఇంతలా సీరియస్ కామెం ట్స్ చేసినా..అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు రియాక్ట్ కావడం లేదన్నది బీఆర్ఎస్ నేతలకు, క్యాడర్‌కు అంతుచిక్కడం లేదట.కవిత వ్యాఖ్యలపై పార్టీ నుంచి ఎంత మంది మాట్లాడినా ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు స్పందిస్తే ఎఫెక్ట్ వేరేగా ఉంటుందని చర్చించుకుంటున్నారట. లేకపోతే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అయోమయా నికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇదే సమయంలో కవిత ఆరోప ణలను అధినేత కేసీఆర్ కాకపోయినా కనీసం కేటీఆర్, హరీశ్‌రావు ఖండించకపోతే పార్టీకి నష్టం జరగడంతో పాటు ప్రత్యర్ధి రాజకీయ పార్టీలకు అస్త్రాలుగా మారతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంద
పార్టీ మహిళా నేతలతో కవితకు కౌంటర్ ఇప్పించినా అది ప్రజల్లోకి వెళ్లదని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై ఆమె ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్లు సమాధానం చెప్తేనే బాగుం టుందన్న ఒపీనియన్స్ వస్తున్నాయట. అయితే కవిత అంతలా ఫ్యామిలీ మెంబర్స్‌ను టార్గెట్ చేస్తున్నా వాళ్లు మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం వేరే ఉందన్న టాక్ వినిపిస్తోంది. కవిత ఎంత కాదనుకున్నా తమ కుటుంబ సభ్యురాలేనని, అధినేత కేసీఆర్ కూతురు కాబట్టి..ఆమె ఎన్ని ఆరోప ణలు చేసినా కేటీఆర్, హరీశ్‌రావు మౌనంగా ఉండాల్సి వస్తోందట.
No comments:
Post a Comment