Thursday, 8 January 2026

దర్శక రచయిత కొత్తపల్లి శేషుకు అంతర్జాతీయ అవార్డు

ఓ కలం కార్మికుడు..
ఓ రచయిత..
ఓ నటుడు..
ఓ కామెడియన్..
ఓ శిక్షకుడు... అతనే "కొత్తపల్లి శేషు"
ఏమిటి..ఓ సాంబారు..ఓ పులిహోర..ఓ బొబ్బట్టు..ఓ చెకొడి..ఓ పకోడి ఏం కాదు అనుకుంటున్నారా... 
అవన్నీ కలగలిసిన వివాహ భోజనం తింటే ఎంత రుచిగా వుంటుందో..ఎంత కడుపు నిండుగా ఉంటుందో ...
30 సంవత్సరాలుగా కామెడీ పంచులతో నటన..రచనా వ్యాసంగం కళా రంగంలో రాణిస్తున్న  దర్శకుడు కొత్తపల్లి శేషు  సినీ..టివీ.యూట్యూబ్ వంటి వాటి ద్వారా జన రంజకమైన కార్యక్రమాలు అంతే ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతాయి.. 
అసలు మేటర్ ఏంటి అంటారా..
అక్కడే కే వచ్చేశాం.. ఇదిగిదిగో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడవ  ప్రపంచ తెలుగు మహా సభలలో ప్రముఖ రచయిత, దర్శకుడు కొత్తపల్లి శేషు రూపొందించిన లఘు చిత్రం "మహాశయులూ మళ్లీ పుట్టండి" అనే లఘు చిత్రానికి ప్రత్యేక బహుమతి లభించింది.
ఈ పురస్కారాన్నీ  ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ మానవేంద్ర రాయ్, ఎన్టీఆర్ తెలుగు లిటరరీ సంస్థ అధ్యక్షుడు శ్రీ జనార్ధన్ ,ప్రముఖ గజల్ గాయకుడు శ్రీ గజల్ శ్రీనివాస్ తదితరులు కొత్తపల్లి శేషు బృందానికి అందజేశారు, ఈ అవార్డుని కొత్తపల్లి శేషు తో పాటు ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ గాయకులు కొమ్ము రమేశ్, అజిత, కావేరి రామ్, లింగేష్ యాదవ్ అందుకున్నారు. ఎంతో పోటా పోటీ గా జరిగిన ఈ పోటీలలో ప్రత్యేక బహుమతిలభించటం, ఈ పురస్కారం ప్రముఖల ద్వారా గుంటూరు లోని ఎన్టీఆర్ ప్రాంగణం లో అందుకోవటం ఎంతో సంతోషంగా ఉందని దర్శకుడు కొత్తపల్లి శేషు, నటులు కొమ్ము రమేశ్, అజిత, కావేరి రామ్, లింగేష్ అన్నారు.
Director Kothapalli Seshu receives an international award: In the third World Telugu Conference organized under the auspices of the Andhra Saraswata Parishad, the short film "Mahashayulu Malli Puttandi" (Gentlemen, Be Reborn), directed by renowned writer and director Kothapalli Seshu, received a special award. This award was presented to Kothapalli Seshu and his team by Andhra Pradesh Legislative Assembly Speaker Sri Chintakayala Ayyanna Patrudu, State High Court Judge Sri Justice Manavendra Roy, NTR Telugu Literary Organization President Sri Janardhan, renowned Ghazal singer Sri Ghazal Srinivas, and others. Along with Kothapalli Seshu, prominent singers from Khammam city, Kommu Ramesh, Ajitha, Kaveri Ram, and Lingesh Yadav, received the award. Director Kothapalli Seshu and actors Kommu Ramesh, Ajitha, Kaveri Ram, and Lingesh expressed their immense joy at receiving this special award in such a highly competitive event, and at receiving the award from prominent personalities at the NTR premises in Guntur.
-
डायरेक्टर कोथापल्ली सेशु को इंटरनेशनल अवॉर्ड मिला: मशहूर राइटर और डायरेक्टर कोथापल्ली सेशु की डायरेक्ट की हुई शॉर्ट फिल्म "महासयालु मल्ली पुट्टांडी" को आंध्र सरस्वती परिषद की तरफ से ऑर्गनाइज़ की गई थर्ड वर्ल्ड तेलुगु महासभा में स्पेशल अवॉर्ड मिला।यह अवॉर्ड कोथापल्ली सेशु ग्रुप को आंध्र प्रदेश लेजिस्लेटिव असेंबली के स्पीकर श्री चिंतकयाला अय्याना पत्रुडू, स्टेट हाई कोर्ट के जज श्री जस्टिस मानवेंद्र रॉय, NTR तेलुगु लिटरेरी सोसाइटी के प्रेसिडेंट श्री जनार्दन, मशहूर ग़ज़ल सिंगर श्री ग़ज़ल श्रीनिवास और दूसरों ने दिया। कोथापल्ली सेशु के साथ, खम्मम शहर के मशहूर सिंगर कोम्मू रमेश, अजीता, कावेरी राम और लिंगेश यादव को यह अवॉर्ड मिला। डायरेक्टर कोथापल्ली सेशु, एक्टर कोम्मू रमेश, अजीता, कावेरी राम और लिंगेश ने कहा कि वे इन बहुत कॉम्पिटिटिव कॉम्पिटिशन में स्पेशल प्राइज़ पाकर और गुंटूर में NTR कैंपस में सेलिब्रिटीज़ से यह अवॉर्ड पाकर बहुत खुश हैं।

No comments:

Post a Comment