____________________________________________
*నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు... జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ శ్రీజ*
*****
**సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్*
____________________________________________
ఖమ్మం, జనవరి -16: నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు.జిల్లా ఇంచార్జి కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి జనవరి 18న జరుగనున్న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా *జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ* ముఖ్యమంత్రి పర్యటనపై అధికారిక సమాచారం, మినెట్ టు మినెట్ షేడ్యూల్ వచ్చే లోపు అవసరమైన సన్నద్ధత ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. జనవరి 18న ఉదయం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి హెలిప్యాడ్ లో ల్యాండ్ అయి జెఎన్టియు కళాశాల భవన నిర్మాణానికి, మున్నేరు నుండి పాలేరు లింక్ కెనాల్ కు శంకుస్థాపనలు, నూతన మార్కెట్ యార్డు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, కూసుమంచి 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవ పైలాన్ ల ఆవిష్కరణ, అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.ముఖ్యమంత్రి పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు జరగాలని, ముఖ్యమంత్రి కాన్వాయ్ లో వినియోగించే వాహనాలను ముందస్తుగానే చెక్ చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలలో పూర్తి బందోబస్తు ఉండాలని, అవసరమైన అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నర్సింగ్ కళాశాల, సర్దార్ పటేల్ స్టేడియం వద్ద హెలీ ప్యాడ్ ను డిజిసిఏ స్టాండర్డ్ ప్రకారం ఏర్పాటు చేయాలని, అక్కడ ఫైర్ వాహనం సిద్ధంగా ఉంచాలని అన్నారు. జిల్లాలోని సీనియర్ వైద్యులతో కూడిన బృందాన్ని ప్రోటోకాల్ ప్రకారం 108 వాహనంతో సహా ముఖ్యమంత్రి కాన్వాయ్ లో సిద్ధం చేయాలని అన్నారు.జిల్లాలో ఉన్న అతిథి గృహాలను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నాణ్యమైన స్నాక్స్ అందజేయాలని, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సర్టిఫై చేయాలని అన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన విధులు నిర్వహించే అధికారులకు ప్రత్యేకమైన ఐడి కార్డులు అందించాలని, మీడియాతో సమన్వయం చేసుకుంటూ మంచి కవరేజ్ వచ్చే విధంగా చూడాలని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి బ్రీఫ్ నోట్స్ శాఖల వారిగా అధికారులు తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment